– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి
భారత రాజ్యాంగం ద్వారా ప్రమాణం చేసిన మంత్రి ఉదయ్‌స్టాలిన్, సనాతాన ధర్మాన్ని దోమల నిర్మూలన చర్యతో పోల్చి నిర్మూలించాలని తన ఆకాంక్షను వ్యక్తం చేయడం హేయమైన చర్య… రాజ్యాంగ విరుద్ధం.
అదే వేదికపై, తమిళనాడులోని హిందూ మతపరమైన మరియు ధర్మాదాయ సంస్థలకు బాధ్యత వహించే @PKSekarbabu ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా మౌనంగా ఉండడాన్ని దేనికి సంకేతం?
సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడమే కూటమి ఉద్దేశమని @INCTamilNadu అధ్యక్షుడు పేర్కొన్నారు. ఈ చర్యలు భారతదేశంలోని హిందూ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి.
విపక్ష కూటమి ఇండియా అని పేరు పెట్టుకోవడానికి కనీస నైతిక హక్కు కూడా వీరికి లేదు. 2010 సంవత్సరంలో హిందూ సంస్ధలను లష్కరే తొయిబా సంస్ధతో, రాహుల్ గాంధీ పోల్చి మాట్లాడడం అత్యంత దారుణమని ఈ ట్వీట్ లో గుర్తు చేశారు.
హిందువుల మనోభావాలను దెబ్బదీసే విధంగా ఇండియా కూటమి లోని నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉదయినిధిని సమర్ధిస్తూ కార్తిక్ చిదంబరం చేసిన వ్యాఖ్యల పై తీవ్రంగా మండిపడ్డారు