ఇటీవల పుష్పకు సంబంధించిన ఒక కార్యక్రమంలో వేదిక మీద సాక్షాత్తు తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్ కి.. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు ఏమిటి అనేది జీవితాంతం గుర్తుండిపోయేలా చేశారు రేవంత్ రెడ్డి.
పుష్ప -2 సినిమాలో పోలీసు అధికారిని స్విమ్మింగ్ ఫూల్లో దొబ్బేసి అక్కడ మూత్రం పోసే అవమానకరమైన, అసహ్యమైన సన్నివేశం చాలామంది పోలీసు అధికారుల ఇగోని రెచ్చగొట్టింది అని టాక్. పోలీసుల మీద ఇలాంటి సన్నివేశాలు గతంలో ఉండవచ్చు. కానీ ఇంత అసహ్యకరమైన సన్నివేశాలు ఏనాడూ లేవు కదా? ఆ కసిని పోలీసులు ఇలా తీర్చుకున్నారని ప్రేక్షకుల టాక్.
సంధ్య థియేటర్ దుర్ఘటన మీద కేసు పెట్టి అరెస్టు చేయాలి అనుకుంటే, ఇన్ని రోజులు వేచి చూడాల్సిన అవసరం లేదు. ఎంత ప్లాను లేకపోతే శుక్రవారం నాడు అరెస్టు చేసి జైల్లో వేసేలా చేస్తారు? మధ్యంతర బెయిల్ ఇప్పుడు వచ్చి ఉండవచ్చు. కానీ లేకపోతే మూడు రోజులు జైల్లో మగ్గి ఉండాల్సింది. అక్కడికి ఒక రోజు జైల్లో వేసి తమ ఇగో ని ముఖ్యమంత్రి మరియు పోలీసులు సంతృప్తి పరుచుకున్నారు అనిపిస్తుంది. అందుకే బెయిల్ పేపర్ల వ్యవహారాన్ని రాత్రి పొద్దుపోయేదాకా నడిపించారట!
– ప్రవీణ్