టిటిడి మీరు క్విడ్‌ప్రోకో ద్వారా దోచిన లక్షల కోట్లతో పెట్టిన సూట్‌కేసు కంపెనీ కాదు
– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
వైవీ సుబ్బారెడ్డి గారూ! లాభాలు, జే ట్యాక్స్ లెక్కేసుకోవడానికి టిటిడి మీరు క్విడ్‌ప్రోకో ద్వారా దోచిన లక్షల కోట్లతో పెట్టిన సూట్‌కేసు కంపెనీ కాదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల నమ్మకం. పరమపవిత్రమైన ఆధ్యాత్మికక్షేత్రం. ఆపద మొక్కులవాడి చెంతకొచ్చేవారిని ఆపదలోకి నెట్టేసింది మీరు కాదా! అనాథరక్షకుడిని వేడుకునేందుకు వచ్చిన వారికి దర్శనభాగ్యం దొరకుండా చేసింది మీ పాలకవర్గం కాదా?
వందల ఏళ్ల తిరుమల చరిత్రలో ఎన్నడూ లేనంతగా మీ పాలకవర్గం వ్యాపారధోరణితో అందరివాడైన గోవిందుడిని సామాన్యులకి అందనివాడిగా చేసింది. సర్వదర్శనం టోకెన్ల జారీలో నెలకొన్న గందరగోళం, పంపిణీలో అస్తవ్యస్త పద్ధతితో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు గాయపడినా మీరు స్పందించరా? మండే ఎండలో టోకెన్ల కోసం చిన్నపిల్లలు, వృద్ధులతో శ్రీవారి భక్తులకు అష్టకష్టాలు పెట్టడం మీకు న్యాయమేనా?
శ్రీవారి సేవలు, టికెట్లు, ప్రసాదం రేట్లు మూడింతలు పెంచడంపై వున్న ఆరాటం…భక్తులకి కనీస సౌకర్యాలు కల్పించడంలో లేదు. వీఐపీల సేవలో తరిస్తోన్న టిటిడికి సామాన్య భక్తులు నానా అగచాట్లు పడుతున్నా పట్టించుకోకపోవడం తీవ్ర విచారకరం. అధికారం శాశ్వతం కాదు. మీ లాబీయింగ్, వ్యాపారాల కోసం శ్రీవారిని సామాన్య భక్తులకు దూరం చేయొద్దు. ఆ దేవదేవుడు అన్నీ చూస్తున్నాడు.