Suryaa.co.in

Andhra Pradesh

నాడు ముద్దులు…నేడు గుద్దులు – ఇది జగన్ రెండున్నరేళ్ళపాలన

– నాడు జగన్ రావాలి – జగన్ కావాలి , నేడు జగన్(దిగి)పోవాలి – జగన్ వద్దు
– నాడు అచ్చే దిన్ – నేడు చచ్చేదిన్
– నాడు సబ్ కా వికాస్ – నేడు సభ్ కా వినాస్ – ఇదీ నరేంద్ర మోడీ పాలన
అందుకే బద్వేలు ఉప ఎన్నికలో వైకాపా, బీజేపీని ఓడించాలి, కాంగ్రెస్ ను గెలిపించాలి – బద్వేలు ఓటర్లకు ఏపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు తులసి రెడ్డి విజ్ఞప్తి
వేంపల్లె : నాడు ముద్దులు..నేడు గుద్దులు…ఇది జగన్ రెండున్నరేళ్ళపాలనగా సాగుతోందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్య నిర్వాహక అధ్యక్షులు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు జగన్ తన పాదయాత్రలో ప్రజలకు ముద్దులు పెడుతూ ఎన్నో హామీలు ఇచ్చారని, మేనిఫెస్టోలో సైతం పెట్టారని, అధికారంలోకి వచ్చాక నాటి ముద్దులను, హామీలను, మేనిఫెస్టో ను విస్మరించి ప్రజలను ప్రజా వ్యతిరేఖ విధానాలతో పిడి గుద్దులు గుద్దుతున్నారని విమర్శించారు.
మంగళవారం ఆయన ఈ మేరకు వేంపల్లెలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎన్నికల ముందు నాటి రైతు భరోసా నేడు రైతు నిరాశా పధకమైందని, నాటి ఆరోగ్యశ్రీ నేడు అనారోగ్య శ్రీ అయిందని విమర్శించారు. అమ్మ ఒడి నాన్న సారా బుడ్డికి చాలడంలేదన్నారు. 2.80 లక్షల మంది అవ్వా , తాతల పింఛన్లు నెలకు రూ.3000 ఇస్తానని ఇవ్వడంలేదని, ఉన్నత విద్యకు ఫీజు రీ యంబర్స్ మెంట్ తీసివేసి పేద విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేసి పేద విద్యార్థుల పాలిట జగన్ శకుని మామగా, కంసుని మామగా తయారయ్యాడని ఆరోపించారు. పేదలందరికీ ఇల్లు కట్టి ఇస్తానని చెప్పి ఈ రెండున్నర ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టించలేదన్నారు.
ఉద్యోగుల విద్యల్లో, కరెంటు చార్జీల విషయంలో, ధరల విషయంలో జగన్ ప్రభుత్వం మాట తప్పిందని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలకు అచ్చే దినాలు వస్తాయని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజలకు చచ్చే దినాలు తెచ్చినదని, సబ్ కా వికాస్ బదులు సబ్ కా వినాస్ జరుగుతోందని తులసిరెడ్డి ధ్వజమెత్తారు. బద్వేలు ఉప ఎన్నికల్లో రాష్ట్రానికి మోసం, ద్రోహం, అన్యాయం చేసిన వైసీపి, బీ

LEAVE A RESPONSE