Suryaa.co.in

Andhra Pradesh

మంత్రి రజని ఇలాకాలో మద్యం తాగి ఇద్దరు మృతి

ఏపీ వైద్యశాఖ మంత్రి రజనీ ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గంలో.. మద్యం తాగిన ఇద్దరు మృతి చెందటం సంచలంగా మారింది. ఇద్దరూ ఒకే బ్రాండ్ తాగడం.. ఇద్దరూ ఒకేసారి మృతి చెండటం.. అందునా రంజాన్ పవిత్ర దినంరోజునే షరీఫ్, బషీర్ మృతి చెందడం అటు మైనారిటీల్లోనూ విషాదం అలుముకుంది. ఈ ఘటనపై స్థానిక మైనారిటీ సంఘాలు ఆందోళనకు దిగాయి. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

పల్నాడు జిల్లా లోని చిలకలూరిపేటలో మద్యం తాగిన ఇద్దరు మృతి చెందారు. మద్యం తాగి అస్వస్థతకు గురైన మస్తాన్ షరీఫ్(52), బషీర్ అహ్మద్(35)గా గుర్తించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ షరీఫ్‌, బషీర్‌ ప్రాణాలుకోల్పోయారు. అయితే మృతుల కుటుంబాలను మాజీమంత్రి పుల్లారావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒకే బాటిల్‌ మద్యం తాగిన బషీర్, మస్తాన్ మృతిచెందాదరని చెప్పారు. మృతులు తాగిన చీప్ లిక్కన్‌ను ల్యాబ్‌కు పంపాలని సూచించారు. అలాగే మృతి ఘటనపై న్యాయ విచారణ జరిపించాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE