(డా.జయదేవ్.చల్లా)
జెలెంస్కీ -పుతిన్ లలో పట్టు ఎవరిది? ఈ యుద్ధం మరెన్నాళ్లు సాగుతుంది?ఇద్దరు అధ్యక్షుల వూహ్యం రచన శైలి ఎలా ఉన్నది? అంటూ మరో మిత్రుడు నేడు ఫోన్ చేసి అడిగిన మీదట సంఖ్యా శాస్త్రాన్ని ఆధారంగా ఎంచుకొని ఈ విశ్లేషణ ఇస్తున్నాను.
ఉక్రెయిన్ పిండ సంఖ్య-3 .అదేవిధంగా రష్యా పిండ సంఖ్య కూడా 3 కావడం వలన యుక్రెయిన్ తగ్గేదేలా అంటూ తన వీరత్వాన్ని ప్రదర్శించే అవకాశాలు హెచ్చుగా ఉన్నాయి.
పుతిన్ పిండ సంఖ్య 5 అయితే జెలెంస్కీ పిండ సంఖ్యా 9. అంటే పుతిన్ది బుధ్హి కుశలతో కూడిన యుద్ద్ తంత్రం అయితే రెండో వ్యక్తిది మొండి పట్టుదలతో కూడిన యుద్ధ తంత్రం. అంటే 5 అనేది 9 ని ఓడిస్తుంది కానీ 9 అనేది 5 ను ఓడించలేదు.కనుక గెలుపు రష్యాదే.
ఇక ఇంకెన్నాళ్లు ఈ యుద్ధం సాగుతుందంటే,ఫిబ్రవరి 24 న ఉక్రెయిన్ పై మొదటి బాంబింగ్ జరిగింది.ఈ రోజు నుంచి లెక్కించితే మార్చి-4 తేదీ వరకు యుద్ధం జరుగుతుంది.అంటే మొత్తం యుద్ధం 8 రోజుల్లో ముగిసే అవకాశాలు హెచ్చుగా ఉన్నాయి.
రష్యా గెలుస్తుందని నూటికి 100 శాతం మందికి తెలుసు.ఇంతోటి దానికి మల్లి శాస్త్రం చూడాలా అనే అతి మేధావులకు నా సమాధానం -రష్యా ఆధునిక టెక్నాలజీ ను మీరంతా చూసినవారు కావడం వలన మీరలా అనుకోవడంలో వింతలేదు.
కానీ కొన్ని సందర్భాల్లో ఒక చిన్న బియ్యపు రాయి ప్రాణాలు తీస్తుంది అని తెలుసు కదా? ఎందుకంటే ఒక మిస్సైల్ ను తప్పు దోవ పట్టించేది నాలుగు చిన్న మెగ్నీషియం వెలుగురవ్వలే కనుక. ఈ సత్యాన్ని ధ్రువపరిచేది ఒక దేశపు సాంకేతిక జ్ఞానం కాదు శాస్త్రమే అని చెప్పడానికే..