– శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్
శ్రీకాకుళం: యూరియా బస్తాలు స్టాక్ పెట్టుకొని ఈ వేళ ప్రతిపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ విమర్శించారు. ఈ మేరకు ఆయన మంగళవారం విలేఖర్లతో మాట్లాడారు. రైతు సోదరులందరికీ నేను ఒకటే విన్నవిస్తున్నా ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఎకరాకు మొదటి విడతగా 25 కేజీలు, రెండో విడతగా 25 కేజీలు, మూడో విడతగా 25 కేజీ మొత్తం 75 కేజీలు అందజేస్తామన్నారు.
ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఎకరాకు భూమి ఉన్న లేదా భూమి సాగు చేస్తున్న కౌలు రైతుకు గాని ప్రతి ఒక్క ఎకరాకు మేము యూరియా ఇచ్చే పూర్తి బాధ్యత తీసుకుంటామని చెప్పారు. ఏ రైతుకైనా మాకు ఈ తడవ, మొదటి విడత ఈ ఎకరాకు 25 కేజీలు అందలేదని నిస్సందేహంగా మా ఉన్న ఆర్బికేలు గాని, గ్రామ సచివాలయాలకు గాని వచ్చి వార్డు సచివాలయం వచ్చి మీరు అడగొచ్చన్నారు. లేనప్పుడు మీకు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చామని, ఆ నెంబర్ను మీరు సంప్రదించినట్లైతే తప్పకుండా మీకు యూరియాని అందిస్తామని ఎమ్మెల్యే చెప్పారు.
సబ్సిడీ ద్వారా మీకు 70 శాతం, గతంలో 50 శాతం ఉండేది 50 శాతం మార్కెట్ కి ఇచ్చేవాళ్ళు మిగతాది మార్కెట్లో కొనుక్కునేవారన్నారు. అయితే ఈ సారి 70 శాతం సబ్సిడీ ఇచ్చి 30 శాతం మార్కెట్లకు ఇస్తామన్నారు. ఆ 30 శాతం కూడా ఆ 30 శాతం కూడా రూ. 300 ఎక్కువగా అమ్మితే వారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి కూడా అడిగిన తక్షణమే కేంద్రం నుండి 50 వేల మెట్రిక్ టన్నులు తీసుకువచ్చారని చెప్పారు.
ప్రభుత్వం మొదటి విడతకు ఎన్ని ఎకరాలు వరి సాగు చేశారో ఆ ఎకరాకు పాతి కేజీలు చొప్పున మేం ఇప్పుడు యూరియా సరఫరా చేస్తున్నామన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అప్పుడు ఈ వైసీపీ నాయకులు ఒక్క ధాన్యం గింజ కూడా కొనుగోలు చేయలేదన్నారు. ఈరోజు 24 గంటల్లో మేం డబ్బులు వేశామని ఇది నిజమా కాదా? అని ఈ సందర్భంగా ప్రశ్నించారు.