గతంలో ప్రభుత్వంలో ఉండగా యూపీఏ ముఠా సభ్యులు, సెక్యూలరిజం పేరుతో ఓట్ల కోసం ఎంత ప్రమాదకర ఆట అడారో గమనించండి.ప్రపంచవ్యాప్తంగా దేశంలో జరిగిన పలు బాంబు దాడులకు, యూపీఏ ముఠా సభ్యులు ఏనాడూ వాటికి ఇస్లాం టెర్రరిజం అని గాని, గ్రీన్ టెర్రరిజం అనే పదాలు ఉపయోగించలేదు.కానీ యూపీఏ పాలనలో, హిందూ టెర్రరిజం లేదా సాఫ్రాన్ (కాషాయ ఉగ్రవాదం)టెర్రర్ పదాలు తరుచుగా, విరివిగా ఉపయోగించే వారు.కారణం తెలుసా? ఇదిగో చదవండి.
యూపీఏ ప్రభుత్వం లో ఉండగా అప్పటి హోమ్ సెక్రటరీ గా పనిచేసిన RVS మణి రిటైర్ అయ్యాక “హిందూ టెర్రర్” అనే ఒక పుస్తకం రాశారు. దానిలో అప్పుడు ప్రభుత్వ సమయంలో జరిగిన సంఘటనలు గురించి వివరించారు.యూపీఏ ప్రభుత్వ హయాంలో తరుచుగా బాంబు దాడులు జరుగుతూ ఉండడం, దానిలో దేశ, విదేశీ ముస్లిం ల పాత్ర బయట పడుతూ, వారి సమాజానికి చెడ్డపేరు వస్తూ ఉండడం, తమ సెక్యూలర్ ఓట్ బ్యాంక్ కి ఇబ్బంది కలుగుతూ ఉండటంతో.. దానిని కౌంటర్ చెయ్యడానికి యూపీఏ పెద్దలు రాహుల్, చిదంబరం, షిండే, దిగ్విజయ్ సింగ్ మొదలగు వారు దేశంలో హిందూ టెర్రరిజం పెరిగిపోతోంది అని ప్రకటనలు ఇచ్చేవారు.దానికి రుజువులు కోసమా అన్నట్లు.. అప్పటికే జరిగిన కొన్ని బాంబు దాడులు ముస్లిమ్స్ చేసినట్లు ప్రాధమిక రుజువులు దొరికినా, అవి హిందూ సంస్థలు చేసినట్లు గా కేసులు మార్చమని తమపై ఒత్తిడి చేశారు అని RVS మణి తన పుస్తకం ” హిందూ టెర్రర్” లో రాశారు.
మీకు గుర్తు ఉండే ఉంటుంది. అప్పట్లో సంఝౌత ట్రైన్ బ్లాస్ట్, మాలేగాం, మక్కా మసీదు బాంబు దాడుల సమయంలో , ముందుగా దొరికిన ఆధారాలు బట్టి కొందరి ముస్లిం యువకులను అరెస్ట్ చేశారు. కానీ కొన్ని రోజులకు అకస్మాత్తుగా దర్యాప్తు సంస్థలు ఆ దిశగా విచారణ అపి, వారు కాదు అని చెప్పి స్వామి అసీమానంద, కల్నల్ పురోహిత్, సాధ్వి ప్రజ్ఞలను అరెస్ట్ చేసి, సుమారు 8 సం. లు విచారణ సాగదీస్తూ కనీసం ఛార్జ్షీట్ ఫైల్ చెయ్యకుండా జైలులో ఉంచారు. తరువాత కోర్టులు అందరికి బెయిల్ ఇచ్చాయి.
మొన్న మాలేగామ్ బాంబు పేలుడు కేసు విచారణ సమయంలో ఒక సాక్షి మాట్లాడుతూ.. అప్పటి మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్ అధికారి పరమ్ బీర్ సింగ్ ఈ మాలేగావ్ బాంబు దాడి వెనుక, యోగి ఆదిత్యనాథ్, కొందరు RSS ప్రముఖులు ఉన్నట్లు వారి పేర్లు చెప్పమని తనని టార్చర్ చేశారు అని NIA కోర్ట్ కి తెలిపాడు. ఈ పరమ్ బీర్ సింగ్ ఎవరో కాదు. ముంబై మాజీ పోలీసు చీఫ్. తప్పుడు కేసులో అర్ణబ్ని అరెస్ట్ చేసిన వాడు. వందల కోట్లు బెదిరింపు వసూళ్ల కేసులో పట్టుబడి,అనేక కేసులు ఎదుర్కొంటూ, సస్పెండ్ అయ్యి, నెలల పాటు తప్పించుకు తిరుగుతూ అరెస్ట్ కాకుండా సుప్రీంకోర్టు దగ్గర ముందస్తు రక్షణ పొంది ఉన్నాడు. 26/11 ముంబై దాడుల సమయంలో, కసబ్ దగ్గర దొరికిన ఫోన్ ఈయన మాయం చేశారు అని కూడా ఒక ఆరోపణ.
అంటే యూపీఏ ప్రభుత్వం హిట్ లిస్ట్ లో అప్పటి నుండే మోడీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ వున్నారు అని తెలుస్తోంది.అదే కర్మఫలం అంటే. ఇప్పుడు ఆ ముగ్గురే దేశంలో బాగా పవర్ఫుల్ అయి ఆ యూపీఏ సెక్యూలర్ ముఠాకు చెమటలు పట్టిస్తున్నారు.ఒక పక్క లేని హిందూ టెర్రరిజానికి ప్రచారమిస్తూ , అరెస్టు కాబడిన అసలు టెర్రరిస్టులను విడిచిపెట్టేవారు. 2010 లో యూపీఏ ప్రభుత్వం దేశంలో వివిధ జైళ్లలో ఉన్న 25 మంది కరుడుగట్టిన పాక్ టెర్రరిస్టులను goodwill gesture అంటే స్నేహపూర్వక సంబంధాల కోసం విడుదల చేసింది. వీళ్ళల్లో ముఖ్యులు ఎవరో తెలుసా? 1999 లో వాజపేయి హయాంలో విమానం హై జాక్ చేసి, జైషే చీఫ్ అజర్ మసూద్ ని విడిపించుకుపోయినప్పుడు వారు విడుదల కోరిన మరో వ్యక్తి
పేరు ‘లతీఫ్’. ఈ లతీఫ్ జమ్మూకాశ్మీర్ జైల్లో ఉంటే, 2001 పార్లమెంటు పై దాడి తరువాత భద్రతా కారణాల దృష్ట్యా వీడిని 2002లో వారణాసి జైలుకి తరలించారు.
2010 లో ఇలా స్నేహపూర్వకంగా విడుదల చేసిన 25 కరుడుగట్టిన పాక్ ఉగ్రవాదుల్లో ఈ లతీఫ్ ఒకడు. ఇంకా దారుణం ఏమిటంటే.. 2016లో పఠాన్ కోట్ ఎయిర్ బేస్ మీద దాడి చేసిన నలుగురు ఉగ్రవాదుల
వెనుక సూత్రధారి ఈ లతీఫ్ అని NIA నిర్ధారణకు వచ్చింది.అంటే యూపీఏ ప్రభుత్వం రాజకీయ ఓటు బ్యాంకు అవసరాల కోసం, ఒక వైపు లేని హిందూ ఉగ్రవాదాన్ని నిరూపించడానికి పథకాలు రచిస్తూ , కొందరు హిందువులను ఉగ్రవాదులుగా ముద్రవేసి అరెస్టులు చేస్తూ, మరో వైపు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి మోడీని, అమిత్ షాను కేసుల్లో ఇరికించడానికి ఎన్ కౌంటర్ లో చనిపోయిన ఉగ్రవాదులు ఇశ్రాట్ జహాన్, సొహ్రబుద్దీన్ లను వెనకేసుకు రావడం, సం. ల నుండి జైళ్లలో ఉన్న ఇస్లామిక్ టెర్రరిస్టులను పాక్ తో మంచి సంబంధాల కోసం అనే నెపంతో ఊరికే విడిచిపెట్టడం చేశారు.
దేశ భద్రత, దేశ ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి, వీరు ఆడిన ఓటు బ్యాంకు ఆటలు వల్లే 2004-14మధ్య దేశంలో భద్రతా వ్యవస్థ నాశనం అయిపోయి, అన్ని ప్రముఖ నగరాల్లో పెద్ద పెద్ద బాంబు దాడులు జరిగి వందల మంది చనిపోయారు. దీనికి ఎవరిది పాపం? ఎవరు బాధ్యత వహిస్తారు?ఒక వైపు బీజేపీని మతతత్వం పెంచుతోంది అని కూసే వాళ్లకు.. మరి సెక్యూలర్ పార్టీలు అని చెప్పుకునే ఈ పార్టీలు చేసే దారుణాలు కనిపించవా? ఏనాడయినా ప్రముఖ తెలుగు జర్నలిస్టులు వీటి మీద “కొత్త పలుకులు” “ఇండియా గేట్” లు రాశారా?రాయరు. కారణం? వారి వామపక్ష భావజాలం దేశ శ్రేయస్సు కంటే బీజేపీని వ్యతిరేకించాలి అని చెబుతుంది. ఏమో వారి మనసాక్షికే తెలియాలి.
ఉగ్రవాదుల దాడుల్లో సామాన్య ప్రజలు చనిపోకుండా,దేశ ఆస్తులు నాశనం అయిపోకుండా ఈ 7సం.లలో
ఇంత గొప్పగా మేనేజ్ చేస్తున్న దేశ అంతర్గత భద్రత గురించి, వీరి ఎర్ర పెన్నులు కనీసం ఒక వాక్యం అయినా రాసాయా? రాయవు. రాస్తే సెక్యులరిజం ప్రమాదంలో పడిపోతుంది.
అందుకే సెక్యులరిజం పేరుతో నిర్లజ్జగా ఈ ప్రముఖ జర్నలిస్టులు అందరూ.. అవినీతి, కుల కుటుంబ పార్టీలను నిర్లజ్జగా సమర్థిస్తూ బోలెడు చిత్ర విచిత్ర వ్యాసాలు రాస్తారు.ఇప్పుడు కేంద్రంలో సెక్యులర్ ప్రభుత్వం అధికారంలో లేదు కదా! అందుకే ఇప్పుడు హిందూ ఉగ్రవాదం పేరుతో, సెక్యులర్ పార్టీలు మొదలుపెట్టిన మరో భయంకరమైన ఆట గురించి మరోసారి తెలుసుకుందాం.
( రచయిత ప్రస్తావించిన అభిప్రాయాలతో సూర్య వెబ్‌సైట్‌కు సంబంధం లేదు. అది రచయిత వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని గమనించగలరు)
– పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు