Suryaa.co.in

Andhra Pradesh

మేనల్లుడి పెళ్లి రిసెప్షనకూ మేనమామ జగన్ రాలేదు!

ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి తనయుడు రాజారెడ్డి వివాహ రిసెప్షన్‌కు అన్నయ్య కమ్ మేనమామ, ఏపీ సీఎం జగన్ డుమ్మా కొట్టారు. రాజస్థాన్‌లో జరిగిన మేనల్లుడి పెళ్లికి గైర్హాజరైన జగన్ అన్న, హైదరాబాద్‌లోనే జరిగిన పెళ్లి రిసెప్షన్‌కయినా వస్తారని వైఎస్ బంధువులు ఆశించారట.

ఎందుకంటే పెళ్లిరోజు ఆయన అనంతపురంలో పార్టీ కార్యక్రమం పెట్టుకున్నందున రాలేకపోయారని, రిసెప్షన్‌కు ఖాయంగా వస్తారని బంధువర్గాలు అనుకున్నారట. కుటుంబాల్లో ఎన్ని పొరపొచ్చాలున్నప్పటికీ, శుభకార్యాలకు హాజరుకావడం సంప్రదాయం కాబట్టి.. జగన్ అన్న దొడ్డ మనసు చేసుకుని, చెల్లెమ్మ ఇంట జరిగే పెళ్లి వేడుకకు హాజరవుతారనుకన్నారట.

కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ, అన్నయ్య అసలు రిసెప్షన్‌కే ముఖం చాటేశారట. అయితే రోజూ మీడియాలో జగనన్నను రచ్చబండ పెట్టి విమర్శల వర్షం కురిపించే, వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు .. అఫ్‌కోర్స్.. ఆయన ‘‘ ఈరోజే ఆ దరిద్రపు పార్టీకి నేను రాజీనామా చేశా’’నని స్వయంగా చెప్పారనుకోండి. ఆ రాజు గారు కూడా షర్మిల కొడుకు వివాహ రిసెప్షన్‌కు హాజరయి, దంపతులను ఆశీర్వదించారు.

ఏపీసీసీ ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్, కాంగ్రెస్ సీనియర్ నేత కొప్పుల రాజు, ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితర నేతలు హాజరయ్యారు.

విజయమ్మ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్యారెడ్డి కూడా, రిసెప్షన్‌కు వచ్చినట్లు కనిపించలేదని పార్టీ వర్గాలు చెప్పాయి. మొత్తానికి మేనల్లుడి పెళ్లికి, ఆ తర్వాత జరిగిన పెళ్లి రిసెప్షన్‌కూ.. మేనమామ జగన్ డుమ్మాకొట్టడం సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

 

LEAVE A RESPONSE