Suryaa.co.in

Andhra Pradesh

హత్యలు, అత్యాచారాలు జరిగినా సూపర్ హోం మినిస్టర్ మీడియా ముందుకు రారు

– జగన్ ను ఎవరైనా ఓ మాట అంటే స్క్రిప్టు పట్టకుని వస్తారు
– ఓ పేపరు నుండి వచ్చిన బ్రోకర్ హయాంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పడానికి ఆధారాలు చాలా ఉన్నాయి.
– లోకేష్ ను రోడ్డు మీద తిరగనివ్వనంటున్నారు.. ఆంధ్రా నీయమ్మ మొగుడు జాగీరా.?
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వంగలపూడి అనిత
సూపర్ హోంమినిస్టర్ మీడియా ముందుకు వచ్చారు. ఆడబిడ్డలను చంపినా, హత్యలు, అత్యాచారాలు చేసినా మీడియా ముందుకు రారు. కానీ జగన్ ను ఎవరైనా ఓ మాట అంటే స్క్రిప్టు పట్టకుని వస్తారు. చంద్రబాబు హయాంలో శాంతి భద్రతలు లేవని హోంమంత్రి అంటున్నారు. సూపర్ హోంమంత్రిని అడుగుతున్నా..ఏ ఘటన ఎప్పుడు జరిగిందో తెలుసుకోవాలి. వంగవీటి మోహన్ రంగా హత్య జరిగినప్పుడు చంద్రబాబు సీఎంగా లేరు. 30 ఏళ్ల క్రితం జరిగిన ఘటనలను నెమరేసుకుంటూ..అప్పుడు శాంతి భద్రతలు లేవని, ఇప్పుడ కాపాడుతున్నామని చెప్పడానికి సిగ్గుండాలి.
సుచరిత హోమంత్రి అయ్యాక 500 మందికి పైగా అత్యాచారాలు, హత్యలు జరగడం శాంతి భద్రతల వైఫల్యం కాదా.? ప్రశ్నించినవారిపై దాడి చేయడం, అరెస్టు చేయడాన్ని శాంతి భద్రతల విఘాతం అంటారు. ఓ పేపరు నుండి వచ్చిన బ్రోకర్ హయాంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పడానికి ఆధారాలు చాలా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే అయ్యన్నపాత్రుడు మీ గురించి మాట్లాడిన దాంట్లో తప్పలేదు. నేను దళిత బిడ్డనే..దళిత బిడ్డగా పుట్టినందుకు చాలా ఆనందంగా వుంటా. దళితులుగా పుట్టాం కాబట్టే ఈ స్థాయిలో కూర్చున్నాం. ఎంతో కొంత న్యాయం చేయాల్సిందిపోయి ఎవరి అడుగులకో మడుగులొత్తుతూ మోకాళ్ల కింద నీళ్లు తాగడం సిగ్గుమాలిన చర్య. లేని దిశ చట్టాన్ని ఉందని చెప్పడం ఒక ఎత్తైతే..దాని ద్వారా ముగ్గురికి ఉరిశిక్ష వేసి, 20 మందికిపైగా శిక్షలు వేసామని చెప్పారు. ఈ విషయంలో సిగ్గుందా రాజీనామా చేయాలని అయ్యన్నపాత్రుడు అడిగారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని హోంమంత్రి మాట్లాడుతుంటే బాధేస్తోంది. అవసరమైనప్పుడే దళిత అనే ట్యాగ్ తగిలించి మాట్లాడుతున్నారు. గుణం లేనోడు కులం గొడుగు పట్టుకుని, మానవత్వ లేనేడు మతం ముసుగు వేసుకు తిరుగుతారని నానుడి వుంది. ఏదైనా ఘటన జరిగితే కులాన్ని బయటకు తీసి ముందుకు నడిపే తత్వం జగన్ కు వుంది. వారి భజన బృందానికి కూడా అదే అలవాటు వుంది. నిన్ను దళితరాలివి కాబట్టే ఆ పొజీషన్ లో కూర్చోబెట్టారు. నేను కూడా ఆనందించా. కానీ నువ్వు ఏం న్యాయం చేశావు.? డాక్టర్ సుధాకర్ మీ పోలీసులు కొట్టిన దెబ్బలతో చనిపోయాడు. అది మీ చేతకాని తనం కాదా.? అప్పుడు దళిత అనేది గుర్తులేదా.? కిరణ్ ను మాస్కు లేదని కొడితే చనిపోయాడు. ఆరోజు శాంతి భద్రతల అంశం గుర్తులేదా.? దళిత ఆడబిడ్డను మానబంగం చేసి దిశ స్టేషన్ ముందు వదలి వెళ్తే నీనోరు ఏమైంది.? సీఎం ఇంటికి కూతవేటు దూరంలో దళిత యువతిపై జరిగిన అత్యాచారంలో ఒక నిందితున్ని ఇంకా పట్టుకోలేదు..అప్పుడు శాంతి భద్రతుల ఏమయ్యాయి.? భర్తను కొట్టి మహిళపై గ్యాంగ్ రేప్ కు పాల్పడితే అతీగతి లేద..కనీసం నువ్వు వెళ్లి పరామర్శించలేదు. ఆడిపిల్ల బయటకు వెళ్తే తిరిగి వస్తుందో లేదో తెలియని పరిస్థితి వుంది.
40మందిపై అత్యాచారాలు జరిగాయి. శాంతి భద్రతలు కాపాడలేకపోయావు కాబట్టే రాజీనామా చేయ్. గౌరవంగా నువ్వు రాజీనామా చేస్తే నీ ఇంట్లోనైనా గౌరవం దక్కేది. నీ వ్యవహార శైలికి జగనే ఇంకొకరికి ఇవ్వొచ్చు. చంద్రబాబు ఇంటికి నేను వెళ్తున్నానని పోస్టు పెడితే ఇంటిలిజెంట్స్ ఏం చేస్తున్నారు.? ఇంట్లో తొంగుతున్నారా.? అధికార పక్ష ఎమ్మెల్యే అనుమతి లేకుండా వెళ్తాడా.? అయ్యన్న జగన్ పై మాట్లాడితే చంద్రబాబు ఇంటికి దాడికి వెళ్తావా.? కర్రలతో మీరు వెల్లి దాడి చేసి టీడీపీ వాళ్లు దాడి చేశారని చెప్తున్నారు. వినతిపత్రం ఇవ్వడానికి వెల్లినప్పుడు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్లాలి. అంతేగాని కర్రలు, గునపాలు పెట్టుకుని వెళ్తారా.?
లోకేష్ ను రోడ్డు మీద తిరగనివ్వరా.? ఆంధ్రా నీయమ్మ మొగుడు జాగీరా జోగి.? రాష్ట్రంలో తిరిగే హక్కు అంబేద్కర్ మాకు ఇచ్చారు. మహా అయితే నీపోలీసులతో ఆపగలవు అంతే. పోలీసులను పక్కనబెడితే జగన్ పాలన సున్నా. పోలీసులు పక్కకు వెళ్తే ఎమ్మెల్యేలనే కాదు..వాలంటీర్లను కూడా జనం తంతారు. జడ్ ప్లస్ కేటగిరీ వున్న వ్యక్తి చంద్రబాబు. ఆయనపై దాడి చేయడానికి వెళ్లావంటే ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నావు. జోగిని సస్పెండ్ చేయకుండా జగన్ వెకిలి నవ్వులు నవ్వుతున్నారు.
అయ్యన్నపాత్రుడు మాట్లాడిన మాటల్లో సమాజంలో ఏం జరుగుతోందో మాట్లాడారు. మీ మంత్రులు, ఎమ్మెల్యేల్లాగా నీచంగా మాట్లాడలేదు. మీరు మాట్లాడే బూతుల దెబ్బకు పిల్లలు టీవీలు ఆపేస్తున్నారు. సీఎం, హోంమంత్రికి వార్నింగ్ ఇస్తున్నా. ఆడబిడ్డల మీద దాడులు, అత్యాచారాలు జరిగినందుకు మీ ఇళ్లపై మేము ఎన్ని సార్లు దాడి చేయాలి.? మీ మంత్రులు మాట్లాడిన బాషకు మీ ఇంటి ముందుకు వచ్చి ఒక్కరాయి వేసినా ఈపాటికి మీ ఇళ్లు కూలేదు. అన్ని సార్లు మీ మంత్రులు మాట్లాడారు.
నీకు దమ్ముంటే అయ్యన్న వ్యాఖ్యలకు ప్రజలకు సమాధానం చెప్పండి. చంద్రబాబును కాదు..కదా..గేటు కూడా తాకలేరు. టీడీపీ సైన్యాన్ని దాటి లోపలికి రావాలంటే మీ తాతలు కనిపించాలి. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పెట్టుకున్నోళ్లు బతికి పట్టలేదు. ఆడపిల్లలను రక్షించలేని దద్దమ్మ మంత్రిగా మీరు వుంటారా.? ఇవన్నీ నాకు చేతకావడం లేదు, నేను చేయలేకపోతున్నానని రాజీనామా చేసి గౌరవం నిలబెట్టుకుంటారో మీరే తేల్చుకోండి.

LEAVE A RESPONSE