హైవేలపై 60 కి.మీల పరిధిలో ఒకే టోల్ ప్లాజా

– వాహనదారులకు శుభవార్త
– టోల్‌ప్లాజాలపై కీలక నిర్ణయం
– రోడ్లను అమెరికాలా మారుస్తామన్న గడ్కరీ

అధిక టోల్‌ప్లాజాలతో సతమతమవుతున్న వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఇప్పటికే పెట్రో ధరలతో వాహనాన్ని రోడ్డెక్కించేందుకు వణుకుతున్న వాహనదారులు.. అడుగుడగునా ఏర్పాటు చేసిన టోల్ ప్లాజాల వద్ద టోల్ చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు.

ఈ క్రమంలో టోల్ సమస్యలను కొంతలో కొంత తగ్గించేందుకు రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక నిర్ణయం తీసుకున్నారు.హైవేలపై 60 కి.మీల పరిధిలో ఒకే టోల్ ప్లాజా ఉండేట్లు చర్యలు తీసుకుంటామని పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి తెలిపారు.

ఒకవేళ 60 కి.మీల పరిధిలో రెండు, అంతకంటే ఎక్కువ టోల్ ప్లాజాలు ఉన్నట్లైతే మూడు నెలల్లోనే వాటిని మూసివేసి, ఏడాదిలోపు వాటిని తొలగిస్తామని చెప్పారు. అయితే, 2024 చివరినాటికి దేశంలోని రోడ్లను అమెరికా రోడ్లలా మారుస్తామని ఆయన ప్రకటించారు.

Leave a Reply