Suryaa.co.in

Entertainment

కదిలే కలం..కలకాలం!

ఆయన ఓ కదిలే
సినిమా భాండాగారం..
ఆ మెదడుందే దానికి
సినిమా మొదలు తెలుసు..
ఆయన మనసే ఓ వెండి తెర
ఆ మనసుకు సినిమా
సొగసూ ఎరుకే..
దాని ధర్మమూ..మర్మమూ
ఎరుకే..!
మొత్తం సినిమా చరిత్ర
ఆయన అంత’రంగా’నికి
అవగతమే..
అసలు సినిమానే ఆయన మనోగతం..!

విఎకె రంగారావు..
ఒక సినిమాపై
ఆయన విశ్లేషణ
ఆ సినిమా గణవిభజన
దర్శకుని గుణ వివరణ..
రచయిత జ్ఞాన విభాజన..
నిర్మాత వ్యాపార వివేచన..
స్థూలంగా ఒక సినిమా
పండితుడి అభిణాషన!

ఆ రాతలు చదువుతుంటే
సినిమా చూస్తున్నట్టే..
ఎన్నెన్ని కబుర్లు..
ఇంకెన్ని ముచ్చట్లు..
నిర్మాత ఇక్కట్లు..
కొత్త నటుల
వచ్చీరాని పాట్లు..
దర్శకుల ప్లాట్లు..
ఏఎన్నార్ దేవదాసు నిషా..
ఎన్టీఆర్ మారువేషాల తమాషా..
శోభన్ ఇద్దరు నాయికల గోల
కృష్ణ గూఢచారి లీల..
అంతకు ముందు నాగయ్య
ఎలా అయ్యాడో త్యాగయ్య..
బి ఎన్ రెడ్డి వాహినీ..
ఆయన తమ్ముడి
విజయా సమ్మోహినీ..
కె వి రెడ్డి మాయాబజార్
విశేషం..
పాతాళభైరవి నేపాలీ
మంత్రికుడు ఎస్వీఆర్ వేషం..
సావిత్రి ఉత్థాన పతనం..
జమున అందం..
అంజలి అభినయం..
ఆదుర్తి సమయస్ఫూర్తి..
విశ్వనాధుని కళా స్ఫూర్తి..
దర్శకేంద్రుడి బొడ్డు మూర్తి..
సిఎస్సార్..రాజనాల..
నాగభూషణం..
రావు గోపాలరావు..కోట..
విలనీల పరంపర..
ఆత్రేయ మనసు..
ఆరుద్ర సాహితీ సొగసు..
శ్రీశ్రీ విరుపు..
దాశరథి మెరుపు..
వేటూరి అందాలు..
సిరివెన్నెల పదాలు..
ఇలా తెలియని సంగతి..
రాయని విషయం..
ఉండవేమో కాలమే ఎరుగని ఆ కలానికి..!

మనిషి అరవై పూర్తి చేసుకుంటే షష్టిపూర్తి..
కలం చేసుకుంటే
సాహితీ స్ఫూర్తి..
రంగారావుది
రాయల్ హిస్టరీ..
ఆయన పెన్నుదేమో
అలుపెరుగని ఓ మిస్టరీ!

– సురేష్ కుమార్ ఇ
9948546286

LEAVE A RESPONSE