Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ పాలనలో అభివృద్ధి లేని జలాశయాలు!

– మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

నెల్లూరు: వైసీపీ పాలనలో రాష్ట్రంలోని జలాశయాలు అభివృద్ధికి నోచుకోలేదని, నెల్లూరు జిల్లాలోనే రెండు భారీ జలాశయాలు ఉన్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ప్రతిష్ఠాత్మకమైన పోలవరం జలాశయాన్ని కూడా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. పునర్నిర్మాణానికి కోట్లాది నిధులు అవసరమవుతాయన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం నెల్లూరు నగరంలోని సంతపేట లో గల క్యాంపు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించి, మాట్లాడారు. పట్టిసీమ నుంచి జలాలను తీసుకొచ్చే ప్రయత్నం గత ఐదేళ్లలో చేయలేదు.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి.. నీటిని రాయలసీమకు పూర్తిగా ఇవ్వలేదు.. భారీగా వరదలు వచ్చి నీరు సముద్రానికి పోయిన రాయలసీమ నెల్లూరు జిల్లాలో దాహార్తిని, రైతుల అవసరాలను మాత్రం తీర్చలేదు.

జగన్ సొంత జిల్లా అభివృద్ధికి నోచుకోలేదు. అన్నమయ్య డ్యాం తెగిపోవడంతో ఆ నీరంతా సోమశిల కు వచ్చి చేరింది. భారీగా నీటిని విడుదల చేయడంతో ఆఫ్రాన్ దెబ్బతింది. మూడేళ్లుగా సోమశిల జలాశయానికి మరమ్మతులు చేయాలని చెబుతూనే ఉన్నాం. జగన్‌ పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ కల నెరవేరుతోంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వచ్చి జలాశయాన్ని పరిశీలించారు. గతంలో జగన్ జిల్లాలకు వస్తే చెట్లు నరకడంతో పాటు పరదాలు కట్టేవారు.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.. సమస్యలను పరిశీలించి ప్రజలతో సమస్యల గురించి చర్చించారు.. గతంలో జగన్ ప్రజలను పట్టించుకోలేదు.. చంద్రబాబు మాత్రం ప్రజలతో కలిసి కూర్చుని వారి సమస్యలు తెలుసుకున్నారు.

పేర్లను తొలగించడం సమంజసమే

నెల్లూరు.. సంగం బ్యారేజీలకు పెట్టిన పేర్లను తొలగించడం సమంజసమేని మంత్రి ఆనం అన్నారు. సంగం.. నెల్లూరు బ్యారేజ్ లకు ఆ నాయకులు ఏం చేశారో చెప్పాలి… వైసీపీ హయాంలో 10 శాతం పనులు మాత్రమే చేశారు.. మాకు సలహాలు ఇచ్చే స్థాయి గోవర్ధన్ రెడ్డికి లేదు.. కడప జిల్లాలో అన్నమయ్య విగ్రహం స్థానంలో రాజశేఖర్ రెడ్డి విగ్రహం పెట్టినప్పుడు గోవర్ధన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా మార్చినప్పుడు ఎందుకు స్పందించలేదు? ఆయన మరోసారి మాట్లాడితే నేను దీటుగా స్పందిస్తా… గతంలో జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్ జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. ఏం చేశారో ఏం పట్టించుకున్నారు ఎవరికీ తెలియదు.

సోమశిల జలాశయ గేట్లు పాడయ్యాయి.. ఇది మరో అన్నమయ్య డ్యాం లాగా మారుతుందని ఆందోళన చేసాం… కానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జలవనరుల శాఖ మంత్రి సోమశిల.. కండలేరు.. జలాశలను సందర్శించారు.

వంద రోజుల్లో అభివృద్ధి పనులు చేయాలని నిర్ణయించాం.. కానీ, 70 రోజుల్లోనే ముఖ్యమంత్రి కూడా జలాశయాన్నిసందర్శించారు.. సత్వరమే ఆఫ్రాన్ మరమ్మతు పనులు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. క్రస్టు గేట్ల తోపాటు ఇతర మరమ్మతులకు నిధులను విడుదల చేస్తామని చెప్పారు. సోమశిల నుంచి కండలేరుకు నీరు అందించే హెడ్ రెగ్యులేటర్ మరమ్మతుల కోసం రూ.5 కోట్లను మంజూరు చేశారు. సోమశిలకు శ్రీశైలం జలాశయం నుంచి నీరు వస్తోంది.

ఇప్పటికే 26 టి.ఎం.సి.ల కు నీటి నిల్వ చేరింది.. కండలేరులో నీరు లేకపోవడంతో సోమశిల నుంచి 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నాం. అక్కడ నుంచి తిరుపతికి మంచినీటిని సరఫరా చేస్తాం.

జగన్ చేసిన నష్టాలను ఒక్కొక్కటిగా పూడ్చుకుంటూ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలా రాష్ట్రంలో సుపరిపాలన అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో కృషి చేస్తున్నారు.

ఈ సమావేశంలో నెల్లూరు రూరల్, కావలి శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కావ్య కృష్ణా రెడ్డి, తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు గిరి నాయుడు, ఆనం రంగమయూరు రెడ్డి, రాజా నాయుడు, కోడూరు కమలాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE