విజయవాడ: జాతీయ కాపు సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షునిగా మచిలీపట్నం కు చెందిన ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీని, విజయవాడ బార్ అసోసియేషన్ చెందిన మరో సీనియర్ న్యాయవాది బత్తిన హరి రామ్ ని రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నియమిస్తూ జాతీయ కాపు సంఘం వ్యవస్థాపకుడు, అధ్యక్షులు కర్ణ మురళీకృష్ణ నాయుడు శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కృష్ణా జిల్లా అధ్యక్షుడు జి. నాగరాజు లంకిశెట్టి నియామక ఉత్తర్వులను శనివారం మచిలీపట్నంలో అందజేశారు.
ఈ సందర్భంగా లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర వహిస్తున్న కాపు సామాజిక వర్గంలో పేద మధ్యతరగతి కుటుంబాల నిరుద్యోగ అభ్యున్నతి కోసం కృషి చేస్తానని తెలిపారు. చట్ట ప్రకారం కాపు సామాజిక వర్గానికి రావాల్సిన రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తామన్నారు. లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించినందుకు జాతీయ అధ్యక్షుడు మురళీకృష్ణ కు లంకిశెట్టి ధన్యవాదాలు తెలిపారు.