Suryaa.co.in

Telangana

ఉప్పల్ ప్రీ బిడ్ మీటింగ్ సక్సెస్

-మూడో లేఅవుట్ లో అమ్మకానికి 63 ప్లాట్లు
-మల్టీపర్పస్ జోన్ కింద అందుబాటులో చిన్న, పెద్ద ప్లాట్లు

హైదరాబాద్ : నగరం నడిబొడ్డులో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ఉప్పల్ భగత్ మూడో దశ 63 ప్లాట్ల అమ్మకాలకు మంగళవారం సైట్ వద్ద నిర్వహించిన ప్రీ బిడ్ సమావేశం విజయవంతమైంది.

దాదాపు కొంతమంది ఔత్సాహికవేత్తలు పాల్గొన్న ఈ ప్రీ బిడ్ మీటింగ్ లో హెచ్ఎండిఏ సెక్రెటరీ చంద్రయ్య ఉప్పల్ భగయత్ లేఅవుట్ ప్రాధాన్యతను తెలిపారు. ప్రస్తుతం 63 ప్లాట్లను ఆన్ లైన్ వేలంలో పెట్టామని, ఇవన్నీ మల్టీ పర్పస్ యూస్ జోన్ కింద ఉన్నాయని, 323 చదరపు గజాల నుంచి 9,873 చదరపు గజాల స్థలాలు ఉన్నట్లు సెక్రెటరీ వివరించారు

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టి.సి ప్రతినిధి అనురాగ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్లాట్ల వివరాలను, నియమ నిబంధనలను వెల్లడించారు.

ఈ సమావేశానికి చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ (సిపిఓ) గంగాధర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హరికృష్ణ తదితరులు హాజరయ్యారు.

LEAVE A RESPONSE