Suryaa.co.in

Andhra Pradesh

కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు అధికారులకు జైలు, జరిమానా..

అమరావతి: కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు అధికారులకు ఏపీ హైకోర్టు జైలు, జరిమానా విధించింది. రాజంపేట సబ్‌ కలెక్టర్‌ గార్గ్ ఖాతాన్,aphc1ఏపీఎండీసీ సీపీవో మధుసూధనరెడ్డికి 6 నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానాను కోర్టు విధించింది. నరసమ్మ అనే మహిళకు పరిహారం చెల్లించాలని గతంలో కోర్టు ఆదేశించింది. పరిహారం చెల్లింపులో కోర్టు ఆదేశాలు అధికారులు బేఖాతరు చేశారు. నరసమ్మ తరపు లాయర్‌ సీహెచ్‌ శ్రీనివాస్‌ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. వారంలోగా హాజరుకావాలని ఇద్దరు అధికారులకు ఏపీ హైకోర్టు ఆదేశించింది.

LEAVE A RESPONSE