– ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి కార్యనిర్వాహక అద్యక్షుడు డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి
అమరావతి : వజ్రోత్సవాలు అనే అచ్చమైన తెలుగు పదాన్ని ఉచ్చరించలేని జగన్ తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మన దౌర్భాగ్యం అని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి కార్యనిర్వాహక అద్యక్షుడు డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి అన్నారు. మేనిఫెస్టో లో పేర్కొన్న అంశాలలో 95శాతం అమలు చేశామని చెప్పడం పచ్చి అపధ్ధమని, పేదల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. వికేంద్రీకరణ పట్ల చిత్తశుద్ధి వుంటే గ్రామ పంచాయితీలు, తదితర స్థానిక సంస్థలకు విధులు, నిధులు, అధికారాలు బదిలీ చేయాలని కోరారు. ముఖ్యమంత్రి ప్రసంగం యావత్తూ అబద్ధాలు, అబద్దాలు, అబధ్ధాలు అని తులసి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.