Suryaa.co.in

Andhra Pradesh

మార్చి 23న విశాఖ‌లో శ్రీ‌వారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణకు ఏర్పాట్లు పూర్తి

విశాఖ‌ప‌ట్నంలో టిటిడి నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో మార్చి 23న బుధవారం మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉద‌యం 9 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు విగ్ర‌హ‌ప్ర‌తిష్ట‌, మ‌హాసంప్రోక్ష‌ణ నిర్వ‌హిస్తారు.

కాగా, మంగ‌ళ‌వారం ఉద‌యం 9 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు బింబ‌వాస్తు, న‌వ‌క‌ల‌శ స్న‌ప‌నం, చ‌తుర్ద‌శ క‌ల‌శ స్న‌ప‌నం, యాగ‌శాల కార్యక్ర‌మాలు నిర్వహించారు. తిరిగి సాయంత్రం 4 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు మ‌హాశాంతి తిరుమంజ‌నం, రాత్రి 8 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు ర‌క్షాబంధ‌నం, కుంభారాధ‌నం, నివేద‌న‌, శ‌య‌నాధివాసం, హౌత్రం, స‌ర్వ‌దేవ‌తార్చ‌న‌, హోమం, యాగ‌శాల కార్య‌క్ర‌మాలు చేపట్టారు.

మార్చి 23న బుధ‌వారం ఉద‌యం 5.30 నుండి 8 గంట‌ల వ‌ర‌కు కుంభారాధ‌న‌, నివేద‌న‌, హోమం, మ‌హాపూర్ణాహుతి, ఉద‌యం 9 గంట‌ల‌ నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు కుంభాల‌ను, ప్ర‌ధాన దేవ‌తా విగ్ర‌హాల‌ను ప్ర‌ద‌క్షిణగా ఆల‌యంలోకి తీసుకొచ్చి ఉద‌యం 9.50 నుండి 10.20 గంట‌ల మ‌ధ్య వృష‌భ ల‌గ్నంలో మ‌హాసంప్రోక్ష‌ణ నిర్వ‌హిస్తారు. ఆ త‌రువాత ధ్వ‌జారోహ‌ణం, అర్చ‌క బ‌హుమానం అందిస్తారు. సాయంత్రం 3 నుండి 4.15 గంట‌ల వ‌ర‌కు క‌ల్యాణోత్స‌వం జ‌రుగ‌నుంది. అనంత‌రం ధ్వ‌జావ‌రోహ‌ణం చేప‌డ‌తారు.

LEAVE A RESPONSE