– నమూనాలిస్తే అంతా నిరూపిస్తా
– రక్త, వెంట్రుక నమూనాలిచ్చే దమ్ముందా?
– నేను తంబాకు తింటానని పచ్చి అబద్దాలు చెప్పినవ్ కదా….
– నేను ఏ పరీక్షకైనా సిద్ధం
– హైదరాబాద్, బెంగళూరు డ్రగ్ కేసులను రీ ఓపెన్ చేయించాల్సిందే
– జీ-20 నిర్వహణ సమావేశానికి కేసీఆర్ వెళ్లకపోవడం సిగ్గు చేటు
– దేశంలోని అన్ని పార్టీలు, అందరు సీఎంలు వెళ్లినా … కేసీఆర్ ఎందుకు వెళ్లలేదో సమాధానమివ్వాలి
– ఆ సమయంలో బిడ్డను సారా దందా స్కాం నుండి ఎట్లా కాపాడుకోవాలనే దానిపై లాయర్లతో మంతనాలు
– అంబేద్కర్ జయంతి, వర్దంతిలకు హాజరుకాని మూర్ఖుడు కేసీఆర్
– అంబేద్కర్ స్పూర్తితో శక్తివంతమైన దేశంగా మార్చుతున్న గొప్ప నాయకుడు మోదీ
– ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ ఫైర్
– ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కు నివాళి
కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు డ్రగ్స్ వాడతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. రక్త, వెంట్రుక నమూనాలిస్తే నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ‘‘నేను తంబాకు తింటానని పచ్చి అబద్దాలు చెప్పినవ్ కదా… నాకు ఆ అలవాటే లేదని నిరూపిస్తా. అందుకోసం రక్త నమూనాలతోసహా నా శరీరంలోని ఏ భాగమైన పరీక్షలకు ఇచ్చేస్తా…. మరి నీకు రక్తపు, రెండు వెంట్రుకల నమూనాలిచ్చే దమ్ముందా?’’అంటూ సవాల్ విసిరారు. ట్విట్టర్ టిల్లు బండారం బయటపడుతుందనే భయంతోనే బెంగళూరు, హైదరాబాద్ డ్రగ్స్ కేసులను మూసివేయించారని అన్నారు. తక్షణమే ఆ కేసులు రీ ఓపెన్ చేసి విచారణ జరపాలని దర్యాప్తు సంస్థలను కోరారు.
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ ఈరోజు నిర్మల్ జిల్లాలోని మామ్డ మండలం దిమ్మదుర్తి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీ సోయం బాపూరావు, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా, బీసీ, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలె భాస్కర్, గీతామూర్తి, జిల్లా అధ్యక్షురాలు పి.రమాదేవి రాష్ట్ర నాయకులు దరువు ఎల్లన్న తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు…
అంబేద్కర్ జయంతి సందర్భంగా కనీసం వారం రోజుల పాటైనా ఉత్సవాలు నిర్వహించాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.అంబేద్కర్ వర్ధంతి, జయంతిలకు TRS పార్టీ ఒక గంట సమయం కూడా కేటాయించదు.కేసీఆర్ ఇంటి నుంచి బయటికే రాడు.అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పాలన కొనసాగిస్తోంది.వారం రోజులపాటు బస్తీ బస్తీలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాలను బిజెపి ప్రభుత్వం వచ్చాక నిర్వహిస్తాం.
అంబేద్కర్ చరిత్రను తెలియజేయాల్సిన అవసరం మనపై ఉంది.నేను ఈరోజు ఎంపీ ని అయ్యాను అంటే… అది అంబేద్కర్ పెట్టిన భిక్షనే.అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఈ దేశాన్ని మోడీ పాలిస్తున్నారు.మోడీ ప్రధాని అయ్యాకే పేదోళ్లకు ఈ దేశంలో న్యాయం జరుగుతోంది.రామ్నాథ్ కోవింద్ ను భారత రాష్ట్రపతి ని చేసిన ఘనత మోడీదే.పార్లమెంటులో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిన పార్టీ బిజెపినే.అంబేద్కర్ చరిత్రను ప్రపంచానికి తెలియజేసేందుకే… ‘పంచ తీర్థాల’ పేరుతో అభివృద్ధి చేస్తున్నాం.12 మంది ఎస్సీ ఎంపీలను, కేంద్ర మంత్రులుగా చేసిన ఘనత కూడా మోడీదే.ఎంతోమంది ఎస్సి లను గవర్నర్లు, ముఖ్యమంత్రు లుగా చేసిన ఘనత బిజెపి దే.ప్రతి సంవత్సరం 1,20,000 మంది దళిత యువకులను, పారిశ్రామికవేత్తలుగా మార్చుతున్న ఘనత బిజెపి దే. అంబేద్కర్ వర్ధంతికి కెసిఆర్ బయటకి రాడు.
జి20 దేశాల్లో భారతదేశానికి అధ్యక్షత వహించే అవకాశం రావడం మనందరికీ గర్వకారణం.జి 20 సదస్సులో అందరి సూచనలను తీసుకునేందుకు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను, పార్టీ అధ్యక్షులను మోదీ ఆహ్వానిస్తే… కేసీఆర్ ఎందుకు గైర్హాజరయ్యారు?జి 20 సన్నాహక సమావేశాని కంటే కేసీఆర్ కు ఇక్కడ పీకే పనేముంది?కేసీఆర్ దళితుడిని సీఎం చేశాడా?దళితులకు మూడెకరాల పంపిణీ హామీ ఏమైంది?కేసీఆర్ దృష్టిలో.. దళితుడికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదు.అంబేద్కర్ జయంతి, వర్ధంతి లకు కేసిఆర్ ఎందుకు బయటకు రాడు?
కెసిఆర్ తప్ప, దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు వెళతారు.అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్నే కేసీఆర్ మారుస్తానంటున్నాడు… కేసీఆర్ అంతా పోటుగాడా?తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తేవాలని చూస్తున్నాడు.ప్రశ్నించక పోవడంతోనే ముఖ్యమంత్రికి బలుపెక్కి, బరితెగించి ఈరోజు మనల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నాడు.నేటికీ తెలంగాణ దళిత బస్తీల్లో కనీస సౌకర్యాలు లేవు.
400 మంది పేదోళ్ల ఆత్మ బలిదానాలతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది.కేసీఆర్ పాలనలో రైతులు, నిరుద్యోగులు, పేదోళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.దొంగ సారా దందా చేసిన బిడ్డను కాపాడుకునేందుకే… కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడు.దళిత బంధు, నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి మాత్రం పైసలు లేవు… దండుకోడానికి మాత్రం పైసలు ఉన్నాయి.
రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల దిబ్బగా మార్చండి.పుట్టబోయే ప్రతి బిడ్డపై లక్ష రూపాయలు అప్పు పెట్టిండు.కేసీఆర్ బిడ్డ కవిత ఢిల్లీ పోయి లక్ష కోట్ల లిక్కర్ దందా చేసింది.కేసీఆర్ కుటుంబం విదేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టింది.కేసీఆర్ బిడ్డ సారా దందా చేస్తే… తెలంగాణ ప్రజలు ఉద్యమం చేయాలా?లిక్కర్ దందా చేస్తే.. దర్యాప్తు సంస్థలు గుంజుకు పోవా?లిక్కర్ దందాలో కవిత 10 ఫోన్లను ధ్వంసం చేసింది.అక్రమంగా సంపాదించిన సొమ్ముతో… ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకుందిఅవినీతిలో అయ్యకు తగ్గ బిడ్డగా కవిత గుర్తింపు పొందింది.
తెలంగాణ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నాడు. లిక్కర్ దందాలో అడ్డంగా దొరికిన కవితను అరెస్టు చేస్తే… రాష్ట్రంలో ప్రజలు ధర్నా చేయాలా?డ్రగ్స్ దందా వారిదే.ట్విట్టర్ టిల్లుకు తంబాకుకు, లవంగానికి కూడా తేడా తెలీదు.డాక్టర్ దగ్గరికి వెళ్లి కేటీఆర్ వి రెండు వెంట్రుకలు ఇస్తే చాలు. డ్రగ్స్ తీసుకున్నాడో లేదో తెలుస్తుంది. ఒకవేళ నేను తంబాకు తిన్నట్లయితే.. నా లివరు, కిడ్నీ ఏదైనా టెస్ట్ చేసుకోవచ్చు.బెంగళూరు డ్రగ్స్, హైదరాబాద్ డ్రగ్స్ కేసును పక్కా రీఓపెన్ చేయిస్తాం.
లంగదందాలు… దొంగ దందాలు చేస్తే .. చూస్తూ ఊరుకుంటామా?అవినీతిపరులు జైలుకు వెళ్లక తప్పదు.ఎన్నికలప్పుడు ప్రజలంతా జాగృతం కావాలి… చైతన్యవంతులు కావాలి. మునుగోడులో దొంగ ఓట్లు రాయించుకుని టిఆర్ఎస్ గెలిచింది. అది గెలుపే కాదు.మునుగోడులో నైతిక గెలుపు, నిజమైన గెలుపు బిజెపి దే.పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు బిజెపి మద్దతు ఇచ్చినందుకే.. ఈ రాష్ట్ర0 ఏర్పడింది.తెలంగాణ ద్రోహి కేసీఆర్.పేదల రాజ్యం వస్తేనే… ప్రజా సమస్యలు తీరుతాయి. ఒక్క అవకాశం బీజేపీకి ఇవ్వండి.