Suryaa.co.in

Features Political News

“రాబందు”ను నమ్మి….మోసపోయింది ఉక్రెయిన్

ఇందులో రాబందు తప్పేమీ లేదు.
ఉక్రెయిన్ అమాయకత్వమే యుద్ధానికి దారి తీసింది.
ఫలితాన్ని అనుభవిస్తున్నది.
పాపం ఉక్రెయిన్.
తనకు అండగా నిలుస్తుందని అత్యంత శక్తివంతమైన రష్యాపై కాలు దువ్వింది.
రంకెలు వేసింది.
బీరాలు పలికింది.
యుద్ధాన్ని కొని తెచ్చుకుంది.
తన అమాకత్వానికి అమాయక ఉక్రెయిన్ ప్రజలను బలి తీసుకుంటున్నారు ఆ దేశ అధ్యక్షుల వారు.
రష్యాతో యూరోపియన్ దేశాలకు సవా లక్ష ఆర్థిక వ్యవహారాలున్నాయి.
వాటిని ఉక్రెయిన్ కోసం ఆ దేశాలు పక్కన పెడతాయా?
అమెరికాకు సొంత ఎజెండా,లక్ష్యాలున్నాయి.
ఉంటాయి.
దాని దంతా రక్త చరిత్రే కదా.
అవి తప్ప వాటికి ఇతర లక్ష్యాలేమీ ఉండవు.
వీటిని పక్కన బెట్టి ఉక్రెయిన్ తరఫున పోరాడడానికి అవేమైనా అమాయక దేశాలా?
లేక ఇదేమైనా సత్తెకాలమా?
నాటోలో చేర్చుకుంటామని చెప్పగానే ఎగిరి గంతేసి కయ్యానికి కాలు దువ్వితే ఇలాగే ఉంటుంది మరి.
రాబందు ను నమ్మి ఇంతవరకు బాగు పడ్డ ఒక్క దేశమైనా ఉందా?
చరిత్రలో అలాంటి ఆధారమేమైనా కనిపిస్తుందా?
ఇంత అమాయకంగా రాబందు ను విశ్వాసంలోకి తీసుకోవడమే పొరపాటు.
ఇప్పుడా దేశం మరుభూమిగా మారడానికి ఆ దేశ అధ్యక్షుల వారి అమాయకత్వం, అతి విశ్వాసాలే కారణం.

– శ్రీధర్

LEAVE A RESPONSE