– శివారు ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలి
– అన్నదాతలకు వేసవిలో సాగునీటి ఎద్దడి రాకుండా చూడాలి
– ఇరిగేషన్ అధికారులను కోరిన కూటమి పార్టీ సీనియర్ నాయకులు, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం
కాజులూరు: వేసవిలో సాగు నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న అన్నదాతకు కూటమి పార్టీ సీనియర్ నాయకులు, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం అండగా నిలిచారు. కాజులూరు మండలంలోని శలపాక గ్రామ శివారు రైతాంగం రబీ పంటకు సాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నామంటూ రైతులు వాసంశెట్టి సత్యం దృష్టికి తీసుకురాగా, రైతాంగం పక్షాన శనివారం శలపాక గ్రామంలోని శివారు ప్రాంత పంట భూములను స్థానిక రైతులతో కలిసి పరిశీలించారు.
కాజులూరు మండలంలో సుమారు 14 వేల 720 ఎకరాలు భూమి సాగులో ఉండగా శలపాక గ్రామ శివారులో ఉన్న 100 ఎకరాలు (40 హెక్టార్లు)ఆయకట్టుకు నీటి ఎద్దడి ఉంది. ప్రస్తుత రబీ సీజన్లో చిరు పొట్ట దశలో ఉన్న పంటకు సక్రమంగా సాగునీరు అందకపోవడంతో రైతులు పక్షాన పంట పొలాలను సందర్శించి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి నీటి కొరత లేకుండా చూడాలని కోరారు.
కాజులూరు మండలానికి ఆలమూరు లాక్ కోరింగ కెనాల్ ద్వారా సాగునీరు వంతుల వారీగా ఇస్తున్నామని, రైతాంగం నష్టపోకుండా 100 ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఇరిగేషన్ అధికారులు హామీ ఇచ్చారు. ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి కుడా తీసుకెళ్లి ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా కృషి చేస్తానని రైతాంగానికి వాసంశెట్టి సత్యం హామీ ఇచ్చారు. తమ సమస్యను విన్న వెంటనే నేరుగా పంటపొలాలను పరిశీలించి, తమకు మద్దతుగా నిలిచిన వాసంశెట్టి సత్యం కి కాజులూరు మండల పరిధిలో ఉన్న రైతాంగం కృతజ్ఞతలు తెలిపారు.