– సీఐడీ చీఫ్ పై నోరు మెదపరేంటి?
– చట్టం ప్రకారమే పనిచేస్తామని తీర్మానం చేసే ధైర్యం ఉందా?
– పోలీసు సంఘానికి వర్ల సూటి ప్రశ్నలు
అధికార పార్టీ నేతలు బూతు పురాణం వల్లె వేసినప్పుడు లేవని నోరు, ప్రతిపక్షం నోరు జారితే, దాన్ని ప్రతిపక్ష నేత ఖండించిన తర్వాత లేవడం వెనుక ఎవరున్నారంటు ఆంధ్రప్రదేశ్ పోలీసు సంక్షేమ సంఘం నేతలను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య సూటిగా ప్రశ్నించారు. చట్టానికి కట్టుబడి ఉన్నామంటున్న అసోసియేషన్ పెద్దలు, చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ పై నోరు ఎందుకు మెదపలేదంటూ నిలదీశారు. చట్టం ప్రకారమే పనిచేస్తామని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేయలేమని తీర్మానం చేసి, దాన్ని ముఖ్యమంత్రికి పంపే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. పోలీస్ అధికారులకు ఇబ్బంది కలిగినప్పుడు, పోలీసుల సంక్షేమంపై స్పందించాల్సిన రాష్ట్రపోలీస్ అధికారులసంఘం, అధికారపార్టీకి నష్టం కలిగినప్పుడే స్పందించడం చూస్తుంటే..జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడటానికి పడుతున్న తాపత్రయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాజకీయాల్లో తలదూర్చి బలిపశువులు కావొద్దు: “పోలీసుల సంక్షేమం గురించి, వారిసాధకబాధకాల గురించి మాట్లాడాల్సిన అసోసియేషన్ కు, రాజకీయాలెందుకు? రాజకీయాలు మేంచూసుకుంటాము. పోలీసుల సంక్షేమాన్ని మీరుచూసుకోండని సదరు సంఘం పెద్దలకు సూచిస్తున్నాం. మాపార్టీ నాయకుడు చెంగల్రాయుడు తనప్రాంతంలో కొంతమంది పోలీస్ అధికారులు పెడుతున్న ఇబ్బందులు భరించలేక, కడుపుమండి ఒకమాట మాపార్టీ అంతర్గతసమావేశంలో తూలితే, అధ్యక్షస్థానం లో ఉన్న చంద్రబాబు దాన్నివెంటనే ఖండించారు. పోలీస్ అధికారులకు ఇబ్బంది కలిగినప్పుడు, పోలీసులకు సమస్యలు ఉన్నప్పుడు వాటిపై స్పందించడానికే రాష్ట్ర పోలీస్ అధికారులసంఘం ఏర్పాటైంది. మాపార్టీనేత చెంగల్రాయుడి వ్యాఖ్యలపై టీడీపీఅధినేత చంద్రబాబుగారు వెంటనేస్పందించి, ఆయన్ని మందలించారు. దీనిపై పోలీస్ సంఘం రాజకీయం చేయడమేంటి? రాజకీయాల్లోని లోటుపాట్లు మీకు తెలియవు. ఐపీస్ అధికారుల సంఘం ఎందుకు స్పందించలేదు? అధికారం మారినప్పుడు మిమ్మల్ని బలిపశువుల్ని చేస్తారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని బలిపశువులు కావొద్దని సూచిస్తున్నాం.
మీకోసం పోరాడిన ప్రకాష్ కు అన్యాయం జరిగినప్పుడు ఎక్కడున్నారు?:
ప్రకాశ్ అనే కానిస్టేబుల్ పోలీస్ శాఖకు, సిబ్బందికి రావాల్సిన వాటిపై ముఖ్యమంత్రికి విన్నవిస్తే, అతన్ని అన్యాయంగా సస్పెండ్ చేశారు. ఆనాడు అతనికి జరిగిన అన్యాయంపై పెగలని పోలీస్ అధికారులసంఘం నోరు, ఇప్పుడెందుకు పెగిలింది? చిత్తూరుజిల్లా చంద్రగిరిలో పోలీస్ శాఖ అధీనంలోఉన్న స్థలాన్ని, వైసీపీ కార్యాలయ నిర్మాణానికి ఇస్తే, సంఘం ఎందుకు నోరెత్తలేదు? చిత్తూరులో ఆమంచి కృష్ణమోహన్ మీ పోలీసులు కొజ్జాలు అన్నప్పుడు పోలీస్ అసోసియేషన్ నోరు ఏమైంది? అతన్ని అరెస్ట్ చేసి బరబరా స్టేషన్ కు ఈడ్చుకురాలేదేం?
పోలీసులపై అధికారపక్షం దాడిచేస్తే, అకారణంగా దూషిస్తే మీకు కనబడలేదా?
నెల్లూరుజిల్లాలో వైసీపీఎమ్మెల్యే సీఐచొక్కా పట్టుకున్నప్పుడు అసోసియేషన్ అధ్యక్షుడు ఎందుకు నోరెత్తలేదు? కృష్ణాజిల్లాలో వైసీపీఎమ్మెల్యే పార్థసారధి పోలీసుల గు..పగలగొడతా అన్నప్పుడు నోరెత్తలేదేం? వైసీపీఎమ్మెల్యే శ్రీదేవి, సీఐని పట్టుకొని “నాకాళ్లు పట్టుకుంటే నీకు పోస్టింగ్ ఇచ్చాను” అన్నప్పుడు పోలీస్ అసోసియేషన్ నోరుఎందుకు పెగల్లేదు? అధికారపార్టీ ఎమ్మెల్యే సాక్షాత్తూ ఎస్పీని “నీ అంతుచూస్తా, నీబతుకేంటో తేలుస్తా, నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ వా..కాపీకొట్టి వచ్చావా” అంటే అసోసియేషన్ నోరు పెగల్లేదేం? ఆనాడు అసోసియేషన్ మూగబోయిందా? అధికార పార్టీ ఎంపీ కృష్ణలంక స్టేషన్ లోని హెడ్ కానిస్టేబుల్ ను నెట్టేసి, ముద్దాయిలను బయటకు తీసుకెళ్లినప్పుడు పోలీస్ అసోసియేషన్ ఏంచేసింది? ఆఎంపీ చర్యను అసోసియేషన్ తప్పుపట్టిందా? నిన్నటికి నిన్న అదే ఎంపీ మనుషులు ఎస్ఈపీ అధికారుల్నిఅడ్డగించి, ఇసుక అక్రమ రవాణా చేస్తున్న లారీని తీసుకెళ్తే, అసోసియేషన్ నోరు పెగల్లేదేం. మంత్రి రోజా పదిమందిలో ఒక సీఐని “ఆ సీఐ లం…కొడుకు” అంటే అసోసియేషన్ కు వినిపించలేదా? అప్పుడు పెగలని నోరు, ఇప్పుడు పెగిలిందేం? సీఐ ఎదురురొమ్ముపై చెయ్యేసి నెట్టి, బూతుపురాణం విప్పిన మంత్రి సీదిరి అప్పలరాజుపై మీరు నోరు పెగల్చలేదేం? శ్రీకాకుళం జిల్లాలో సీఐ శ్రీమతి లలితను చెంపలు వాయించినప్పుడు పెగలనినోరు, ఇప్పుడు పెగులుతుందేం? తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఎస్ ఐ ఎవరుచెప్పారని శిరోముండనం చేయించాడు? ఇసుకమాఫియాకు చెందిన వైసీపీనేత కృష్ణమూర్తి చెబితేనే కదా ఆపనిచేశారు. ఆపని చేసిన ఎస్ ఐ ఇప్పుడు ఎక్కడున్నాడు? కుప్పంలో వైసీపీనేత సెంథిల్ కుమార్ సీఐపై దాడిచేస్తే, అసోసియేషన్ పెద్దల నోరు ఎందుకు పెగల్లేదు? గురజాల ఎమ్మెల్యే కాసుమహేశ్ రెడ్డి, “ఏందయ్యా బొంగు పోలీసులు, ఎన్నికలు అయ్యాక నాకాళ్లు పట్టుకుంటారు” అంటే అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదేం? వైజాగ్ లో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడిరామకృష్ణ ఇంటిపై వైసీపీవారు దాడిచేసినప్పుడు, పోలీసులకు గాయాలైతే, అప్పుడు మీ అసోసియేషన్ నోరు బొంగురుపోయిందా? ఎంపీ రఘురామరాజుని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఇష్టానుసారం దారుణంగా హింసిస్తున్నప్పుడు పోలీస్ అసోసియేషన్ కు చట్టాలు గుర్తురాలేదా?
సీఐడీ చీఫ్ పై నోరెత్తలేదు ఎందుకు?
చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తూ, అర్థరాత్రి అక్రమఅరెస్ట్ లకు పాల్పడుతున్న సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ పై పోలీస్ సంఘం నోరుపెగలదేం? సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ చట్టబద్దంగా వ్యవహరించడంలేదని పోలీస్ అసోసియేషన్ ఎందుకు అనలేకపోతోంది? చట్టానికి కట్టుబడిఉన్నామంటున్న అసోసియేషన్ పెద్దలు, సీఐడీ విభాగం అరాచకాలపై నోరు కుట్టేసుకున్నారా? 65ఏళ్ల రంగనాయకమ్మను పోలీస్ స్టేషన్ కు లాక్కెళ్లినప్పుడు అసోసియేషన్ పెద్దలైన వారి నోరు పెగల్లేదేం? 75 సంవత్సరాల సీనియర్ జర్నలిస్ట్ కొల్లు అంకబాబుని అర్థరాత్రి అరెస్ట్ చేసి, పోలీసులు బరబరా స్టేషన్ కు ఈడ్చుకెళ్లినప్పుడు పోలీస్ సంఘం పెద్దల నోరు పెగల్లేదేం? అధికారపార్టీకి, జగన్మోహన్ రెడ్డి ప్రభుతవానికి నష్టం జరుగుతుందనే పోలీస్ అసోసియేషన్ ఇప్పుడు బయటకువచ్చిందా? అందుకే పోలీస్ అధికారుల సంఘం నోరు ఇప్పుడు పెగులుతుందా? మాజీమంత్రి అచ్చెన్నాయుడు శస్త్రచికిత్స చేయించుకొని ఇంటిలో ఉంటే, అరెస్ట్ పేరుతో 10గంటలు డొక్కు వ్యానులో తిప్పినప్పుడు పోలీస్ అధికారుల సంఘం నోరు పెగల్లేదేం? 6గురు దళితరైతులపై ఎస్సీఎస్టీకేసు పెట్టి, చేతులకు బేడీలు వేసినప్పుడు పెగలని నోరు ఇప్పుడుందుకు పెగులుతోంది? చట్టవ్యతిరేక పనులు మేంచేయమని మీ సంఘం ఏనాడైనా ప్రభుత్వానికి చెప్పిందా?
పోలీసులకు న్యాయబద్దంగా రావాల్సిన వాటిపై పోరాడండి:
పోలీసుల సెలవుల గురించి, సెలవుల్ని నగదుగా మార్చుకోవడం గురించి, యూనిఫామ్ అలవెన్సుల గురించి, ఆగిపోయిన జీపీఎఫ్ నిధుల గురించి పెగలని నోరు ఇప్పుడే ఎందుకు పెగులుతోంది? ఎంతమంది డీఎస్పీలు, సీఐలు వీఆర్ లో ఉన్నారో అసోసియేషన్ పెద్దలకు తెలియదా? దానిగురించి మాట్లాడరేం? ఒకే కులానికి పోస్టింగ్ లు ఇస్తూ, 33మంది రెడ్లకే ప్రాధాన్యత ఇస్తే, అసోసియేషన్ నోరు తెరవలేదేం? చట్టానికి కట్టుబానిసలైతే స్పందించాలికదా? మిమ్మల్ని బలిపశువుల్ని చేయడానికే అధికారపార్టీ కాగితాలిచ్చి మరీ మీతో మాట్లాడిస్తోంది.
చట్టప్రకారం పనిచేస్తామని తీర్మానం చేయగలరా?
పోలీసులు ఒక వైసీపీ కార్పొరేటర్ ని అరెస్ట్ చేసి, స్టేషన్ లో పెట్టే స్థితిలో ఉన్నారా? పోలీస్ అధికారులందరూ చట్టప్రకారమే పనిచేయాలనే తీర్మానం చేసే ధైర్యం పోలీస్ అసోసియేషన్ కు ఉందా? తీర్మానప్రతులను డీజీపీకి, సునీల్ కుమార్ కు పంపించగలరా? సీఐడీ చేసే అరెస్ట్ లపై అసోసియేషన్ పెద్దలు ఎందుకు మాట్లాడరు? అర్థరాత్రిళ్లు అరెస్ట్ చేయడమేంటి? పోలీస్ అసోసియేషన్ ఇప్పటికైనా మేల్కొని, సాటిసభ్యుల సంక్షేమానికి కట్టుబడాలని, చట్టప్రకారమే పోలీసులు పనిచేయాలని తీర్మానంచేసి, దానికే కట్టుబడాలి” అని వర్ల రామయ్య అన్నారు.