Suryaa.co.in

Andhra Pradesh

రేపల్లె మద్యం మరణాలు జగన్ రెడ్డి ప్రభుత్వ హత్యలే

-అదాన్ డిస్టలరీదంతా అవినీతి హిస్టరీనే
-అదాన్ డిస్టలరీ విజయసాయిరెడ్డి బినామీ కంపెనీ – నిరూపించేందుకు టీడీపీ సిద్దం
-జగన్ రెడ్డి, వైసీపీ నేతల మద్యం అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి
– తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత

నాడు మద్యపాన నిషేదమని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నేడు తన బినామీల జేబులు నింపుకునేందుకు నాసికరం కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. శనివారం నాడు జరిగిన విలేకరుల సమావేశం జూమ్ లో ఆమె మాట్లాడుతూ….

జగన్ రెడ్డి ప్రభుత్వం అమ్ముతున్న మద్యం తాగి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రభుత్వం అమ్ముతున్న మద్యం తాగి బాపట్ల జిల్లా రేపల్లెల్లో ఇద్దరు చనిపోయారు. కల్తీ మద్యం అమ్మూతు ప్రాణాలు తీస్తున్నారనేదానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?

ప.గో జిల్లా జంగారెడ్డి గూడెంలో వారం రోజుల వ్యవధిలో 27 మంది చనిపోయారు. చిలకలూరిపేటలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కరోనా సమయంలో మద్యం రేట్లు పెంచటంతో శానిటైజర్ త్రాగి సుమారు 50 మంది చనిపోయారు. మూడేళ్లలో జే బ్రాండ్ మద్యం తాగి సుమారు 81 మంది చనిపోయారు. ఇవన్నీ జగన్ రెడ్డి సర్కార్ హత్యలే. జంగారెడ్డిగూడెం ఘటనపై మానవత్వం ఎవరైనా విచారణ జరిపి నివారణ చర్యలు తీసుకునేవారు. కానీ జగన్ రెడ్డి మాత్రం ఇవన్నీ సహజ మరణాలంటూ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి తమ అక్రమాల్ని కప్పి పచ్చుకునేందుకు ప్రయత్నించటం దుర్మార్గం. కల్తీ మద్యంపై నాడే చర్యలు తీసుకుని ఉంటే నిన్న రేపల్లెలో, మొన్న చిలకలూరిపేటలో కల్తీ మద్యం వల్ల ప్రజల ప్రాణాలు పోయేవా?

రేపల్లెలో మద్యం తాగి చనిపోయినవారివి కూడా సహజ మరణాలుగా చిత్రీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించటం బాధాకరం. ఆహారం ఎక్కువగా తినటం వల్లే చనిపోయారని డాక్టర్లతో చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో తేనెటీగలు రధాలు తగులబెడతాయి, ఎలుకలు మద్యం తాగుతాయి, ఉడుతలు కరెంట్ వైర్లు కొరుకుతాయి. ఇలా ఏదైనా సాధ్యమే. ఏ ప్రభుత్వమైనా అభివృద్ది కార్యక్రమాల ద్వారా వచ్చిన ఆదాయంతో సంక్షేమ పధకాలు అమలు చేస్తాయి.

కానీ జగన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం మద్యంపై వచ్చే ఆదాయంతో సంక్షేమ పధకాలు అమలు చేస్తామనటం సిగ్గుచేటు. తాగుబోతుల్ని 15 ఏళ్లకు తాకట్టు పెట్టి రూ. 58 వేల కోట్లు అప్పుల తెచ్చారు. సంపూర్ణ మద్యపాన నిషేదం ఉన్న మద్యం బ్రాండ్లన దశలవారీగా తగ్గించకపోగా జగన్ రెడ్డి నాసిరకం బ్రాండ్లకు అనుమతులిచ్చి మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి చేత నాసిరకం మద్యం అమ్మిస్తూ ప్రజలు ప్రాణాలు తీస్తున్నారు.

విజయసాయిరెడ్డి అదాన్ డిస్టలరీ పై మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా చంద్రబాబు తనకు వరుసకు అన్నడువుతాడు, అదానీ అల్లుడవుతాడని కబుర్లు చెప్పటం సిగ్గుచేటు. విజయసాయిరెడ్డి హెరిటేజ్ గురించి మాట్లాడటం శూర్పణక సీతమ్మ శీలాన్ని శంకించినట్టుంది. ప్రజల ఆరోగ్యం కాపాడే హెరిటేజ్ పాలకు, కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీసే అదాన్ డిస్టలరీతో పోలికా? హెరిటేజ్ పాలని మిలటరీ వాళ్లు కూడా వాడుతారు, కానీ మీ కల్తీ మద్యం పొరుగు రాష్ట్రాల్లో కూడా అమ్మరు. అదాన్ డిస్టలరీ అనేది విజయసాయిరెడ్డి బినామీ కంపెనీనే. దీనికి మా వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయి. దీనిపై విజయసాయిరెడ్డితో చర్చించేందుకు ఎక్కడైనా ఎప్పుడైనా సిద్దం.

అదాన్‌ డిస్టిలరీస్‌ జగన్ రెడ్డి సియం అయిన తరువాత, 2019 డిసెంబరు 2న ప్రారంభించారా లేదా ? విజయసాయిరెడ్డి చెప్పాలి. సొంతంగా ఒక్క డిస్టిలరీ కూడా లేకుండా వేరే డిస్టిలరీలు లీజుకు తీసుకుని వాటిలో నాసికరం మద్యం తయారు చేస్తున్న అదాన్ కంపెనీకి రెండేళ్లలోనే రూ. 1164.86 కోట్ల విలువైన 68.02 లక్షల కేసుల మద్యం సరఫరాకు ఎందుకు ఆర్డర్లిచ్చారు? అదాన్ డిస్టలరీపై ఎందుకు మీకు అంత ప్రేమ? ఈ కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన కాశీచాయనుల శ్రీనివాసులు మీ (విజయసాయిరెడ్డి) అల్లుడు పెనక రోహిత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు అవునా కాదా? అదాన్ డిస్టలరీ డైరక్టర్ గా ఉన్న శ్రీనివాసా కాశిచాయానుల రోహిత్ రెడ్డికి చెందిన అరబిందో, శ్రేయాస్, టెనెట్ కంపెనీల్లో డైరెక్టర్ గా ఉన్నది వాస్తవం కాదా? రోహిత్ రెడ్డి, శ్రీనివాస్ కాశిచాయానులకు ఉన్న సంబందం ఏంటో విజయసాయిరెడ్డి చెప్పాలి.

ఇవన్నీ జగన్ రెడ్డి, మీ ( విజయసాయిరెడ్డి) సూట్ కేసు కంపెనీలు కాదా? ఎస్పీవై ఆగ్రో డిస్టలరీని పెద్దిరెడ్డి, మిదున్ రెడ్డిలు కబ్జా చేసి విషపు మద్యం తయరు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ స్వీకరించకుండా వేల కోట్లు దిగమింగుతున్నారు. అక్రమంగా డబ్బులు సంపాదించాలంటే జగన్ రెడ్డి, వైసీపీ నేతలు సూట్ కంపెనీలు పెట్టుకోండి అంతే తప్ప కల్తీ మద్యంతో ప్రజలు ప్రాణాలు తీయటం ఎంతవరకు సమంజసం?

కుక్కకు అన్నం పెడితే విశ్వాసంగా పనిచేస్తుంది, కానీ జగన్ రెడ్డికి ప్రజలు సీఎం పదవి ఇచ్చినందుకు ప్రజలకు మేలు చేయాలి కదా. నాడు ఓట్లు వేసి జగన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పిన భారతి రెడ్డి కల్తీ మద్యంపై స్పందించాలి. రాష్ట్రంలో కల్తీ అక్రమ దందాపై, కల్తీ మద్యం తాగి చనిపోయిన ఘటనలపై కేంద్ర ప్రభుత్వం జ్యూడిషియల్ కమీటీ వేయాలి, సీబీఐ విచారణ జరపాలని వంగలపూడి అనిత డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE