-కేంద్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వల్లూరు జయప్రకాశ్ నారాయణ
గుంటూరు : జాతీయ జెండా ను ఇష్టానుసారంగా మార్చే హక్కు ఎవరు ఇచ్చారు ముందస్తుగా చెప్పకుండా జాతీయ జెండాను ఎలా తొలగిస్తారు? వైసీపీ పార్టీ జెండా మార్చినట్లు జాతీయ జెండా తీస్తే చూస్తూ ఊరుకోం. ఇప్పుడు దానికి వివరణ ఇవ్వడం ఏంటి? జాతీయ జెండాను ఇష్టానుసారంగా తీయడం పెట్టడం రాజ్యాంగ ఉల్లంఘనే. ముస్లిం ఓట్లు కోసం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దేశాన్ని అవమానపరిచేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. జాతీయ జెండాను ఏర్పాటు చేసినప్పుడు ప్రకటన విడుదల చేశారు. జాతీయ జెండా ను తీసేటప్పుడు కూడా ప్రకటన చేయాల్సిన భాధ్యత. రెండు రోజుల్లో జాతీయ జెండాను ఏర్పాటు చేయకపోతే మేము అక్కడ జాతీయ జెండా ఏర్పాటు చేస్తాం. జాతీయ జెండా ను ఎలా తొలగించారో సీసీ ఫుటేజ్ విడుదల చేయాలి. దేశానికి ద్రోహం చేసిన జిన్నా దేశానికి ఐకానిక్ ఎలా అవుతాడు? కమిషనర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.