– ఇద్దరూ పరిధులు దాటి వ్యవహరిస్తున్నారు
– చిలకల రాజేశ్వర్ రెడ్డి ఎవరు? అతను ఏపీకి చెందినవాడు కాదు. అతనికి ఉన్న అర్హత రెడ్డి కులమా?
– జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆసాంతం కక్షలు కార్పణ్యాలు, తప్పుడుకేసులు, వేధింపులే లక్ష్యంగా సాగుతోంది.
– అధికారంచేజారిపోతోందన్న దుగ్ధతోనే (ఫ్రస్టేషన్) జగన్ ప్రతిపక్షాలతో పాటు, సమాజంలోని ప్రముఖుల్ని కూడా దొంగకేసులతో అప్రదిష్టపాలుచేస్తున్నాడు.
• ప్రతిపక్షాలతోపాటు, తెలుగుజాతి గర్వించే వివిధరంగాల ప్రముఖుల్ని సైతం జగన్ ప్రభుత్వం వేధిస్తోంది.
• తెలుగుజాతి గొప్పగాచెప్పుకునే పద్మవిభూషణ్ బిరుదాంకితుల్ని సైతం కుసంస్కారంతో, దొంగకేసులు, తప్పుడుకేసులతో వేధిస్తూ, ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నారు.
• ప్రజల్లో తనపై వ్యతిరేకత ప్రబలిపోయిందని, తనపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని తెలిసే జగన్ తనపార్టీఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశమయ్యాడు
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా కుంటుపడిందిన, ప్రతిపక్షాలపై కక్షతీర్చుకునే పనిలో పాలనా యంత్రాంగం ముమ్మరంగా నిమగ్నమైందని, ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి యంత్రాంగానికి పట్టడంలేదని, పొలిటికల్ వెండెట్టాతోనే జగన్ పాలన ఆసాంతం సాగుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే…
“ప్రభుత్వ యంత్రాంగం కక్షసాధింపులు, వేధింపులు ప్రతిపక్షాలకే పరిమితంకాలేదు. వివిధ వృత్తులు చేసుకుంటూ బతికే సామాన్యులు, ప్రముఖుల్ని కూడా వదలడంలేదు. వారిపై కూ డా అవనసరదాడులు చేస్తూ, ఆయావర్గాల వారిని భయాందోళనకు గురిచేస్తున్నారు. రాచరి క, పాలెగాళ్ల వ్యవస్థను తలపించేలా ప్రభుత్వపాలన సాగుతోంది. రాష్ట్రంలో సాగుతున్నది అ రాచకపాలన కాదని, అంతా ధర్మబద్ధంగానే ఉందని పాలకులు చెప్పగలరా? జగన్ ప్రభుత్వా నికి సభ్యత, సంస్కారాలు ఉన్నాయా? కేంద్రప్రభుత్వం పద్మవిభూషణ్ బిరుదుతో గౌరవిం చిన వ్యక్తినిగురించి, జగన్ మీడియా ఇష్టానుసారం మాట్లాడుతోంది. తెలుగుజాతి గొప్పగా చెప్పుకునే వ్యక్తిని కుసంస్కారంతో, దొంగకేసులు, తప్పుడుకేసులతో వేధిస్తూ, ఆయనపై దుష్ప్రచారం చేస్తారా? ఈ ప్రభుత్వం ఇలాంటిచర్యలతో గిట్టనివారిపై కక్షసాధింపులకు పాల్పడటం సరైందేనా? జరుగుతున్న దానిపై తెలంగాణ హైకోర్ట్ ఏపీ అధికారుల్ని ప్రశ్నించినా వారు ఏమాత్రం సిగ్గుపడలేదు. 9దశాబ్దాలుగా ఆడిటింగ్ చేస్తూ, పేరుప్రఖ్యాతులు పొందిన బ్రహ్మయ్య అండ్ కో ఆడిటింగ్ కంపెనీ డైరెక్టర్ శ్రావణ్ ను ఎందుకు అరెస్ట్ చేశారు. ఈవిధంగా వ్యక్తిగత కక్షసాధింపులకోసమే జగన్ ముఖ్యమంత్రి అయ్యారా? అవినీతికేసుల్లో ఇరుక్కొని 16నెలలు జైల్లో ఉండివచ్చినవ్యక్తిని ప్రజలు గెలిపిస్తే, చట్టవిరుద్ధంగా ఇష్టానుసారం ప్రవర్తిస్తారా?
రాజేశ్వర్ రెడ్డి, రఘురామిరెడ్డి పరిధిదాటి వ్యవహరిస్తే కచ్చితంగా పశ్చాత్తాప్పడతారు. అధికారుల్ని జైలుకుతీసుకెళ్లే అలవాటున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని గుర్తుంచుకోండి. ఏపీ.ఎస్.డీ.ఆర్.ఐ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్) డైరెక్టర్ గా నియ మించిన చిలకల రాజేశ్వర్ రెడ్డి ఎవరు? అతను ఏపీకి చెందినవాడు కాదు. అతనికి ఉన్న అర్హత రెడ్డి కులమా? జగన్మోహన్ రెడ్డిని మెప్పించడం కోసం అతను తప్పుడు అడుగులు, తప్పటడుగులు వేస్తున్నాడు. అతనికి తోడు డీఐజీ కొల్లి రఘురామిరెడ్డి. జగన్మోహన్ రెడ్డికి ఎవరంటే ఇష్టముండదో వారిని తొక్కేయడమే రఘురామిరెడ్డి పని. రాజేశ్వర్ రెడ్డి.. రఘురా మిరెడ్డి ఇద్దరూ పరిధిదాటి, బరితెగించి వెళ్లడం మంచిదికాదని వారికి సూచిస్తున్నా. పరిధి దాటి వ్యవహరిస్తే వారే ఇబ్బందుల్లోపడతారు. వారిచరిత్రను కూడా సేకరిస్తున్నాం. సీఐడీతో, సెంట్రల్ ఇంటిలిజెన్స్ తో టచ్ లో ఉండి వారిపుట్టుపూర్వోత్తరాలు సేకరిస్తున్నాం. అధికారుల్నిజైలుకు తీసుకెళ్లే అలవాటున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని తెలుసుకోండి.
ఐఏఎ స్ శ్రీలక్ష్మి జైలుకెళ్లడానికి జగన్ కారణం కాదా? రాజధాని అమరావతిపై సీఐడీ 4కేసులు దర్యా ప్తుచేస్తుంటే, విచారణలో చంద్రబాబు పేరుచెప్పమని పదేపదే రఘురామిరెడ్డి, అధికారుల్ని, కిందిస్థాయి సిబ్బందిని ఎందుకు బెదిరిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డే శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటారని అనుకుంటున్నారా? చట్టపరిధిలో వ్యవహరించ కుండా అత్యుత్సాహంతో పరిధిదాటి వ్యవహరిస్తున్న రఘురామిరెడ్డి, ఏ అధికారుల్ని ప్రలోభపెట్టి, బెదిరిస్తున్నారో ఆ వివరాలన్నీ తమ వద్ద ఉన్నాయి. లోకేశ్ పేరుచెప్పమని బెదిరిస్తారా? సమయంచూసుకొని అన్ని వివరాలు బయటపెడతాం. రఘురామి రెడ్డి, రాజేశ్వర్ రెడ్డిలకు వ్యతిరేకంగా తాము న్యాయ స్థానాల్ని ఆశ్రయించే పరిస్థితి తెచ్చుకోవద్దని ఇద్దరికీ హితవు పలుకుతున్నాం. జగన్మోహన్ రెడ్డి భారతదేశంలోనే అత్యంతధనవంతుడైన ముఖ్యమంత్రి ఎలాఅయ్యారో రఘురామిరెడ్డి దర్యాప్తుచేసి, అసలువాస్తవాలు ప్రజలకు చెప్పగలరా? అసలు అవినీతిపరుడి నోటిమాటే చట్టంగా ముందుకెళ్తున్నవారు, ఏమీలేని వాటిలో పదేపదే చంద్రబాబు, లోకేశ్ లపేర్లు చెప్పించడం కోసం హద్దులుదాటి ప్రవర్తిస్తు న్నారు.
ఏం తప్పు చేశారని టీడీపీ నేతల్ని తప్పుడు కేసులతో జైళ్లకు పంపి, వేధింపులకు గురి చేశారు?
ఏంతప్పుచేశారని మాజీమంత్రి అచ్చెన్నాయుడిని 83రోజులు రిమాండ్ ఖైదీగా జైల్లో ఉంచారు? దానికి సంబంధించిన ఛార్జ్ షీట్ ఏది? అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయడమే లక్ష్యం గా తప్పుడు రిమాండ్ రిపోర్ట్ తయారుచేశారు. మరో మాజీమంత్రి కొల్లురవీంద్ర చేసిన నేర మేంటి? ఏంతప్పుచేశారని దేవినేని ఉమామహేశ్వరరావుని రాజమహేంద్రవరం జైలుకు పంపారు? పోలీస్ అధికారులకు పదవులు, ప్రలోభాల ఆశచూపి ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు బనాయిస్తారా? ఇదేనా జగన్మోహన్ రెడ్డి చట్టబద్ధ పాలన?
దళితరైతులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టిన దుర్మార్గపు ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ దళితనేతలు ఎం. ఎస్.రాజు, వంగలపూడి అనితలపై పెట్టిన తప్పుడుకేసులు దేనికి నిదర్శనం? ఏదోరకంగా ప్రతిపక్షాలపై దొంగకేసులు పెట్టించడానికే రాజేశ్వర్ రెడ్డి, రఘురామిరెడ్డిలను జగన్ వినియో గిస్తున్నారు. నేలఎరిగి సాముచేయాలని జగన్ కు సూచిస్తున్నాం. పద్మవిభూషణ్, పద్మశ్రీ లు పొందిన గొప్పవాళ్లను గురించి దుష్ప్రచారం చేయడం జగన్ కు, అతనిప్రభుత్వానికి శున కానందం తప్ప ఏమిటి ఉపయోగం?
తన దుకాణం బంద్ కానుందని, తన చాప్టర్ క్లోజ్ కానుందని తెలిసే, జగన్ సొంతపార్టీ ఎమ్మె ల్యేలతో సమావేశాలు
జగన్ కు చంద్రబాబు నిర్ణయాల తాలూకా వేడితగలబట్టే, తనపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ప్రధానప్రతిపక్షనేత వ్యూహాలు, ఆలోచనలు జగన్ కు నిద్రపట్టకుండా చేస్తున్నాయి. తన దుకాణం బంద్ కానుందని, తన చాప్టర్ క్లోజ్ కానుందని జగన్ కు అర్థ మైంది. అందుకే పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశాలు. మంత్రుల్నో తనవద్దకు రానివ్వని జగన్, ఉన్నపళంగా సొంతపార్టీ ఎమ్మెల్యేలతో సమావేశాలు జరపు తున్నాడంటే.. ముమ్మాటికీ భయంతోనే. జగన్ ఆటఅయిపోయింది.. ప్రజలు వైసీపీ ప్రభుత్వ తెరలు చించడానికి సిద్ధంగా ఉన్నారు.” అని రామయ్య దెప్పిపొడిచారు.