-ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధిస్తామని నమ్మకం ఉంది
-హోదా ముగిసిన అధ్యాయం అని చంద్రబాబు చెబితే.. హోదాను సజీవంగా ఉంచింది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే
-హోదా కోసం వైయస్ఆర్సీపీ నిరంతర పోరాట ఫలితమే కేంద్ర త్రీమెన్ కమిటీ ఎజెండాలో హోదా అంశం
ప్రత్యేక హోదాతో సహా విభజన చట్టంలోని అంశాలకు సంబంధించి ఏర్పాటైన కేంద్ర హోం శాఖ త్రిసభ్య కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వేర్వేరు చోట్ల స్పందించారు.
మచిలీపట్నం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ.. ఏమన్నారంటే..
ఇది చాలా సంతోషకరమైన వార్త. సీఎం జగన్, ఎప్పుడు ఢిల్లీ వచ్చినా ప్రధాని దగ్గర, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా దగ్గర ప్రత్యేక హోదా విషయాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు, తన స్వార్థం కోసం ప్యాకేజీకి ఒప్పుకుని, హోదా రాకుండా అన్యాయం చేశారు. ఇప్పుడు కేంద్ర హోం శాఖ నియమించిన త్రిసభ కమిటీ సమావేశంలో హోదా అంశాన్ని చేర్చడం శుభ పరిణామం.మేము పార్లమెంటులో ప్రతి సమావేశంలో హోదా గురించి అడుగుతూనే ఉన్నాం. ఇదే పట్టుదలతో ఎంపీలు అందరం, సీఎంసలహా, సూచనలకు అనుగుణంగా పని చేసి, హోదా సాధిస్తామన్న నమ్మకం ఉంది.
హోదా అనేది ముగిసిన అధ్యాయమని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఎందుకంటే హోదా అనేది మన హక్కు. కానీ దాన్ని నీరుగార్చి, హోదా రాకుండా చేసింది చంద్రబాబు.విభజన సమయంలో హామీ ఇచ్చారు. కాబట్టి దాని సాధన కోసం సీఎంగారు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆయన కృషి వల్లనే త్రిసభ్య కమిటీ సమావేశంలో హోదా అంశాన్ని కూడా చేర్చారు. హోదా ముగిసిన అధ్యాయమని మాట్లాడిన చంద్రబాబు, టీడీపీ నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు?
ఇకనైనా వారు తమ వైఖరి మార్చుకోవాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి ముందుకు రావాలి.విభజన తర్వాత ఆస్తుల పంపిణీతో సహా, అనేక అంశాలపై ఇంకా వివాదాలు నెలకొన్నాయి. వాటన్నింటినీ సాధించుకోవాల్సి ఉంది. అందుకే సీఎం వైయస్ జగన్, ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి హోదాతో సహా, మిగిలిన వాటన్నింటి గురించి అడుగుతూనే ఉన్నారు.
జగన్ కృషి, పట్టుదల వల్ల, ఆయన ప్రధానిని ఒప్పించడం వల్లనే ఇప్పుడు త్రిసభ్య కమిటీ సమావేశం జరగనుంది. అందుకే ప్రత్యేక హోదాను కూడా ఎజెండాగా చేర్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రత్యేక హోదా సాధించడం కోసం మా వంతుగా మేము చాలా గట్టి ప్రయత్నం చేస్తాం.
వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఏమన్నారంటే…
ఇది మంచి పరిణామం. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత కొన్ని వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాటి పరిష్కారం దిశలో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ.. కీలకమైన ప్రత్యేక హోదా విషయంపైనా చర్చించబోతోంది.
ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏమిటంటే, ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని చంద్రబాబునాయుడు నాడు చెప్పారు. ఆ అంశాన్ని వెయ్యి అడుగుల గొయ్యి తీసి బాబు పాతిపెట్టారు.
సీఎం వైయస్ జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ హోదా అంశాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. ప్రధాని దగ్గర, కేంద్ర హోం శాఖ వద్ద రాష్ట్రానికి హోదా ఇవ్వాలని కోరుతూనే ఉన్నారు. అంతే కాకుండా పార్లమెంటులో కూడా పార్టీ సభ్యులు, ఈ అంశాన్ని ప్రతిసారి లేవనెత్తుతూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆ ప్రత్యేక హోదా అంశం ఇప్పుడు తిరిగి ఎజెండాలోకి రావడం అనేది శుభ పరిణామం.
ఆ సమావేశంలో దీనిపై ఎంత వరకు చర్చ జరుగుతుంది. ఏమేర సఫలం అవుతుంది అన్న విషయం పక్కన పెడితే, రాష్ట్రానికి హోదా కోసం జగన్‌గారు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారన్న విషయం మాత్రం స్పష్టం అవుతోంది. అయితే మాకు మాత్రం ప్రత్యేక హోదాపై నమ్మకం ఉంది.
నిజానికి విభజన వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి, దాన్ని పట్టించుకోలేదు.
చంద్రబాబు హోదాని ముంచేసినా ఎలాగోలా బయటకు తీసి, సాధించడం కోసం జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారు. దీన్ని ప్రజలతో పాటు, విపక్షం కూడా గమనించాలి.ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు. ఒక వేళ అలా జరిగినా, దాన్ని బయటకు తీసుకువచ్చి, సమావేశం ఎజెండాలో చేర్చిన ఘనత సీఎం జగన్‌ది కాదా.నాడు రాష్ట్ర విభజన చేసినప్పుడు పార్లమెంటులో బీజేపీ కూడా ఉంది. అయినా విభజన తర్వాత హోదా ఇవ్వకుండా రాష్ట్రానికి అన్యాయం చేశారు.
ఒక్కటి మాత్రం నిజం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం కాదు. ఆ హోదా సాధన కోసం సీఎం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆయన కృషి వల్లనే ఈనెల 17న జరిగే సమావేశంలో ఎజెండాగా రానుంది.
హోదాతో పాటు, మిగిలిన అనేక అంశాలు కూడా ఆ సమావేశంలో పరిష్కారమవుతాయని భావిస్తున్నాము. అధికారం చేపట్టిన నాటి నుంచి ఎప్పుడు డిల్లీకి వెళ్లినా సీఎం వైయస్ జగన్, హోదా అంశాన్ని అడుగుతూనే ఉన్నారు. అంతే కాకుండా ప్రతి పార్లమెంటు సమావేశంలో వైయస్సార్‌సీపీ ప్రతినిధులు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. వీటన్నింటి వల్లనే ఇప్పుడు త్రిసభ్య కమిటీ సమావేశంలో హోదా అంశాన్ని ఎజెండాలో చేర్చారని చెప్పవచ్చు.