– పదిమంది దాకా మృతి?
– శిథిలాలయం తొలగిస్తున్న సహాయక బృందం
– ఇద్దరు చిన్నారులను బయటకు తీసిన రెస్క్యూ టీం
అనంతపురం:ఒకవైపు అనంతపురం జిల్లా ను వరదలు ముంచెత్తిన ఉంటే… కదిరి పట్టణం లో భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. నాన్పుడు వర్షాలకు 2 భవనాలు కూలిపోయాయి. స్థానిక చైర్మన్ వీధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున 4 గంట సమయంలో నిద్రలో ఉండగా సంఘటన చోటు చేసుకుంది. భవన శిథిలాలను పోలీసులు, రెస్క్యూ టీం అధికారులు యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. ఇద్దరు చిన్నారుల భౌతిక కాయలను బయటకు తీశారు.శిథిలాల తొలగింపు కొనసాగుతోంది.