Suryaa.co.in

Andhra Pradesh

నేర స్వభావం ఉన్న వాళ్లనే ప్రజలు అంగీకరిస్తున్నారు

– గతంలో కమ్మ … ఇప్పుడు రెడ్డి డామినేషన్
– గతంలో ముసుగు ఉండేది.. ఇప్పుడు ఆ ముసుగు తీసేశారు
– పవన్ డబ్బు, అధికారానికి లొంగే వ్యక్తి కాదని నా అభిప్రాయం
– ఇస్లాంలో గొప్ప తనం ఉంది.. అందుకే పెరిగింది
– నేటి మీడియాని క్యాపలిస్టులు మేనేజ్ చేస్తున్నారు
-మెజారిటీ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ .. బ్రాహ్మణులే
– మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్

విజయవాడ: గతంలో కమ్మ పెత్తనం ఉంటే ఇప్పుడు రెడ్ల పెత్తనం సాగుతోందని మాజీ ఎంపీ ఉండవ ల్లి అరుణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు గతంలో మాదిరిగా ముసుగు కనిపించడం లేదన్నారు. ఇస్లాంలో గొప్పతనం ఉందన్న ఉండవల్లి.. దేశంలో బ్రాహ్మణులే మెజారిటీ ఎస్సీలని వ్యాఖ్యానించారు. ఇంకా ఉండవల్లి ఏమన్నారంటే..
రాష్ట్రం లో కమ్మ , రెడ్డి అనే డివిజన్ 2014నుండి బాగా వచ్చింది.

గతంలో అన్నింటిలో కమ్మ డామినేషన్, ఇప్పుడు రెడ్డి డామినేషన్. గతంలో ముసుగు ఉండేది.. ఇప్పుడు ఆ ముసుగు తీసేశారు. ప్రశ్నించే వాళ్లు లేనప్పుడు అధికారం ఇష్టా రాజ్యంగా మారుతుంది. అధికారం‌ కన్నా పది శాతం ఓట్లు ఇవ్వండి అనే వారిని నమ్మండి. ఇమేజ్ ఉండి, ప్రశ్నిస్తా అని ముందుకి వచ్చే వాళ్లని ప్రోత్సహించండి. నేను చాలా అంశాలు చెప్పినా .. మీడియా ఫోకస్ చేయలేదు. పూర్తి పారదర్శక పాలన కోసం ఆన్ లైన్ లో అన్ని అంశాలు ఉంచాలి.

ప్రజాస్వామ్యం వ్యవస్థకి అర్ధమే నేడు మారిపోతుంది.నేటి మీడియాని క్యాపలిస్టులు మేనేజ్ చేస్తున్నారు.పబ్లిక్ డొమైన్ లో పెట్టే వారికే ఓటు‌ వేయాలి.నేర స్వభావం ఉన్న వాళ్లనే ప్రజలు అంగీకరిస్తున్నారు. ప్రజా స్వామ్యంలో అటువంటి వారిని ఎవరూ అడ్డుకోలేరు. ఇటీవల ఒక జడ్జే స్థలం వివాదంలో రౌడీ షీటర్ ను ఆశ్రయించారు.

విగ్రహాలను కూలగొట్టడానికే మక్కాలో మహ్మదీయ మతం పుట్టింది. మనత్ అనే విగ్రహాన్ని తీసుకెళ్లి దాచేశారని చెబుతారు. ఆరోజు పరస్పర దాడుల నేపధ్యంలో ఈ దాడులు విస్తరించాయి. మా మతంలొకి వస్తే ఆలింగనం, కాదంటే చంపుతాం అని బెదిరించారు. ఇస్లాంలో గొప్ప తనం ఉంది.. అందుకే పెరిగింది.

మెజారిటీ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ .. బ్రాహ్మణులే. కులం ప్రభావం తగ్గితేనే సమాజం బాగు పడుతుంది. ఎవరికైనా ఒకే కాస్ట్ తో విజయం సాధించడం సాధ్యం కాదు. పవన్ డబ్బు, అధికారానికి లొంగే వ్యక్తి కాదని నా అభిప్రాయం.
బిజెపి నిర్ణయాలను బట్టి పొత్తు అంశాలు ఖరారు అవుతాయి. ఎపిలో ఎవరు నెగ్గినా 25ఎంపిలు బిజెపి వే. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసే వెళతారని అనుకుంటున్నా. బిజెపి కాదంటే… పవన్ బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. రాష్ట్రం లో త్రిముఖ పోటీ కాదు.. ద్విముఖ పోటీ ఉంటుంది. అయితే ఈ అభిప్రాయం ఇప్పుడు ఉన్న పరిస్థితి ని బట్టి చెబుతున్నా.ఎమ్మెల్సీ అనంత్ బాబు ది తప్పని తేలితే శిక్షిస్తారు.అతనే చంపాడని నమ్మే పరిస్థితి కనిపిస్తుంది.

ఈడీ కేసులలో పెద్ద శిక్షలు పడటం నేను చూడలేదు. జగన్మోహన్ రెడ్డి కి అయినా జరిమానాలే పడతాయి. ఈడీ కేసులు వినడం ప్రారంభమైతే శిక్ష ఖరారు అవుతుంది. ఈ కేసులు వల్ల జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు వచ్చిన నష్టం లేదు.

నాడు,నేడు కె.ఎ పాల్ కి ఎంతో తేడా ఉంది.మొన్న తెలంగాణలో దాడి చేయడం బాధాకరం.రాజకీయాలపై అభిప్రాయం చెప్పడం అందరికీ హక్కు. తెలంగాణలో షర్మిల పార్టీ అనుకున్న స్థాయిలో రాణించలేదు.

LEAVE A RESPONSE