వేసవికాలం ప్రారంభం కాకముందే కరెంట్ కోతలు

-ఉచిత విద్యుత్ కు మంగళం
-కోతలతో చిన్న తరహా పరిశ్రమలు కుదేలు
-బహిరంగ మార్కెట్ కమిషన్లకు రూ.. 20 తో కొనుగోలు చేయటం మానాలి
-కృష్ణపట్నం విద్యుత్ ఉత్పత్తి రంగాన్ని ఆదానికి అమ్మే యోచన
-రాయలసీమ నెల్లూరు,ప్రకాశం జిల్లాల రైతాంగ సమస్యలపై అనంతపురంలో సదస్సు
– సీపీఐ జిల్లా కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ఆగ్రహం

వేసవి కాలం ప్రారంభం కాక మునుపే రాష్ట్రంలో కరెంట్ కోతలు తీవ్ర తరమైయ్యాయని, రోజుకు కనీసం 7 గంటలు విద్యుత్ సరఫరా చేసే పరిస్థితి రాష్ట్రంలోను,జిల్లాలోనూ కనిపించడం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

బుధవారం సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరెంట్ కోతలతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని,విద్యుత్ తో నడపబడతున్న ఐస్క్రీమ్, బ్యూటీ పార్లర్,బైండింగ్ చిన్న పరిశ్రమలలో పనిచేసే కూలీలకు నష్ట కష్టాలు పడుతున్నారన్నారు సీఎం జగన్ రాష్ట్రం విద్యుత్ మిగుల్లో ఉందని ఢంకా బజాయిస్తున్నారన్నారు.

విద్యుత్ మిగుల్లో ఉంటే విద్యుత్ రంగాలైన పరిశ్రమలు జెన్కో,ఆర్టిపిపి,ఎన్టీపీసీ చెందిన పరిశ్రమలు బొగ్గు ను సరఫరా చేయకుండా మట్టి దిబ్బలను సరఫరా చేస్తున్నాయని నివేదికలు తేటతెల్లం చేశాయన్నారు.

రాష్ట్రంలోని విద్యుత్ రంగాలు రూ..4 కు తయారు చేసే సామర్ధ్యం కలిగి ఉన్నా 7 నుంచి 21 రూపాయలకు బయటినుంచి కొనుగోలు చేస్తున్నారన్నారు ఈ కొనుగోళ్లలో కోట్లరూపాయలు చేతులు మారుతున్నాయని, విద్యుత్ సరఫరాపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

రైతుల వ్యవసాయానికి రోజుకు 9 గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని చెబుతున్నారే కానీ ఆచరణలో లేదన్నారు.వైస్సార్ మానస పుత్రిక రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్కు రాష్ట్ర ప్రభుత్వం మంగళం పలకడం దారుణమన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగుస్తున్నారని ప్రభుత్వం తీరుపై మండి పడ్డారు విద్యుత్ కోతలతో పాటు వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం దారుణమన్నారు రూ..500 తో ఒక్క మడవ కట్టుకునే వారని నేడు కరెంట్ కోతలతో ఇద్దరు కూలీలను పెట్టుకొని మడవ కట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.

బహిరంగ మార్కెట్ కమిషన్లకు రూ.. 21 తో విద్యుత్ కొనుగోలు చేయటం మానాలని హితవు పలికారు.దేశంలోనే నాణ్యత కలిగిన కృష్ణపట్నం విద్యుత్ ఉత్పత్తి రంగాన్ని ఆదాని కంపెనీకి 25 ఏళ్లకు లీజుకు కట్టబెట్టే యోచన చేయడం మంచిది కాదన్నారు.ఈ అంశాలపై ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

సీపీఐ ఆధ్వర్యంలో 24 గురువారం అనంతపురం లో రాయలసీమ, నెల్లూరు,ప్రకాశం జిల్లాల రైతాంగ సమస్యలపై సదస్సులు నిర్వహించి భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించి పోరాటాలకు శ్రీకారం చుట్టి నున్నామన్నారు.

ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధి చేస్తున్నామన్నారు కానీ ఇంతవరకు పరిశ్రమల ఏర్పాటు కానీ,నీటి పారుదల సమస్యలపైన కానీ,ప్రాజెక్టులు కానీ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణాలకు సంబంధించి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందం ఉందన్నారు.

హంద్రీనీవా నీటి కోసం అనంతపురం, కర్నూలు జిల్లాలు ఉద్యమాలు చేస్తున్నాయన్నారు. గలేరు నగరి అంతర్భాగమైన రెండో దశ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని కడపజిల్లా రైతాంగం ఆందోళన చేస్తున్నారన్నారు. ఇంతవరకు ప్రభుత్వం వీటిపై కాగితాలకే పరిమితం అయిందని కార్యాచరణకు పునుకోలేదన్నారు. ఎంతసేపు ఎత్తిపోతల పేరిట డబ్బును ఎత్తి పోసుకుంటున్నారని దుయ్యబట్టారు.

రాయలసీమ నెల్లూరు,ప్రకాశం జిల్లాల రైతాంగ సమస్యలపై అనంతపురంలో సదస్సు నిర్వహించి భవిష్యత్తు పోరాటాలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. ఈ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి యన్. వెంకటశివ, జిల్లా సమితి సభ్యులు సావంత్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply