Suryaa.co.in

Features

ఇక దేశంలో సముద్ర గర్భం నుంచి రైళ్లు

-మోదీ మరో సంచలన ప్రయోగం
-ఇప్పటికే అందుబాటులోకి వందేభారత్
-ముంబై-అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైల్ కారిడాల్ నిర్మాణం
-దీంట్లో భాగంగానే 21 కిలో మీటర్ల మేర సొరంగ మార్గం
-7 కిలో మీటర్లు సముద్ర గర్భంలో టన్నెల్‌ నిర్మాణం
-థానే జిల్లా శిల్ ఫాటా ప్రాంతంలో సముద్రం లోపల టన్నెల్‌
-వందే భారత్ రైలు తరువాత మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ను తలపెట్టిన మోడీ ప్రభుత్వం

ఇప్పటి వరకు కొండలు, గుట్టుల్లో నుంచే రైల్వే మార్గాలు ఉండటం చూసి ఉంటాం. కానీ ఫస్ట్ టైం సముద్ర గర్భంలో నుంచి రైళ్లు ప్రయాణించేలా టన్నెల్ ఏర్పాటు చేస్తున్నారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైల్ కారిడాల్ నిర్మాణం కొనసాగుతోంది.

దీంట్లో భాగంగానే 21 కిలో మీటర్ల మేర సొరంగ మార్గం వేయగా.. ఇందులో 7 కిలో మీటర్లు సముద్ర గర్భంలో టన్నెల్‌ను తవ్వనున్నారు. ఈ టెన్నెల్‌ను మహారాష్ట్రాలో నిర్మిస్తున్నారు. బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ మధ్య భూమి లోపల సాధారణ టన్నెల్‌ను తవ్వనున్నారు.

ఇక థానే జిల్లాలోని శిల్ ఫాటా ప్రాంతంలో సముద్రం లోపల టన్నెల్‌ను నిర్మిస్తున్నారు. ఈ టన్నెల్ ప్రత్యేకం ఏంటంటే అప్ అండ్ డౌన్ రెండు వైపులా పట్టాలు వేస్తుండటంతో. ఒకేసారి టన్నెల్ గుండా రెండు రైళ్లు.. వేర్వేరు ట్రాక్‌లపై ప్రయాణించవచ్చు.

ఇది భూమి లోపల 25 నుంచి 65 మీటర్ల లోతులో నిర్మించనున్నారు. ఇక ఈ టన్నెల్ పనులకు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ – ఎన్‌హెచ్ఎస్‌ఆర్‌సీఎల్ బిడ్లను ఆహ్వానించగా.. ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఈ కాంట్రాక్టును దక్కించుకుంది. కాంట్రాక్టు ఒప్పందంపై ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంతకం చేయడంతో ఈ టన్నెల్ పనులకు ముందడుగు పడింది. సో.. మన దేశంలో తొలిసారి సముద్ర గర్భం నుంచి రైలెక్కే అదృష్టం ప్రయాణీకులకు దక్కబోతోందన్నమాట.

– పులగం సురేష్
జర్నలిస్టు

LEAVE A RESPONSE