శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల కొండపై బుధవారం ఓ విప్లవాత్మక మార్పునకు అడుగు పడింది. తిరుమల కొండపై యూపీఐ చెల్లింపుల విధానాన్ని తిరుపతి తిరుమల దేవస్థానం (టీటీడీ) ప్రారంభించింది. భక్తులకు వసతి గదుల కేటాయింపు కౌంటర్లలో ఈ నూతన చెల్లింపు విధానానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ఈ కౌంటర్లలో యూపీఐ చెల్లింపులకు లభించే ఆదరణను బట్టి… కొండపై అన్ని రకాల సేవల చెల్లింపు విధానాలకు యూపీఐని అనుమతించే దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది.
పారదర్శక సేవలు, అవకతవకలకు ఆస్కారం లేని చెల్లింపులే లక్ష్యంగా యోచించిన టీటీడీ… కొండపై ఆయా సేవల చెల్లింపుల విధానాలకు యూపీఐని వర్తింపజేయాలని భావించింది. అయితే ఈ కొత్త చెల్లింపు విధానంపై భక్తుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్న దానిని అంచనా వేసేందుకు తొలుత వసతి గదుల కేటాయింపు కౌంటర్లలో ఈ నూతన చెల్లింపు విధానానికి టీటీడీ బుధవారం శ్రీకారం చుట్టింది.