– వచ్చేది మరో అద్దె హెలికాఫ్టర్
– అదనపు సౌకర్యాలు, అదనపు ఖర్చు ఆదా కోసవే
– ప్రభుత్వ అద్దె హెలికాఫ్టర్ పై వైసీపీ ఫేక్ ప్రచారం.
– తప్పుడు ప్రచారం పై చర్యలు తప్పవంటున్న ప్రభుత్వ వర్గాలు
అమరావతి : ఏపీ ముఖ్యమంత్రికి గతంలో ఉన్న హెలికాఫ్టర్ స్థానంలో వేరే హెలికాఫ్టర్ ను అద్దెకు తెప్పిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం కొత్త హెలికాఫ్టర్ కొనుగోలు చేయలేదు. గతంలో ఎలాగైతే అద్దె చెల్లింపు ద్వారా హెలికాఫ్టర్ వాడుతున్నారో, ఇప్పుడే అదే విధానాన్ని ఫాలో అవుతున్నారు.
అద్దెకు తీసుకునే చాపర్ మోడల్, కంపెనీ మార్చారు తప్ప, కొత్తది కొనుగోలు చేయలేదు. అయితే ఇప్పుడు అద్దెకు తీసుకునే చాపర్ గతంలో వాడే దానికంటే కొంచెం అధునాతనమైనది. దీనిలో నేరుగా రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి అయినా ప్రయాణం చేయవచ్చు. భద్రత పరంగా కూడా గత హెలికాఫ్టర్ కంటే కొంచెం మెరుగైనది.
గతంలో విజయవాడ నుంచి సుదూర ప్రాంతాలకు, చిట్టచివరి జిల్లాలకు వెళ్లాలంటే కొంత దూరం విమానం, తరువాత హెలికాఫ్టర్ వాడే వాళ్లు. దీని వల్ల అదనంగా ఖర్చు అవ్వడంతో పాటు ఎక్కువ సమయం పట్టేది. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విమానంలో ముందుగా విశాఖ లేదా తిరుపతి లేదా కడప, కర్నూలు వెళ్లడం…అక్కడ నుంచి హెలికాఫ్టర్ లో జిల్లాలకు, నియోజకవర్గాలకు వెళ్లాల్సి వచ్చేది.
అయితే ఇప్పుడు అద్దెకు తెచ్చిన వేరే కంపెనీ హెలికాఫ్టర్ ద్వారా, అమరావతి నుంచి నేరుగా అటు శ్రీకాకుళం, ఇటు చిత్తూరు వరకు ప్రయాణం చేయవచ్చు. దీని వల్ల ప్రభుత్వ కాన్వాయ్ లు, ఫ్లైట్ ఖర్చులు మిగులుతాయి. ఎక్కడా ట్రాఫిక్ నిలిపివేతలు, బందోబస్తు డ్యూటీలు వంటివి కూడా అవసరం ఉండదు.
నేరుగా ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికే సీఎం అమారవతి నుంచి వెళ్లే అవకాశం ఉండడం వల్ల సమయం కూడా కలిసి వస్తుంది. భద్రత, ఖర్చు, సౌకర్యం తో పాటు ఇతర అన్ని అంశాలను పరిశీలించి ఈ హెలికాఫ్టర్ ను అద్దెకు తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి.
అంతిమంగా ఏంటంటే…హెలికాఫ్టర్ కొత్తది కొనలేదు. అద్దెకు తీసుకునే చాఫర్ మోడల్ మారింది. ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.