పాలకవర్గంలోనూ ‘రెడ్డి’ కార్పెట్
ఢిల్లీ లిక్కర్ కేసు ముద్దాయి శరత్‌చంద్రారెడ్డికి చోటు
అక్రమాలకు పాల్పడి సస్పెండైన డాక్టర్ దేశాయ్‌కూ స్థానం
అక్రమార్కులకు చోటివ్వడంపై భక్తుల్లో ఆగ్రహం
టీటీడీ బోర్డు సభ్యులను జగన్ సర్కారు ప్రకటించింది. ఆ మేరకు 24 మంది సభ్యుల జాబితాను ప్రకటించింది. అందులో డిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడు, అప్రూవర్‌గా మారిన శరత్‌చంద్రారెడ్డిని బోర్డు సభ్యుడిగా నియమించారు. ఈయన ఎంపీ విజయసాయిరెడ్డి సమీప బంధువు. 2001లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా ఉంటూ అక్రమాలకు పాల్పడి సస్పెండైన, గుజరాత్‌కు చెందిన యూరాలజిస్ట్ డాక్టర్ కేతన్ దేశాయ్ కూడా ఉండటం విశేషం.
ఇక టీటీడీ చైర్మన్ రేసులో ఉన్న మాజీ మంత్రి శిద్దా రాఘవరావుకు, దాని బదులు ఆయన కొడుకు శిద్దా సుధీర్‌కు టీటీడీ బోర్డు సభ్యత్వం ఇచ్చి, నాయకత్వం బుజ్జగించినట్లు కనిపిస్తోంది. దైవభక్తి మెండుగా ఉన్న శిద్దా కుటుంబానికి, అందుకు తగిన పదవి లభించడం ప్రస్తావనార్హం.
కమిటీలోనూ ‘రెడ్డి’ కార్పెట్
టీటీడీ పాలకవర్గంలోనూ జగన్.. తన సామాజికవర్గానికి ‘రెడ్డి’ కార్పెట్ వేయడం విశేషం. తాజా పాలకవర్గంలో ఐదుగురు రెడ్లు ఉండగా, చైర్మన్ భూమన కూడా రెడ్డి వర్గానికి చెందిన వారే కావడం ప్రస్తావనార్హం. దానితో చైర్మన్‌తో కలిపి, ఆరుగురు రెడ్లకు పెద్దపీట వేసినట్టయింది. టీటీడీ చైర్మన్, ఈఓ కూడా రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే కావడం విశేషం.
కాగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొని, జైలుకు వెళ్లిన వారిని కూడా పాలకవర్గంలో నియమించడంపై, భక్తుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో జైల్లో ఉండి, బెయిల్‌పై బయటకొచ్చిన శరత్‌చంద్రారెడ్డిని, ఏ ప్రాతిపదికన బోర్డు సభ్యునిగా నియమించారన్న ప్రశ్నలు, భక్తుల నుంచి వినిపిస్తున్నాయి. రేపు మళ్లీ కోర్డు ఆయన బెయిల్ రద్దు చేసి జైలుకు పంపిస్తే, స్వామివారి పవిత్రతకు అర్ధం ఏముంటుందని నిలదీస్తున్నారు. ఒక కేసులో అప్రూవర్‌గా మారాడంటే, నేరం అంగీకరించినట్లే అర్ధమని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు.
గుజరాత్లో మెడికల్ సీట్ల వ్యవహారంలో.. అక్రమాలకు పాల్పడిన దేశాయ్‌ను ఏరి వెతికి మరీ టీటీడీ పాలకవర్గంలో నియమించడం సిగ్గుచేటని, భక్తులు విరుచుకుపడుతున్నారు.
కాగా.. సుప్రీంకోర్టు, హైకోర్టు వంటి ఉన్నత న్యాయస్థానాల జడ్జిలతో సహా, పలువురు కేంద్రమంత్రుల వద్దకు వెళ్లి మరీ.. బోర్డు సభ్యుల పేర్లు సూచించమంటూ చేసిన లాబీ విమర్శలకు గురయింది. ఇప్పుడు టీటీడీ బోర్డు జాబితా చూస్తే, అందులో ఎంతమంది ప్రముఖులు సిఫార్సు చేశారో, కొద్దిరోజుల తర్వాత గానీ బయటపడే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
టీటీడీ సభ్యుల జాబితా ఇదీ..
1 పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఎమ్మెల్యే (సభ్యుడు)
2 ఉదయభాను సామినేని ఎమ్మెల్యే (సభ్యుడు)
3 ఎం. తిప్పే స్వామి ఎమ్మెల్యే (సభ్యుడు)
4 సిద్ధవతం యానాదయ్య (సభ్యుడు)
5 చందే అశ్వర్థ నాయక్ (సభ్యుడు)
6 మేకా శేషుబాబు (సభ్యుడు)
7 ఆర్.వెంకట సుబ్బారెడ్డి (సభ్యుడు)
8 ఎల్లారెడ్డి గారి సీతారామ రెడ్డి (సభ్యుడు)
9 గాదిరాజు వెంకట సుబ్బరాజు (సభ్యుడు)
10 పెనక శరత్ చంద్ర రెడ్డి (సభ్యుడు)
11 రామిరెడ్డి సాముల (సభ్యుడు)
12 బాలసుబ్రమణియన్ పళనిసామి(సభ్యుడు)
13 S.R.విశ్వనాథ్ రెడ్డి (సభ్యుడు)
14 గడ్డం సీతారెడ్డి (సభ్యుడు)
15 కృష్ణమూర్తి వైతినాథన్ (సభ్యుడు)
16 సిద్ద వీర వెంకట సుధీర్ కుమార్(సభ్యుడు)
17 సుదర్శన్ వేణు (సభ్యుడు)
18 నెరుసు నాగ సత్యం (సభ్యుడు)
19 ఆర్.వి.దేశపాండే (సభ్యుడు)
20 అమోల్ కాలే (సభ్యుడు)!
21 డా. ఎస్. శంకర్ (సభ్యుడు)
22 మిలింద్ కేశవ్ నార్వేకర్ (సభ్యుడు)
23 డాక్టర్ కేతన్ దేశాయ్ (సభ్యుడు)
24 బోరా సౌరభ్ (సభ్యుడు)