Suryaa.co.in

Andhra Pradesh

బూతుల పోటీల్లో వైసీపీకి గిన్నిస్ రికార్డ్

• బూతుల విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ జగన్ రెడ్డి, రిజిస్ట్రార్ విజయసాయిరెడ్డి….బూతులకాలేజీ ప్రిన్సిపాల్ కొడాలినాని…
• బూతులంటే ఏంటో తెలియదన్నట్లు నటించకు జగన్ రెడ్డి
• అసెంబ్లీని బూతులఅడ్డాగామార్చి, మంత్రులు, ఎమ్మెల్యేలతో బూతోపాఖ్యానం చేయించిన జగన్ గురివిందగింజ తత్వం ప్రజలు గమనిస్తున్నారు
• తనఅవినీతి, అక్రమాలు, దోపిడీ, అసమర్థ పాలన జనానికి తెలియకూడదనే జగన్ రెడ్డి బూతుల్ని నమ్ముకుంటున్నాడు
బొండా ఉమామహేశ్వరరావు 

బూతుల విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అయిన జగన్ రెడ్డి, నరసాపురంసభలో మాట్లాడుతూ, తాను తనపార్టీవాళ్లంతా పత్తిత్తులు అయినట్టు కలరింగ్ ఇవ్వడానికి ప్రయత్నించాడని, అధికారంలోకి వచ్చిందిమొదలు, వైసీపీనేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు వల్లేవేసిన బూతుపురాణం గురించిమాటల్లో చెప్పలేమని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడి న వివరాలు, క్లుప్తంగా మీకోసం…!

“జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక, ప్రతిపక్షాలను, తప్పులను ఎత్తిచూపేవారిని, మీడియాపై వైసీపీనేతలు బూతులదండకం ఎత్తుతున్నారు. వైసీపీనేతల బూతులపంచాంగానికి ప్రజలు ముఖాలమీద ఉమ్మేస్తున్నారు. బూతులకు కేరాఫ్ అడ్రస్, బ్రాండ్ అంబాసిడర్ వైసీపీనే. బూతుల యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ జగన్ రెడ్డి, రిజిస్ట్రార్ విజయసాయిరెడ్డి. కొడాలినానీ బూతులకాలేజీకి ప్రిన్సిపాల్. నర్సాపురంలో జగన్ రెడ్డి మాట్లాడుతూ, తనకు, తనపార్టీ వారికి బూతుఅంటే ఏమిటో తెలియదన్నట్లే నటించాడు. మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేల బూతుబాగోతంపై జగన్ రెడ్డి ఏంసమాధానం చెబుతాడని ప్రశ్నిస్తున్నాం. ఆఖరికి అసెంబ్లీని కూడా బూతులఅడ్డాగా మార్చింది ఈ జగన్ రెడ్డి, అతని పరివారంకాదా?
(ముఖ్యమంత్రిసహా, అధికారపార్టీనేతలు, ఎమ్మెల్యేలు,మంత్రుల బూతులపురాణాల తాలూకా వీడియోలను బొండా ఉమాగారు ఈ సందర్భంగా విలేకరులకు ప్రదర్శించారు.)

75ఏళ్ల స్వాతంత్ర్యభారతంలో ఏనాడూ, ఎవరూ మాట్లాడని విధంగా బూతులు మాట్లాడింది జగన్ రెడ్డి, వైసీపీనేతలే. జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పడే, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబుని కాల్చిచంపాలి.. ఉరితీయాలని ఇప్పుడు ఏంతెలియనట్లు నీతులు చెబుతున్నా డు. కొడాలినాని, అంబటిరాంబాబు, మల్లాదివిష్ణు, ప్రసన్నకుమార్ రెడ్డి, పార్థసారధి, తమ్మినేని సీతారాం, రోజా, విజయసాయిరెడ్డి, ధర్మాన కృష్ణదాస్, అనిల్ యాదవ్, అసెంబ్లీకి తాగివెళ్లే మంత్రి జోగిరమేశ్ లాంటి లుచ్ఛాగ్యాంగ్ భాష జగన్ కు వినిపించలేదా? ఎందుకూ పనికిరాని మల్లాదివిష్ణు మాపార్టీ మహిళానేతను దూషిస్తాడా? వైసీపీ ఎంపీనందిగం సురేశ్, గోరంట్ల మాధవ్ బాగోతాలు జగన్ రెడ్డికి తెలియవా?

విజయసాయిరెడ్డి పచ్చిబూతుల్నే ట్వీట్లరూపంలో ప్రజల్లోకి వదులుతుంటే ముఖ్యమంత్రి ఏంచేస్తున్నాడు? జోగిరమేశ్ తాగి, తనగూండాలతో ప్రతిపక్షనేత ఇంటిపైకి దాడికెళ్లాకే, జగన్ అతనికి మంత్రి పదవిచ్చాడు. ప్రజలందరూ గమనిస్తున్నా తనకేమీ తెలియనట్టు జగన్ రెడ్డే 6నెలలకోసారి బయటకొచ్చి తనకుతానే క్లీన్ చిట్ ఇచ్చుకుంటున్నాడు. బూతుల్లో పుట్టి, వాటిలో పెరిగిన జగన్ రెడ్డి గురివిందగింజలా టీడీపీపై దుష్ప్రచారంచేస్తుంటే చూస్తూఊరుకోం. రాష్ట్రంలో బూతుల సంస్కృతిని తీసుకొచ్చింది వైసీపీనే. బూతులపోటీ పెడితే వైసీపీ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం పొందుతుంది.

తాను గతంలో కొడాలినానీపై మాట్లాడి, తరువాత హుందాతనంగా ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నాను. తనఅవినీతి, అక్రమాలు, దోపిడీ, అసమర్థ పాలన ప్రజలకు తెలియకూడ దనే జగన్ రెడ్డి బూతోపాఖ్యానం చేయిస్తున్నాడు. జగన్ రెడ్డి, ఆయనపార్టీ రాష్ట్రంలో ఎవరినీ వదలకుండా బూతులతో దాడిచేస్తోంది. జగన్ రెడ్డి నీచ, నీతిమాలిన రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. నీచ, హత్యారాజకీయాలకు పెట్టింది పేరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే” అని బొండా ఉమా తేల్చిచెప్పారు.

LEAVE A RESPONSE