-ప్రజలే కృష్ణులు అని జగన్ చెప్పింది నిజమే. ఎన్నికల ముందు తనను అహంకారంతో అర్జునుడితో పోల్చుకున్నాడు జగన్.
నిజంగా జగన్ అర్జునుడైయుంటే..
“కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః |
మహాశనో మహాపాప్మా విధ్ధ్యేనమిహ వైరిణమ్”
రజోగుణం నుండి పుట్టిన కామ, క్రోధములు అతి పాపకరమైనవి, అతి భయంకరమైనవి. అర్జునా వీటిని ఈ లోకంలో నీ శత్రువులుగా భావించు అని గీతలో కృష్ణుడు అర్జునుడ్దికి చెప్పిన విషయం అర్థం చేసుకొనేవాడు.
ఎంత అక్రమ సంపాదన సరిపోతుందో తెలియక, ప్రతిపక్ష పార్టీల మీద, సంఘాల మీద, ఉద్యోగుల మీద, ఆఖరికి ప్రజల మీద కూడా క్రోధం చూపాడు.
కాళింది మడుగున దాక్కొన్న కాళీయుడి లెక్కన, తాడేపల్లిలో దాగి, గ్రానైట్ కొండల నుండి ఇసుక వరకు మింగుతూ.. తన పడగలతో విషం కన్నా భయంకరమైన బూతులు కక్కిస్తూ జనం భూముల్లో కూడా తన పడగ రాల్లతో బుసలు కొడుతూ భయపెట్టాడు జగన్.
“ద్వౌ భూత సర్గౌ లోకే ‘స్మిన్ దైవ ఆసుర ఏవ చ |
అహింసా దీక్షమా చైవ దైవీ సంపత్తి తో నృణామ్”
ఈ శ్లోకంలో, మనుషులు భౌతిక ప్రపంచంలో రెండు ప్రధాన గుణాల కలవారుగా విభజించబడతారని క్రిష్ణుడు చెబుతాడు. ఒకటి దైవీ గుణాలు (దైవ సంపత్తి) – ఇవి మంచి గుణాలుగా భావించబడతాయి, జాలి, క్షమ, అహింస వంటి గుణాలతో కూడి ఉంటాయి. రెండవది అసుర గుణాలు (ఆసుర సంపత్తి) – ఇవి చెడు గుణాలను సూచిస్తాయి.
అలా సాత్వికులైన ప్రజలుగా, వైకాపాసురులుగా ఎన్నికలకు ముందు మానసికంగా విడిపోయారు ఆంధ్రులు. ఈ విషయం చివరి వరకు భయంతో.. సాత్వికులు తెలియనివ్వలేదు వైకాళీయునికి.
ప్రజలే కృష్ణు లు అని జగన్ చెప్పింది నిజమే.
ఈశ్వర్: సర్వభూతానాం హృద్దేశేర్జున్ తిష్ఠతి
భ్రామయన్సర్వభూతాని యంత్రారూఢాని మాయయా
సమస్త ప్రాణుల హృదయాలలో విలసిల్లుతూ.. తన మాయతో సర్వ భూతాలను కీలుబొమ్మలు చేసి ఆడిస్తూ ఉంటాడు అని అర్జునిడితో అన్నట్లుగా.. ఆ క్రిష్ణుడే ప్రజల మనసులతో మంచి కర్మ చెయ్యిస్తూ పోలింగ్ రోజు కుల్లబొడిపించినట్లున్నాడు వైకాలీయుడిని.
– రాజేష్