వందేమాతరం గీతంపై దేశంలో చర్చ జరుగుతున్న ఈ తరుణంలో విదేశీ మతోన్మాదానికి, విదేశీ మత సంతుష్టీకరణకు అతీతంగా ఆ వందేమాతరం గీతంపై సరైన దృష్టి, ఆలోచన, అవగాహన అవసరం.
రవీంద్రనాథ్ టాగోర్ రాసిన “జనగణమన…” గీతం కన్నా బంకిమ్ చంద్ర చటర్జీ రాసిన “వందేమాతరం…” గీతం చాల గొప్పది! భావం పరంగానూ, అభివ్యక్తి పరంగానూ, సాహిత్యం పరంగానూ, మన మట్టికి చెందిన స్ఫూర్తి పరంగానూ “వందేమాతరం…” గీతం “జనగణమన…” గీతం కన్నా ఉన్నతమైంది!!
మన దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన “జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి…” గీతం “జనగణమన…” గీతం కన్నా ఎంతో గొప్పది! తమిళ్ష్ సుబ్రమణియ బారతియార్ (సుబ్రహ్మణ్య భారతియార్ కాదు) “జనగణమన…” గీతం కన్నా గొప్ప దేశభక్తి గీతాలు రాశారు. కవిగానూ ‘రవీంద్రనాథ్ కన్నా సుబ్రమణియ బారతియార్ గొప్ప కవి’. ఈ నిజం తెలిసిన వాళ్లలో బెంగాలీలు కూడా ఉన్నారు!
రవీంద్రనాథ్ తన పలుకుబడితో “వందేమాతరం…” గీతాన్ని పక్కకు జరిపించి తన రచన “జనగణమన…” గీతాన్ని జాతీయ గీతంగా ఎన్నిక చేసుకుని ఉండచ్చు. ఆ ప్రయత్నంలో భాగంగానే స్వయంగా రవీంద్రనాథ్ “వందేమాతరం…” గీతం జాతీయ గీతంగా ఉండడానికి తగనిదని చెప్పి ఉండచ్చు. ఒక దశలో వందేమాతరం గేయాన్ని సంగీత బద్ధం చేసి దేశ జనులు పాడుకునే గీతంగా చేసింది రవీంద్రనాథే.
దేశ స్వాతంత్ర్య పోరాట సమయంలో “వందేమాతరం…” గీతం దేశాన్నే ఉత్తేజపరిచింది. “వందేమాతరం…” ఒక మంత్రమై దేశ జనుల్ని దేశబద్ధుల్ని చేసింది. ఈ ఘనత “జనగణమన…” గీతానికి లేదు.
“వందేమాతరం…” గీతంలో ఉన్న దుర్గామాతపై పంక్తులు ముస్లీముల మనోభావాల్ని దెబ్బతీస్తాయని, అవి ముస్లీములకు అభ్యంతరకరంగా ఉంటాయని “వందేమాతరం…” గీతం జాతీయ గీతంగా ఉండడానికి తగదని నెహ్రూ, రవీంద్రనాథ్ మరి కొందరు ఘనులు భావించారట.
ముస్లీముల మనోభావాలకు, ఆశయాలకు తగ్గట్టు దేశ భూభాగాన్నే విభజించి ఇచ్చిన తరుణం అది. వాళ్లకు కావాల్సింది వాళ్లకు ఇచ్చేసిన
ఆ తరుణంలో మనదేశ జాతీయ గీతం విషయంలో ముస్లీములను ఎందుకు పరిగణించాల్సి వచ్చింది? మనదేశ గీతం మనదేశ ప్రజల, హైందవ మనోభాలకు, అభీష్టాలకు అనుగుణంగా ఉండాలి కానీ ఇతరులకు అనుగుణంగా ఉండడం ఏమిటి? విదేశీ మతానికి అనుగుణంగా మన మతం ప్రజలను మన దేశ ప్రజను దెబ్బకొట్టడం ఏమిటి?
1947లో మొత్తం దేశ జనాభాలో 24.3% ఉన్న ముస్లీమ్స్ కోసం 23.382% భారతభూమిని విభజించారు. కొందరు ముస్లీమ్స్ భారతంలోనే ఉండిపోయారు. 1951 నాటికి భారతదేశం జనాభాలో ముస్లీమ్స్ 9.91%. దాదాపుగా ఈ 10% ముస్లీమ్స్ మనోభావాలు దెబ్బతింటాయని దాదాపుగా 90% ప్రజల మనోభావాల్ని దెబ్బతీసింది నెహ్రూ వర్గం!
పెద్ద శాతం ఉన్న హిందువులకు వ్యతిరేకంగానూ అల్పసంఖ్యాకులైన ముస్లీములకు అనుకూలంగా నెహ్రూ మేధ పనిచేసింది. ఇది మతోన్మాదమే! అసలు మతోన్మాదమంటే ఇదే. నెహ్రూ ఇస్లామ్ అనుకూలంగా చేసిన చట్టాలు, చేపట్టిన పనులు ఇవాళ మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.
తొలి నుంచీ మనదేశాన్ని ఇస్లామీకరణ చేసేందుకు జరిగిన భయంకరమైన కుట్రలో, మనదేశంలోని భారతీయతను తుడిచిపెట్టేసే పన్నాగంలో భాగంగా జరిగిన ద్రోహాలలో “వందేమాతరం…” గీతాన్ని పక్కన పెట్టడం కూడా ఒకటి అన్న నిజం తేటతెల్లమౌతోంది.
“మహావిష్ణువు చక్రం ఎగురుతోంది.
గాలిలో నిప్పు కణాలు తోచాయి; పరమశివుడి త్రిశూలం దూకి దిగింది…” వంటి పంక్తులతో సనాతన చింతనావిష్కారం చేసిన బెంగాలీ ముస్లీమ్ విప్లవ కవి (బిద్రోహీ కబి)గా ప్రసిద్ధమైన నజ్రుల్ ఇస్లామ్ దుర్గామాతపై పలు కవితలు రాశారు. ముస్లీమైన నజ్రుల్ ఇస్లామ్ దుర్గామాతపై గొప్ప కవితలు రాసినప్పుడు రాని, లేని అభ్యంతరాలు, ఇబ్బందులు, నిరసనలు “వందేమాతరం …” గీతంలో దుర్గామాతపై ఉన్న పంక్తులవల్ల వస్తాయా?
‘సనాతనత్వంతో తొణికిసలాడుతూండే “వందేమాతరం…” గీతాన్ని జాతీయ గీతం చెయ్యకపోవడం దేశ ప్రజకు వ్యతిరేకంగానూ, భారతీయతకు విరుద్ధంగానూ జరిగిన కుట్రల్లో ఒకటి!’
“వందేమాతరం జయ వందేమాతరం – ఆర్యభూమిలో నారీ మణులూ, నర సూర్యులూ చేసే వీర నినాదం వందేమాతరం” అని సుబ్రమణియ బారతి అన్నారు.
ఈ మాటలు దేశ స్వాతంత్ర్య పోరాట సమయంలో “వందేమాతరం…”కు ఉన్న స్థానాన్ని తెలియజేస్తున్నాయి. ఈ స్థానం, ఈ స్థాయి “జనగణమన…”కు ఎప్పుడూ లేవు.
“వందేమాతరం అందాం – మా దేశమాతను పూజిస్తాం అందాం” అనీ సుబ్రమణియ బారతి అన్నారు. మనం ‘వందేమాతరం’ అని అంటూనే ఉందాం; మన దేశమాతను మనం పూజిస్తూందాం. విదేశీ మతోన్మాదానికి అతీతంగా మనదేశాన్ని అంకిత భావంతో కాపాడుకుందాం!
“జనగణమన…” గీతాన్ని తొలగించి “వందేమాతరం…” గీతాన్ని జాతీయ గీతంగా చేసుకోవడం పాత తప్పుల్ని సరిచేసుకుంటూ ‘నవ్య భారతం’లోకి, ‘భవిష్యత్ భారతం’లోకి సరిగ్గా వెళ్లడం ఔతుంది.
దేశ ప్రజకు, దేశంలో పెద్దశాతం ప్రజ అయిన హిందువుల అభీష్టాలకు, అవసరాలకు, ప్రయోజనాలకు వ్యతిరేకంగా చేసిన ఒకనాటి పాలకుల కుట్రలను భగ్నం చేసుకోవాల్సిన బాధ్యతలో భాగంగా ఇకనైనా “వందేమాతరం…” గీతాన్ని యథాతథంగా మన దేశ జాతీయ గీతం చేసుకుందాం.
‘వందేమాతరం జయ వందేమాతరం’

9444012279