-ఏపీలో వ్యవసాయ రంగంలో చేపడుతున్నకార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ప్రేరణ
-ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయాల్సిన అవసరం ఉంది
-ప్రకృతి సేద్యం, అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్ విషయలోనూ ఏపీ స్ఫూర్తిదాయకం
-ముఖ్యమంత్రికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రశంసలు
-రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత పంటల బీమా పథకంలోకి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన
-సీఎం సూచనలమేరకు మార్గదర్శకాల్లో పలు మార్పులు, చేర్పులు
అమరావతి:
– రాష్ట్రంలో పంటల బీమా పథకంలోకి ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన
– రైతులకు గరిష్ట ప్రయోజనాలు చేకూర్చేలా ఉండాలంటూ ముఖ్యమంత్రి వైయస్.జగన్ విజ్ఞప్తి మేరకు ఫసల్ బీమా యోజనలో మార్గదర్శకాల్లో మార్పులు, చేర్పులు
– క్యాంపు కార్యాలయంలో వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైయస్.జగన్, న్యూఢిల్లీ నుంచి పాల్గొన్న కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌తోమర్, ఇతర రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు.
– కేంద్ర బృందం రాష్ట్ర పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి సూచనల మేరకు ఫసల్ బీమా యోజన మార్గదర్శకాల్లో మార్పులు చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ
– ప్రకటించిన పంటల్లో రైతులందరికీ కూడా ఫసల్ బీమా వర్తించేలా మార్పులు.
– ఇ–క్రాప్ వివరాలతో బీమా పథకానికి అనుసంధానించే విధానం.
– వ్యవసాయ పద్ధతులు ఆధారంగా డేటా ఎంట్రీ చేసే విషయంలో సౌలభ్యతను తీసుకొచ్చిన కేంద్ర వ్యవసాయశాఖ.
– యూనివర్సల్ కవరేజీ అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఏపీ.
వర్చువల్ సమావేశంలో కేంద్రమంత్రితో సీఎం ఏమన్నారంటే
– ఫసల్ బీమా యోజన అందరికీ వర్తింపు చేయాలంటే విధానపరంగా మార్పు రావాల్సి ఉంది:
– ప్రస్తుతం రాష్ట్రంలో 10,444 ఆర్బీకేలు ఉన్నాయి:
– ప్రతి గ్రామంలో వ్యవసాయ కార్యక్రమాలన్నీ ఆర్బీకేల పరిధిలో జరుగుతాయి:
– అగ్రికల్చర్ అసిస్టెంట్, బ్యాంకింగ్ కరస్పాండెంట్‌లు ఆర్బీకేల్లో పనిచేస్తున్నారు. గ్రామ సచివాలయాలతో కలిసి ఆర్బీకేలు పనిచేస్తున్నాయి:
– రైతులు సాగుచేసిన ప్రతి పంటను కూడా జియో ట్యాగింగ్‌తో ఇ–క్రాప్ చేస్తున్నాం, రియల్ టైం డేటా ఇది:
– చాలా దృఢమైన వ్యవస్థ ద్వారా డేటాను సేకరిస్తున్నాం:
– అందుబాటులో ఉన్న ఇ– క్రాప్ డేటాను వినియోగించుకోవాలి:
– రైతు సాగుచేస్తున్న ప్రతి పంటకూడా బీమా పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఉన్న అడ్డంకులను తొలగించాం:
–రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెల్లించాల్సిందే కాదు, రైతులు చెల్లించాల్సిన ప్రీమియంను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది:
– మూడింతల్లో ఒక వంతు రైతులు చెల్లించాల్సిన దాన్ని, మరో వంతు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియంను మొత్తంగా మూడొంతుల్లో రెండొతులు ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది:
– పరిస్థితి ఇలా ఉన్నా కూడా, అందరికీ పంట బీమా పరిహారం అందాలనే లక్ష్యంతో ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది:
– లేకపోతే సాగుచేస్తున్న ప్రతి రైతు కూడా పంటలబీమా పరిధిలోకి రారు:
–ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించడం ద్వారా, రైతు సాగుచేసిన ప్రతి పంటనూ ఇ–క్రాపింగ్ చేయడంద్వారా ఉచిత పంటలబీమా పథకం అద్భుతంగా ముందుకు సాగుతుంది:
– సన్న, చిన్నకారు రైతులు తరఫున చెల్లించాల్సిన ప్రీమియంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాన వాటి భరిస్తే, మరిన్ని అద్భుతాలు జరుగుతాయి:
– ఈ ఆలోచనపై దృష్టిసారించాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిని కోరుతున్నాను:
– ఫసల్‌బీమాయోజనలో కొన్ని రాష్ట్రాలు ఎందుకు లేవన్న అంశంపై దృష్టిపెట్టి, ఆమేరకు మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులు చేసేందుకు కృషిచేసిన కేంద్రమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను:
– ఇందులో ఉన్న సమస్యలను పరిష్కరించనడానికి కేంద్రమంత్రి చేసిన కృషిని అభినందిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను:
వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తొమర్ ఏమన్నారంటే..:
– ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె.గోవర్థన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్‌శర్మతో పాటు, ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటున్న కేంద్ర, రాష్ట్ర అధికారులందరికీ స్వాగతం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో తిరిగి భాగస్వాములవుతున్నందుకు సీఎం వైయస్ జగన్‌తో పాటు, రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వాగతం పలుకుతున్నాను.
– రైతులు.. ముఖ్యంగా సన్న, చిన్నకారు రైతుల ప్రయోజనాలు కాపాడడంలో కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రంలో సీఎం వైయస్ జగన్, ఇద్దరూ ఒకే లక్ష్యంతో పని చేస్తున్నారు. రైతులకు మేలు చేయడంలో కేంద్రంలో ప్రధానమంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారు. అవి రైతులకు కచ్చితంగా లాభిస్తున్నాయి.
– మనందరికి తెలుసు. వ్యవసాయం బాగుండి, రైతుల ఆదాయం పెరిగితే, ఇటు దేశంతో పాటు, ఇటు రాష్ట్రంలో కూడా ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. అందుకే ఆ దిశలో కేంద్రం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో చిత్తశుద్ధితో పని చేస్తున్నాయి.
– రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ప్రకటించినప్పుడు, అన్ని రాష్ట్రాలు అందులో భాగస్వామ్యం అయ్యాయి. అయితే ఏదైనా కొత్తగా ప్రవేశపెట్టినప్పుడు, కొన్ని లోటుపాట్లు ఎదురవుతాయి. సమస్యలూ వస్తాయి. ఆ మేరకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు, సలహాల మేరకు ఫసల్ బీమా యోజనలో అవసరమైన మార్పులు చేయడం జరిగింది. ఈ ప్రక్రియలో రాష్ట్రాల అధికారులతో కేంద్ర వ్యవసాయ శాఖ కూడా నిరంతరం సంప్రదింపులు జరిపింది. నేను కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో స్వయంగా మాట్లాడడం జరిగింది. దాని పర్యవసానమే ఇవాళ్టి శుభదినం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరిగి భాగస్వామ్యం అవుతోంది.
– రాష్ట్రంలో వ్యవసాయ రంగం కోసం ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. అందుకు ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రితో మాట్లాడిన సందర్భంగా, ఇక్కడ అమలు చేస్తున్న ఈ–క్రాప్ విధానం గురించి తెలిసింది. అది దేశంలోనే ఒక వినూత్న ప్రక్రియ. దాని గురించి తెలుసుకున్న తర్వాత, అది రైతులకు ఏ స్థాయిలో మేలు చేస్తుందన్నది అర్థం చేసుకున్న తర్వాత ఎంతో సంతోషం కలిగింది. ఎక్కడైనా ఒక గొప్ప కార్యక్రమాన్ని అమలు చేస్తే, అది మిగతా చోట్ల (రాష్ట్రాల్లో) కూడా అమలు చేయడం అవసరం. త్వరలోనే రాష్ట్రాల వ్యవసాయ శాఖల మంత్రుల సమావేశం నిర్వహించబోతున్నాం. రైతుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ–క్రాప్ విధానంతో పాటు, వినూత్న కార్యక్రమాలు, పథకాలను ఆ సమావేశంలో వివరిస్తాము. అవి అన్ని రాష్ట్రాలకు ఎంతో ప్రేరణనిస్తాయి.
– నేచురల్ ఫార్మింగ్, అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌కు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ఎంతో స్ఫూర్తిగా నిలుస్తోంది. రైతుల సంక్షేమం, ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు ఇక్కడ వారికి ఎంతో మేలు చేస్తున్నాయి..
– ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా అమలు చేయనున్న ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన రైతులకు తప్పనిసరిగా ఒక రక్షణ కవచంలా నిలస్తుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలకు నష్టం కలిగినా, రైతులకు ఈ పథకం ఎంతో అండగా నిలుస్తుంది.
– ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో తిరిగి భాగం అవుతున్నందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు, రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారందరికీ స్వాగతం పలుకుతున్నాను.