Suryaa.co.in

International

ఉక్రెయిన్ కు మద్దతిస్తాం:అమెరికా సెనేట్ తీర్మానం

ఉక్రెయిన్ పై రష్యా దాడికి పాల్పడితే.. ఉక్రెయిన్ కి మద్దతిస్తామని తీర్మానించింది అమెరికా సెనేట్. స్వతంత్ర, ప్రజాస్వామ్య ఉక్రెయిన్ కి మద్దతిస్తామని రాత్రి.. అమెరికా సెనేట్ ఏకగ్రీవంగా రెండు తీర్మానాలు చేసింది. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత కాపాడేందుకు, రక్షణ పరంగా ఉక్రెయిన్ ను బలోపేతం చేసేందుకు.. రక్షణ, రాజకీయ, దౌత్యపరంగా.. అన్నిరకాలుగా.. సాయం అందిస్తామని సెనేట్ తీర్మానం చేసింది. యుద్ధ ప్రకటన లేదా రష్యన్ ఫెడరేషన్ కు వ్యతిరేకంగా.. బలగాలు ఉపయోగించే అధికారం కల్పిస్తూ.. తొలి తీర్మానం చేసింది. ఉక్రెయిన్ లోకి అమెరికా బలగాలు ప్రవేశపెట్టే అధికారం కల్పిస్తూ.. రెండో తీర్మానం చేసింది.

LEAVE A RESPONSE