Suryaa.co.in

Andhra Pradesh

కేంద్రమంత్రి షెకావత్ వ్యాఖ్యలు పోలవరంనిర్మాణంలో జగన్ రెడ్డి చూపిన ధనదాహం, అసమర్థత, చేతగానినతానికి నిదర్శనం

• పోలవరం రిటైనింగ్ వాల్ మొత్తం ఎలా కుంగిపోయింది.. గైడ్ బండ్ రిటైనింగ్ వాల్ జాయిట్స్ తో ఎందుకు నిర్మించారు.. ఎగువకాపర్ డ్యామ్ నుంచి నీరుఎందుకు లీకు అవుతోంది… గైడ్ బండ్ రిటైనింగ్ వాల్ ఫైలింగ్ ఎందుకు సక్రమంగా జరగలేదన్న కేంద్రమంత్రి వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి వద్ద సమాధానం లేదు
• పోలవరం నిర్మాణంపై టీడీపీప్రభుత్వంలో కేంద్రప్రభుత్వం నుంచి అవార్డులమీద అవార్డులువస్తే, జగన్ చేతగాని తనంతో నేడు చీవాట్లుమీద చీవాట్లు పడుతున్నాయి
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు

చంద్రబాబు 2019లో ముఖ్యమంత్రి అయ్యిఉంటే, పోలవరం ప్రాజెక్ట్ 2020నాటికే పూర్తై ఉండేదని, నదుల అనుసంధానమనే గొప్పప్రక్రియ పూర్తై, గోదావరిజలాలతో ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలమై ఉండేదని, జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడమే పోలవరానికి శాపంగా మారిందని, ముఖ్యమంత్రి ధనదాహం, చేతగానితనం, అసమర్థత పోలవరానికి గ్రహణా లుగా దాపురించాయని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

“ పోలవరంప్రాజెక్ట్ లో అంతర్భాగమైన గైడ్ బండ్ కుంగిపోవడంపై కేంద్రజలవనరుల శాఖ మంత్రి గజేంద్రషెకావత్ ఏపీప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రమంత్రి పోలవరంనిర్మాణంపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంపరువు ప్రతిష్టల్ని మంటగలిపిన జగన్ రెడ్డి చేతగానిపాలనకు దర్పణంగా నిలిచాయి. పోలవరం రిటైనింగ్ వాల్ మొత్తం ఎలా కుంగిపోయింది.. గైడ్ బండ్ రిటైనింగ్ వాల్ జాయిట్స్ లేకుండా నిర్మించాల్సి ఉంటే, జాయింట్స్ తో ఎందుకు నిర్మించారు.. ఎగువకాపర్ డ్యామ్ నుంచి నీరుఎందుకు లీకు అవుతోంది… గైడ్ బండ్ రిటైనింగ్ వాల్ ఫైలింగ్ ఎందుకు సక్రమంగా జరగలేదన్న కేంద్ర ప్రభుత్వప్రశ్నలకు జగన్ ప్రభుత్వంవద్ద సమాధానంలేదు.

నాలుగునెలల్లో పూర్తిచేయాల్సిన గైడ్ బండ్ నిర్మాణం, జగన్ రెడ్డి అసమర్థత, చేతగాని తనంవల్ల సంవత్సరానికి పైగా పట్టింది. గైడ్ బండ్ నిర్మాణసమయంలో భూమిలో వచ్చిన అంతర్గతమార్పులవల్లే అది కుంగిపోయిందని నిపుణులు చెప్పడం జగన్ రెడ్డి పోలవరం నిర్మాణానికి శాపంగా మారాడు అనడానికి నిదర్శనం. పోలవరం ప్రాజెక్ట్ అనే ది అత్యంత క్లిష్టమైనది..కీలకమైనది. దానిలో పనులుచేయాలంటే ప్రతిసీజన్ లో జరిగే మార్పులను బట్టి ముందుకెళ్లాలి.

ప్రత్యామ్నాయఏర్పాట్లుచేయకుండా జగన్ రెడ్డి తొలి నాళ్లలో అర్థంతరంగా ప్రాజెక్ట్ పనులు ఆపేయడమే పెద్దతప్పు. ఒకేపనికి రెండుఏజెన్సీ లను నియమిస్తే జరిగేపనులకు ఎవరుబాధ్యతవహిస్తారని పీపీఏ (పోలవరంప్రాజెక్ట్ అథారిటీ) ప్రశ్నించినా వినకుండా జగన్ రెడ్డి ఇష్టానుసారంగా నిర్ణయాలుతీసుకున్నా డు. ప్రాజెక్ట్ పనులుచేస్తున్న సంస్థల్ని కాదని, రివర్స్ టెండరింగ్ డ్రామాలుఆడి, 29-07-2019న నవయుగసంస్థను, తరువాత వెంటనే జర్మనీసంస్థ బేకమ్ ఇన్ ఫ్రా ప్రాజక్ట్స్ సంస్థను టెర్మినేట్ చేశాడు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేయకుండా, పనులు చేస్తున్నసంస్థల్ని పక్కనపెట్టడంతోపాటు, అధికారులెవరూ ప్రాజెక్ట్ ప్రాంతంలో లేకపోవ డంతో ఎగువనుంచి వచ్చినవరదను నియంత్రించేవారు లేకపోవడంతో డయాఫ్రమ్ వాల్ పూర్తిగా దెబ్బతిన్నది. డయాఫ్రమ్ వాల్ పైన ఉన్న ఎగువకాపర్ డ్యామ్ పనులు టీడీపీప్రభుత్వంలోనే 80శాతం పూర్తయ్యాయి. మిగిలిన20శాతం పనుల్ని 2020నాటి కి జగన్ పూర్తిచేయించలేకపోవడంతదోనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని ఐఐటీ హై దరాబాద్ నివేదిక ఇచ్చింది.

మూడునెలల్లో పూర్తయ్యే 20శాతంపనుల్ని, 14నెలల్లో జగన్ ప్రభుత్వం పూర్తిచేయించకపోవడమే డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి కారణమ ని, అది ముమ్మాటికీ మానవతప్పిదమేనని ఐఐటీ హైదరాబాద్ తననివేదికలో స్పష్టం గా చెప్పింది. ఆ నివేదికను బయటకుపొక్కకుండా చేసిన జగన్ రెడ్డి, అతని మంత్రు లు 2021జూన్ కి, 2022జూన్ కి మొత్తంప్రాజెక్ట్ పూర్తిచేస్తామని చెప్పడం ప్రజల్ని వంచించడంకాదా? 2020ఆగస్ట్ లోనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే 2021 జూన్ కి ప్రాజెక్ట్ పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి, అతని మంత్రులుచెప్పడం, రాష్ట్రరైతాంగాన్ని మోసంచేయడం కాదా?

పోలవరంప్రాజెక్ట్ లో వరదవచ్చినప్పుడు 50లక్షలక్యూసెక్కులనీరు వస్తుంది. అంత వరదప్రవాహం నుంచి చంద్రబాబు ప్రాజెక్ట్ ని కాపాడుతూ, నిర్మాణపనులు 72శాతం పూర్తిచేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని గాలికివదిలేయడం వల్లే నేడు పోలవరం ప్రశ్నార్థకంగా మారింది. పోలవరంపనులు చేస్తున్న ఏజెన్సీలను మార్చవద్ద ని పీపీఏ చెప్పినా వినకుండా జగన్ మొండిగా ముందుకెళ్లాడు. పోలవరం ప్రాజెక్ట్ అథా రిటీ సీఈవో జైన్ మొత్తుకున్నాకూడా జగన్ వినలేదు.

తనకమీషన్లకోసం పనులు చేస్తున్న సంస్థల్నికాదని, అధికారంలోకి వచ్చిన నెలలోనే వాటినిపక్కనపెట్టి, తాను అనుకున్నవాటికి పనులుకట్టబెట్టి, రివర్స్ టెండరింగ్ పేరుతో రిజర్వ్ టెండరింగ్ చేశా డు. అనుభవంలేని సంస్థకు పోలవరంనిర్మాణపనులు అప్పగించిన జగన్ ధనదాహం వల్లే ప్రాజెక్ట్ నిర్మాణం గాల్లోదీపంగా మారింది. చంద్రబాబు 5సంవత్సరాల్లో 72శాతం పనులుపూర్తిచేస్తే, జగన్ రెడ్డి 4ఏళ్లలో రెండుశాతంకూడా చేయలేదు. అదీ జగన్ రెడ్డి పనితనం.

చంద్రబాబుహయాంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అవార్డులమీద అవార్డులు కేంద్రప్రభుత్వంనుంచి వస్తే, నేడు జగన్ రెడ్డిహాయాంలో చీవాట్లుమీద చీవాట్లు పడుతున్నాయి. 4నెలల్లో పూర్తికావాల్సిన గైడ్ బండ్ ను నాలుగేళ్లయినా జగన్ రెడ్డి సమర్థవంతంగా నిర్మించలేకపోయాడు. పోలవరంనిర్మాణానికి సంబంధించి, కేంద్రమంత్రి షెకావత్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఏంసమాధానంచెబుతాడు?” అని నిమ్మల నిలదీశారు.

LEAVE A RESPONSE