– ఈ లక్షలు మంత్రికి చేరాయా? లేక ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరిందా?
– ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ చే విచారణ జరిపించే ధైర్యం సీఎంకు ఉందా?
– ఎంతమంది పార్థూ ఛటర్జీలు మన కేబినెట్ లో ఉన్నారో?
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
ముఖ్యమంత్రి స్థాయి నుంచి వైసీపీ కింది స్థాయి నాయకుడి వరకు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయారు. ప్రభుత్వాన్ని ఏం అడిగినా సమాధానం చెప్పకుండా దాటేస్తున్నారు. కొంతమంది మంత్రులు ఇష్టారాజ్యంగా అవినీతిలో తలమునకలైవున్నారు. వారిలో ఒకరు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరి జయరామ్. కార్మికశాఖామంత్రి కింది అధికారి లేబర్ కమిషనర్ ఇచ్చిన ఆర్డర్స్ కు విలువ లేకుండా పోయింది. జూన్ 30న జోన్ 3లో 13 మంది లేబర్ ఆఫీసర్లను లేబర్ కమిషనర్ కార్తికేయ మిశ్రా కొన్ని బదిలీలు చేశారు.
No.A1/894/2022-Zone-III నెంబర్ తో ఒక ట్రాన్స్ మెమో ఇచ్చారు. ఈ ట్రాన్స్ ఫర్ మెమో సాయంత్రం జాయింట్ కమిషనర్ శ్రీనివాస్ కుమార్ కు చేరింది. ఆ ఉత్తర్వులను అమలు చేయాల్సిన జాయింట్ కమిషనర్ చేయలేదు. మంత్రి కలుగజేసుకొని ఆయనకు సొంతమనుషులైన వారికి వారు కోరుకున్న చోట ట్రాన్స్ ఫర్స్ వేశారు. ఇందుకు ఎన్ని లక్షలు చేతులు మారిందో తెలియదు.గుంటూరు లేబర్ ఆఫీసంతా ఈ విషయంపై గుప్పుమంటోంది. కమిషనర్ ఆర్డర్ ని జాయింట్ కమిషనర్ ఇంప్లిమెంట్ చేయలేదు. జాయింట్ కమిషనర్ ఒక సపరేట్ ట్రాన్స్ ఫర్ ఆర్డర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆఫీస్, మంత్రి, ఆయన సొంతంగా ఇచ్చారో మరి ఎవరు ఇచ్చారో సమాధానం చెప్పాలి.
13మందిలో ఆరుగురికి ఆయన స్వస్థానంలో ట్రాన్స్ ఫర్ ఆర్డర్ ఇచ్చారు. జి. నాగరాజ అనే అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ను ఫస్ట్ సర్కిల్ అమరావతికి ట్రాన్స్ ఫర్ చేస్తే జాయింట్ కమిషనర్ జి నాగరాజను పిడుగురాళ్లకు వేశారు. ఎం. వెంకేటేశ్వర్లు ను నెల్లూరు నుంచి నాయుడుపేటకు వేస్తే జాయింట్ కమిషనర్ అతన్ని ఒంగోలుకు వేశాడు. ఎన్ని లక్షలు చేతులు మారాయో, ఈ లక్షలు మంత్రికి చేరాయా? లేక ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరిందా? ఇంకెవరికి చేరిందో సమాధానం చెప్పాలి.
ఏదైనా మార్పులు చేయదలచుకుంటే ఆర్డర్ ఇచ్చిన ఇష్యూ ఆఫీసరే చేయాలి. మంత్రి చెప్పారని ఇష్టమొచ్చినట్లు మార్చుతారా? సుకన్యను గుంటూరు రెండవ సర్కిల్ కు కమిషనర్ ట్రాన్స్ ఫర్ చేస్తే జాయింట్ కమీషనరేమో అమరావతికి వేశారు. ఎం వినయ్ కుమార్ సర్కిల్ 3 గుంటూరు చిలకలూరిపేట కు వేస్తే జాయింట్ కమిషనర్ తెనాలికి వేశారు. కె. సాంబశివారెడ్డి మాచర్ల నుంచి పిడుగురాళ్లకు వేస్తే జాయింట్ కమిషనర్ మాచర్ల నుండి గుంటూరు 2వ సర్కిల్ కు వేశారు. బి. కోటేశ్వరరావును రాపూరుకు కమిషనర్ వేస్తే దాన్ని జాయింట్ కమిషనర్ చిలకలూరిపేటకు మార్చారు. ఇలా ఆరుమందికి జరిగింది.
కార్తికేయమిశ్రా అనే వ్యక్తి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. మంత్రి మాట వినలేదు, ముక్కుసూటిగా వెళ్లినందుకు ఆయన ఆర్డర్ ను పక్కన పెట్టారు. జాయింట్ కమిషనర్ ని ఆధీనంలోకి తెచ్చుకుని ఆయనతో ఆర్డర్స్ ఇప్పించారు. కార్మిక శాఖ మంత్రి జయరామ్ పై గతంలో ఆడీకార్ ఆరోపణ కూడా ఉంది. దానిపై విచారణ జరుపుతామని ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పినా చర్యలు లేవు. మంత్రిపై విచారణ చేస్తే వెస్ట్ బెంగాల్ లోని పార్థూ ఛటర్జీ మంత్రిలా మారుతారు. వెస్ట్ బెంగాల్ మంత్రి పార్థూ ఛటర్జీని అరెస్టు చేసినట్లుగా మంత్రి గుమ్మనూరి జయరామ్ ను కూడా అరెస్టు చేయొచ్చు.
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ చే విచారణ జరపాలి. గుమ్మనూరి జయరామ్ అరెస్టు కావడానికి అన్ని అర్హతలున్న మనిషి. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ చే విచారణ జరిపించే ధైర్యం సీఎంకు ఉందా? మంత్రి ధైర్యంతోనే ఇలా జాయింట్ కమిషనర్ ఆరుగరిని ట్రాన్స్ ఫర్ చేశారు. ఎన్ని లక్షలు చేతులు మారితే ఈ ఆర్డర్స్ వచ్చాయో తెలియాలి. కమిషనర్ ఆర్డర్, జాయింట్ కమిషనర్ ఆర్డర్ల పై సీఎం, సజ్జల రామకృష్ణారెడ్డిలు ఏం సమాధానం చెబుతారు? ఏం జరిగిందో ప్రజలకు చెప్పాలి. ఎంతమంది పార్థూ ఛటర్జీలు మన కేబినెట్ లో ఉన్నారో? వెలికితీయాలి.
ఈ ఆర్డర్లపై సమాధానం చెప్పకపోతే మీ ప్రభుత్వమంతా అవినీతి ప్రభుత్వమని, మీ మంత్రి మండలి అంతా అవినీతి మంత్రిమండలి అని చెప్పాల్సివుంటుంది. ఎన్ని లక్షల రూపాయలు మంత్రి దిగమింగారో లెక్కతేల్చాలి. ముఖ్యమంత్రికి ఏమాత్రం నైతిక విలువులన్నా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ కు దర్యాప్తు చేయడానికి ఆదేశాలివ్వాలి. బెంగాల్ మంత్రి పార్థూ ఛటర్జీకి పట్టిన గతే కార్మిక మంత్రి గుమ్మనూరు జయరామ్ కు పట్టాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పేర్కొన్నారు.