Suryaa.co.in

Andhra Pradesh

తనకు తాను తటస్థ శిఖామణిగా చెప్పుకునే వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్

ఉండవల్లి ఇటీవల హైకోర్టులో వేసిన పిటిషన్ తాడేపల్లిలో తయారైందే
తాడేపల్లిలో తయారైన పిటిషన్ పై గుడ్డిగా సంతకాలు చేశారు
వాస్తవాలన్నీ మీ పిటిషన్ లో ఉన్నా బురదజల్లుతారా.?
స్కిల్ కేంద్రాలు లేవు..పరికరాలు లేవన్న ఉండవల్లి మాటలు అసత్యం
స్కిల్ కేంద్రాలతో పాటు..పరికరాలను చూపించేందుకు మేం సిద్ధం
స్కిల్ డెవలెప్మెంట్ కేంద్రాలను తాము ఫిజికల్ వెరిఫికేషన్ చేయలేదని శరత్ అసోషియేషన్ వాళ్లు స్పష్టంగా చెప్పారు
ఒక్క రూపాయి కూడా అవినీతిలేని స్కిల్ ప్రాజెక్టులో సీబీఐ విచారణ కావాలన్న ఉండవల్లి..రాష్ట్రంలోని లిక్కర్ దందాపై ఎందుకు సీబీఐ విచారణ అడగడం లేదు?
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్

రాజమహేంద్రవరం :- తనకు తాను తటస్థ శిఖామణిగా చెప్పుకు తిరిగే వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ అని, ఈమధ్య కాలంలో నిస్సిగ్గుగా తన ముసుగు తొలగించారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. స్కిల్ డెవలెప్మెంట్ ప్రాజెక్టు విషయంలో సీబీఐ విచారణ కావాలని ఇటీవల హైకోర్టులో ఉండవల్లి వేసిన పిటిషన్ తాడేపల్లిలో తయారైనదేనని ఆయన ఆరోపించారు. రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…‘‘స్కిల్ డెవలెప్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రపంచమంతా పైసా అవినీతి జరగలేదు, కొన్ని లక్షల మందికి శిక్షణ ఇచ్చి యువత జీవితాలను బాగు చేసిన ప్రాజెక్టుగా అంతా చెప్తున్నారు. వేల మంది ఈ స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్ల ద్వారా నైపుణ్య శిక్షణ తీసుకుని మంచి ఉద్యోగాలు పొంది తమ జీవితాలు బాగుచేసుకున్నారు. చంద్రబాబు చేపట్టిన స్కిల్ డెవలెప్మెంట్ ప్రాజెక్టు దేశంలోనే రోల్ మోడల్ గా నిలిచింది. యువతంతా ప్రశంసిస్తున్నారు. కేపీఎంజీ లాంటి సంస్థలు కూడా వారి నివేదికలో ఈ స్కిల్ డెవలెప్మెంట్ ప్రాజెక్టును కేసు స్టడీగా తీసుకోవడంతో పాటు నీతి ఆయోగ్ కూడా ప్రసంశించింది. ఈ ప్రాజెక్టు గురించి అందరూ గొప్పగా మాట్లాడి కీర్తిస్తుంటే ముసుగు వీరుడు అరుణ్ కుమార్ మాత్రం బురద జల్లుతున్నారు. వైసీపీ చేసే అన్ని అవినీతి పనులకు వత్తాసు పలుకుతూ అకారణంగా బురద జల్లుతూ సీబీఐ విచారణ అడుగుతున్నారు.

ఇటీవల 250 పేజీలకు పైగా ఉన్న పిటిషన్ ను హైకోర్టులో అరుణ్ కుమార్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విమర్శలు రావడంతో రెండు రోజుల క్రితం మళ్లీ మీడియా సమావేశం పెట్టి తాను చేసిన పనిని సమర్థించుకున్నారు. ముసుగు వీరుడు అరుణ్ కుమార్ వేసిన పిటిషన్ ఆధారంగా ఆయనకే కొన్ని ప్రశ్నలు వేస్తున్నా. ఆయన హైకోర్టులో వేసిన తాడేపల్లి ప్యాలెస్ లో సిద్ధం చేసిన పిటిషన్ అని రుజువు చేస్తున్నా.

రాష్ట్రంలో అసలు స్కిల్ డెవలెప్మెంట్ కేంద్రాలు లేవు, సెంటర్లలో పరికరాలు రాలేదు, ఏమీ లేని ప్రాజెక్టుతో వందల కోట్ల అవినీతి జరిగిందని ఉండవల్లి మాట్లాడారు. అరుణ్ కుమార్ గారూ…మీరు పిటిషన్ వేసినప్పుడు కనీసం చదువుకోవాలి కదా..తాడేపల్లి ప్యాలెస్ పిటిషన్ పంపిందని గుడ్డిగా సంతకాలు చేస్తారా.? మీరు వేసిన పిటిషన్ లో థర్డ్ పార్టీ ఆడిట్ స్కిల్ డెవలెప్మెంట్ కేంద్రాలనఅన్నింటినీ పరిశీలించింది, వారి పరిశీలనలో కొన్ని మాయమయ్యాయని కనుగొన్నారు, అందుకు వాటిమీద సీబీఐ దర్యాప్తు జరపాలని హైకోర్టులో వేసిన పిటిషన్ లో ఉండవల్లి కోరారు.

ఇదే పిటిషన్ లో థర్డ్ పార్టీ ఆడిట్, ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికలను కూడా ఉండవల్లి జతపరిచారు. ఆ నివేదికను ఉండవల్లి అసలు చదివారా.? శరత్ అసోషియేట్స్ థర్డ్ పార్టీ ఆడిట్ ను..పిటిషన్ లో జతపరిచారు. ఈ నివేదికలో ఏముందో కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ చదవలేదు. ఆ నివేదిక చదవకుండా తాడేపల్లి ప్యాలెస్ పంపిందని పిటిషన్ లో సంతకాలు చేశారు. మీ పిటిషన్ లో జత చేసిన శరత్ అసోషియేట్స్ రిపోర్టును ఉండవల్లి చదవలేదు..ఉండవల్లి మాట్లాడిన మాటలతోనే ఇది స్పష్టమైంది.

మీరు రిపోర్టును చదివే ఉంటే..శరత అసోషియేట్స్ స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్లు పరిశీలించారు, దానిలో కొన్ని పరికరాలు మాయమయ్యాయని మీరు మాట్లాడేవారు కాదు. ఎందుకంటే శరత్ అసోషియేట్స్ ఫోరెన్సిక్ నివేదికలోని పేజీ నంబర్ 12లో స్పష్టంగా..మేము స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్లను నేరుగా తనిఖీలు చేయలేదు, పరిశీలించలేదని పేర్కొన్నారు. దీనికి కారణం తనిఖీ చేయొద్దని చెప్పారని శరత్ అసోషియేట్స్ ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టులో రాశారు. ఇవేమీ చదవకుండా హైకోర్టులో పిటిషన్ వేస్తారా ఉండవల్లి.?

నేను పెద్ద మేధావిని, నాకుంటే పెద్ద మేధావి ప్రపంచంలో లేడని మీకు మీరే సర్టిఫికేట్ ఇచ్చుకుంటారా.? ఉండవల్లి చెప్పే అసత్యాలను ప్రజలు గమనించాలి. అసత్యాలు మాట్లాడే మీరు ఇతరులకు పాఠాలు చెప్పడమేంటి ఉండవల్లి.? మీరు ఏం పిటిషన్ వేశారో ఒకసారి చదువుకోండి. ఉండవల్లి అరుణ్ కుమార్ తాడేపల్లి కొంప ప్రకారమే పని చేస్తున్నారని చెప్పడానికి ఈ ఆధారం సరిపోదా? సీమెన్స్ వారికి స్కిల్ డెవలెప్మెంట్ ప్రాజెక్టు గురించి తెలియదని, వారికి తెలియకుండానే నడిపించారని ఉండవల్లి మాట్లాడుతున్నారు.

సీమెన్స్ కంపెనీకి చెందిన ఆనాటి ఎండీ సునీల్ మాధుర్ చంద్రబాబును స్వయంగా సచివాలయంలో కలిసి మాట్లాడింది మీకు తెలియదా.? అగ్రిమెంట్ పై సతీష్ సావంత్ స్వయంగా సంతకాలు చేసిన విషయం మీకు తెలియదా.? సంతోష్ సావంత్ అనే డైరెక్టర్ అగ్రిమెంట్ పై సంతకాలు చేశారని ఉండవల్లి వేసిన పిటిషన్ లో కూడా ఉన్నాయి. సీమెన్స్ ఎండీ ఏషియా పశ్విక్ డిజైన్ టెక్ కు పంపిన మెయిల్స్ ను బయటపెట్టి మేము పబ్లిక్ డెమైన్ లో పెట్టాం.

స్కిల్ డెవలెప్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి వాస్తవాలతో కూడిన పుస్తకాలు కూడా ప్రచురించాం అవి కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ చూసుకోవాలి. వాస్తవాలు చూడకుండా మీడియా ముందుకు వచ్చి బురద జల్లితే ప్రజలు విశ్వసించరు. రూపాయి కూడా అవినీతి జరగని స్కిల్ డెవలెప్మెంట్ లో సీబీఐ విచారణ కావాలని ఉండవల్లి అడుగుతున్నారు.

అదే పని రాష్ట్రంలోని లిక్కర్ విషయంలో ఎందుకు చేయడం లేదని అడిగితే..నా దగ్గర సమాచారం లేదు, సమాచారం లేకుండా పిటిషన్ ఎలా వేస్తామని ఉండవల్లి చెప్తున్నారు. మరి ఏమీ సమాచారం లేకుండా గతంలో క్వార్టర్ రూ.8లు ఖర్చు అవుతోంది, పొరుగు రాష్ట్రాల్లో అంత రేటు ఉంటే..మన రాష్ట్రంలో ఇంత రేటు ఉంది, ఎప్పుడూ లేని బూమ్ బూమ్ బీర్లు అమ్ముతున్నారు, వీళ్ల అంతు తేలుస్తా అని రెండేళ్లక్రితం ఎందుకు మాట్లాడారు?

లిక్కర్ పై ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగా..నాకు సమాచారం మొత్తం వచ్చేస్తోందని మీడియా ముందు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారా లేదా.? ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నలు ఏమయ్యాయి..సమాధానాలు రాలేదా..లేకు వచ్చినా బయటపెట్టకుండా భద్రపరిచారా.? జవాబు వచ్చినా రానట్లు నటిస్తున్నారా.? తలపు చెక్కతో ప్రతిపక్షాలవైపు కొట్టినట్లు…తమలపాకుతో మరోవైపు జగన్ ను కొట్టినట్లుగా ఉండవల్లి ప్రవర్తిస్తున్నారు. రామోజీరావు మార్గదర్శి కేసులో అఫిడవిట్ వేసి జగన్ తనకు గొప్పమేలు చేశారని చెప్తున్నారు.

దీనిలో మీకు క్విడ్ ప్రోకో ఉందా ఉండవల్లీ.? సీబీఐ గురించి ఎంతో గొప్పగా చెప్తున్న ఉండవల్లి…జగన్ పై సీబీఐ 11 ఛార్జ్ షీట్లు దాఖలు చేసి పదేళ్లు అవుతోంది..మరి సీబీఐ ఇప్పటిదాకా ఏం చేస్తోంది.? పదేళ్లుగా బెయిల్ పై తిరిగే జగన్ పై మీకు పిటిషన్ వేయాలని అనిపించలేదా.? వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి కర్నూలు వెళ్లి 3 రోజులు చేతులు కట్టుకుని సీబీఐ కూర్చుంది. అవినాష్ రెడ్డి ఆసుపత్రిలో దాక్కుంటే గడపదాటే ప్రయత్నం కూడా చేయని సీబీఐకి మీరు సర్టిఫికేట్ ఇస్తారా.?

నీ దోస్త్ జగన్ కు సీబీఐ అంటే వెంట్రుకతో సమానం. రెండేళ్ల క్రితం ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏం తేల్చారు.? మనీ ట్రాన్సాక్షన్ కు సంబంధించి ఎటువంటి ఆధారాలూ లేవని రిమాండ్ రిపోర్టులోనే ఉంది..ఇది మీకు తెలియదా ఉండవల్లి.? టెరాసాఫ్ట్ కంపెనీకి ఫైబర్ నెట్ తో సంబంధం ఉన్న కంపెనీ..ఏ కంపెనీలో ఏ ప్రాజెక్టులో ఉందో కూడా కనీస సమాచారం లేదు. స్కిల్ డెవలెప్మెంట్ ప్రాజెక్టుకు..టెరాసాఫ్ట్ కు అసలు సంబంధమే లేదు..కానీ దానిపైనా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. సీమెన్స్ డైరెక్టర్ ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో తమ సంబంధంతోనే ప్రాజెక్టును ఏర్పాటు చేశామని చెప్పారు.

తాడేపల్లి ప్యాలెస్ కు లాభం చేకూర్చేందుకు ఉండవల్లి మారడం ఏమాత్రం సమంజసం కాదు. ఉండవల్లికి ఉన్న క్రెడిబిలిటీని ఆయనే పోగొట్టుకుంటున్నారు. మా పార్టీ నేతలు స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్లను పరిశీలించారు..వస్తామంటే మీకు కూడా చూపిస్తాం. ఇడుపులపాయ ఐఐఐటీకి వచ్చినా స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్లు చూపిస్తాం..రాజమండ్రి పరిధిలో ఎన్ని కాలేజీల్లో ఉన్నాయో కూడా చూపిస్తాం. రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో అనేక అవినీతి కుంభకోణాలు జరిగితే దానిపై మాట్లాడకుండా స్కిల్ డెవల్మెంట్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.

లిక్కర్ పై మీరు సేకరించిన సమాచారం ఏమైంది..ఎందుకు పిటిషన్ వేయలేదు.? రాష్ట్రంలో జరిగే లిక్కర్ కుంభకోణంపై సీబీఐ విచారణ కోరుతూ కోర్టులో పిటిషన్ వేస్తాం. వ్యక్తిగత లాభాల కోసం మీరు నోరుమూసుకుని కూర్చున్నా హైకోర్టులో పిటిషన్ వేస్తాం. పైసా అవినీతి జరగని ప్రాజెక్టులో చంద్రబాబును అకారణంగా జైల్లో నిర్బంధించి నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఉండవల్లి లాంటి వ్యక్తల మాటలు ప్రజలు నమ్మొద్దు.

రాష్ట్రంలోని ఇసుకను కూడా జార్జిరెడ్డి కొడుకు అనిల్ రెడ్డికి జగన్ రెడ్డి కట్టబెడుతున్నారు. రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న ఇసుక ర్యాంపుల గురించి ఉండవల్లి మాట్లాడరా.? స్కిల్ డెవలెప్మెంట్ ప్రాజెక్టు కేసులో ఈడీ ఎక్కడైనా చంద్రబాబు ముద్దాయి అని చెప్పిందా? జీఎస్టీ అధికారులు ఏమైనా చెప్పారా. పన్ను ఎగవేతకు పాల్పడితే దాన్ని వసూలు చేసుకోవడానికి సోదాలు జరిపారు. ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వం డప్పులు దోచుకుందని,గానీ చంద్రబాబుకు సంబంధం ఉందని గానీ చెప్పలేదు. ఒక కంపెనీ పన్ను చెల్లించకపోతే మాకేం సంబంధం..? పోలవరం పనుల్లో మెగా ఇంజనీరింగ్ వాళ్లు పన్ను కట్టకపోతే ప్రభుత్వానికి సంబంధమా.?

ఉండవల్లి నిజాయితీగా మాట్లాడినప్పుడే తటస్థ శిఖామణిగా పిలుచుకోవాలి. చంద్రబాబుపై చూపించడానికి ఆధారాలు లేక 17ఏ వర్తించదని చెప్తున్నారు. గవర్నర్ అనుమతి లేకుండా అక్రమంగా అరెస్టు చేశారు. గవర్నర్ మాజీ సుప్రీం జడ్జి..చేతనైతే ఆయనకు ఆధారాలు చూపించండి. జగన్ చేసిన తప్పులపైన మా దగ్గర సవాలక్ష ఆధారాలు ఉన్నాయి. 17ఏ అమల్లో ఉన్నా ఆధారాలతో గవర్నర్ కు చూపించి, గవర్నర్ అనుమతితో జగన్ పై చర్యలు తీసుకుంటాం.

ఆధారాలు లేకుంటే చంద్రబాబుకు ఊరట వస్తుంది..కానీ జగన్ కు రాదు. ఎదుటివాళ్లకు సెక్షన్లు తెలియనట్లుగా ఉండవల్లి మాట్లాడుతున్నారు. జగన్ కేసులకు..చంద్రబాబుపై పెట్టిన కేసుకు సంబంధం ఉందా.? జగన్ కంపెనీల్లోకి డబ్బులు వచ్చిన విధంగా చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ కంపెనీ, వారి కుటుంబ సభ్యుల అకౌంట్లోకి డబ్బులు వచ్చాయా.?

జగతి పబ్లికేషన్ లోకి, ఇందిరా టెలివిజన్ లోకి, కేరమల్ ఏషియాలోకి, సండూర్ పవర్ ప్రాజెక్టులోకి డబ్బులు వచ్చాయి…దీన్ని అంటారు అవినీతి అని. జగన్ అవినీతి ఏంటో ప్రజలకు తెలీదా..తండ్రిని అడ్డంపెట్టుకుని ఎంత సంపాదించారో, ఈ నాలుగున్నరేళ్లలో అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఎంత తిన్నారో ప్రజలకు తెలుసు. జగన్ సీబీఐ కేసుల గురించి ఉండవల్లి అరుణ్ కుమార్ కు తెలియకపోతే నేనే వచ్చి పాఠాలు చెప్తా. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు.

చంద్రబాబును అరెస్టు చేశాక భువనేశ్వరి రాజమండ్రిలో ఉండటం నేరమా..ఆమెను పరామర్శించడం నేరమా.? ఓదార్పు యాత్రతో జగన్ యేడాదిపాటు రాష్ట్రంలో తిరిగాడు..అది నేరంకాదా.? సోనియా గాంధీ తనను అడ్డుకున్నారని ఆరోజు చెప్పావు..మరి ఆ బుద్ధి ఈ రోజు ఏమైంది.? పరామర్శ కోసమే పార్టీ పెట్టానని అన్నావు..మరి భువనేశ్వరిని పరామర్శించడానికి ప్రజలు వస్తుంటే అడ్డుకుంటావా..?

అందుకే నిన్ను సైకో అనేది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు దాటుకుని వస్తారు. భువనేశ్వరిని కలవకూడదని ఏ చట్టం ప్రకారం నోటీసులిస్తారు.? రాజారెడ్డి రాజ్యాంగం ఇంతే అంటే ప్రజలు బంగాఖాతంలో కలిపేస్తారు. నిన్ను నువ్వే కాపాడుకోలేవు..అందుకే పిచ్చి పీక్స్ వెళ్తోంది. లండన్ వెళ్లింది పిచ్చి పీక్స్ కు వెళ్లినందుకే. నీకు చేతనైతే ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడు. మాతో పాటు మీరు కూడా ప్రజల్లోకి వెళ్లండి.. నాలుగున్నరేళ్లలో కష్టంలో ఉన్న ఒక్కరింటికైనా వెళ్లావా.? ఊరికొక ప్యాలెస్ కట్టుకున్నాడు.

రిషికొండలో రూ.25 లక్షలు విలువ చేసే కమోడ్ ఏర్పాటు చేసుకున్నారు..ఆ డబ్బులతో మధ్యతరగతి వాళ్లకు ఒక ఇళ్లు నిర్మించుకోవచ్చు. విచ్చలవిడిగా కోట్లు తగలేసి ప్యాలెస్ కట్టుకున్నాడు. విశాఖలో ఇప్పటికే సగం భూములు మింగేశాడు..ఇప్పుడు కొండపైకి ఎక్కి ఎక్కడ భూములున్నాయో చూస్తాడు. ఈయన దోచుకున్న సొమ్ము తరలించాలంటే ట్రక్కులు, విమానాల సరిపోవు..అందుకే ఓడలైతే సరిపోయి..కంటెయినర్లలో సొమ్మును విదేశాలకు తరలిస్తాడు. ఓడిపోయాక ఏ దీవిలోనో కూర్చుని రాజధాని ప్రకటించుకుంటారు.

ఓటమిని కూడా జీర్ణించుకునే స్థితిలో జగన్ లేరు. నాలుగున్నరేళ్లలో విశాఖకు ఒనగూర్చింది ఏంటి.? మేము తెచ్చిన కంపెనీలకు రిబ్బన్ కంటింగ్ చేసుకున్నాడు తప్పితే ఏం చేశాడు.? విమానాశ్రయం చుట్టూ ఉన్న భూములు, సింహాచలం చుట్టూ ఉన్న భూములు, అసైన్డ్ భూములన్నీ దోచుకున్నాడు. ఉన్న కంపెనీలు తరిమేశాడు. లులూ మాల్ ను హైదరాబాద్ లో చూస్తే తలదించుకునే పరిస్థితి..దాన్ని విశాఖ నుండి తరిమేశారు. వారు జీవితంలో ఇక ఏపీలో పెట్టుబడులు పెట్టబోమని చెప్పారు.

జగన్ విశాఖ రావొద్దని అక్కడి ప్రజలు దండం పెట్టుకుంటున్నారు. ఏదో విధంగా జగన్ ను అడ్డుకోండని దేవుళ్లని వేడుకుంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏం పోరాడారు.? పోస్కో వాళ్లను ఇంటికి పిలిచి ఒప్పందం కుదుర్చుకున్నారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడాలంటే దాని కింద ఉన్న 7 వేల ఎకరాలు అమ్మాలంట..రియలెస్టేట్ బ్రోకర్ లా జగన్ మాట్లాడుతున్నాడు. జగన్ ఉత్తరాంధ్ర ద్రోహి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు తీర్పు ఇచ్చారు..వైసీపీ పరిస్థితి ఏంటో ఈ రిజల్ట్ తోనే తేలిపోయింది’’ అని పట్టాభిరామ్ విమర్శించారు.

LEAVE A RESPONSE