Suryaa.co.in

Andhra Pradesh

గిరిజనుల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహరాజ్

– మంత్రి లోకేష్‌

అమరావతి: గిరిజనుల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహరాజ్.. సమాజ శ్రేయస్సు కోసం చూపించిన ఆన మార్గం ఆదర్శనీయం. తన పాటలు, రచనల ద్వారా ప్రజలను జాగృతం చేయడానికి అనేక ప్రబోధాలను బోధించారు. బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేశారు. దేశం గర్వించదగ్గ ఆధ్యాత్మిక వేత్త సేవాలాల్ మహరాజ్. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

LEAVE A RESPONSE