Suryaa.co.in

Andhra Pradesh

నాడు దాడులు చేయించిన వాళ్లే నేడు నీతులు చెప్తున్నారా?

– హోంమంత్రి అనిత
– వంశీ అరెస్ట్ విషయంలో వైఎస్ఆర్సీపీ నీతి వాక్యాలు విడ్డూరం

విజయవాడ : వైసీపీ నేత వంశీ అరెస్ట్ విషయంలో వైఎస్ జగన్ వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంను తిడితే బీపీ పెరిగి దాడి చేశారని నాడు మాజీ సీఎం జగన్ చెప్పారని.. వంశీ అరెస్టుపై నీతి వాక్యాలు చెప్పడం ఏంటని హొంమంత్రి అనిత ప్రశ్నించారు.

విజయవాడ జీఆర్టీ హోటల్ లో కార్యక్రమం అనంతరం హోంమంత్రి మీడియతో మాట్లాడారు. దళితుడిని భయపెట్టి బెదిరించి వంశీ కిడ్నాప్ చేయించారన్నారు. బాధితుడి అన్ననే ధైర్యం తెచ్చుకుని తిరిగి ఫిర్యాదు చేశారన్నారు. డీజీపీ ఆఫీసు పక్కనే ఉన్న టీడీపీ ఆఫీసుపై దాడి జరిగితే కనీసం రక్షణ కల్పించలేదని ఈ సందర్భంగా హోంమంత్రి ప్రస్తావించారు.

సత్య వర్ధన్ బ్రదర్ వచ్చి వంశీనే బెదిరించి బలవంతంగా అఫిడవిట్ దాఖలు చేశారని చెప్పారని.. పులివెందుల ఎమ్మెల్యే, మాజీ సీఎం జగన్ తెగ బాధ పడుతున్నారని అన్నారు. గత ఐదేళ్లు టీడీపీపై అబద్ధపు కేసులు పెట్టారని, దాడులు చేశారని ఆమె గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ చేసినట్లే రివేంజ్ తీర్చుకోవాలని అనుకుంటే ఇన్ని నెలలు సమయం పడుతుందా అని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.

LEAVE A RESPONSE