ఢిల్లీ, కోల్‌కతాలో కూడా
ఇప్పటివరకూ కార్లు, టూ వీలర్ సర్వీసులకే పరిమితమైన ఊబర్ ఇకపై బస్సు సర్వీసులో సైతం అడుగుపెడుతోంది. ఢిల్లీ నుంచి తొలి అడుగు వేయనుంది. కోల్‌కతాలో కూడా ఊబర్ సర్వీసును ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారట.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో తొలుత ఈ సేవలను ప్రారంభించనుంది. ఢిల్లీ ప్రీమియం బస్ స్కీమ్ కింద ఇకపై బస్సులను ఊబర్ సంస్థ నడపనుంది. ఈ మేరకు దిల్లీ రవాణా మంత్రిత్వ శాఖ నుంచి తాజాగా లైసెన్స్ అందుకుంది. ఈ తరహా లైసెన్స్ జారీ చేసిన తొలి రవాణా శాఖ ఢిల్లీ నే. దీన్ని అందుకున్న తొలి అగ్రిగేటర్‌గా ఉబర్ నిలిచింది.
ఏడాదిగా ఢిల్లీ -ఎన్‌సీఆర్‌తో పాటు, కోల్‌కతా లోనూ ప్రయోగాత్మకంగా ఈ సేవలు నడుపుతున్నామని ఉబర్ షటిల్ ఇండియా హెడ్ అమిత్ దేశ్ పాండే చెప్పారు. ఢిల్లీ లో బస్సులకు విపరీతమైన డిమాండ్ ఉన్నట్లు గమనించామన్నారు. ఇప్పుడు అధికారికంగా తమ సేవలను దిల్లీలో ప్రారంభించ బోతున్నామని తెలిపారు. ఒక్కో సర్వీసులో 19-50 మంది ప్రయాణించడానికి వీలుంటుందని తెలిపింది.