Suryaa.co.in

Andhra Pradesh

మైలవరం నియోజకవర్గంలో వసంత కృష్ణ ప్రసాదే ఎమ్మెల్యే

– భవిష్యత్తులో కూడా ఆయనే పార్టీ అభ్యర్థి
– మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో మొదలయిన వైసీపీ ముఠా తగాదాలు జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చేరాయి. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు వ్యతిరేకంగా ఒకవర్గం ప్రారంభించిన అసమ్మతి కార్యక్రమాలు, తిరుగుబాటు సమావేశాలతో పార్టీ రోడ్డునపడిన నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఆయన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు బాసటగా నిలిచారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే సహించే ప్రసక్తి లేదని హెచ్చరించారు.

ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి ఏమన్నారంటే…
మైలవరం నియోజకవర్గంలో వసంత కృష్ణ ప్రసాదే ఎమ్మెల్యే . భవిష్యత్తులో కూడా ఆయనే పార్టీ అభ్యర్థిగా ఉంటారు. వసంత కృష్ణ ప్రసాద్ కు వ్యతిరేకంగా పని చేస్తే పార్టీకి వ్యతిరేకంగా పని చేసినట్టే. అలాంటి వారిపై పార్టీలో కఠిన చర్యలు ఉంటాయి. జోగి రమేష్ పెడన ఎమ్మెల్యేగా ఉన్నారు… ఆయన అక్కడ కొనసాగుతారు. వారిద్దరి మధ్య అనవసర విభేదాలు సృష్టిస్తే ఉరుకోము. అలా ఎవరైనా చేస్తే వారిని పార్టీ నుండి బయటకు పంపేందుకు కూడా వెనుకాడం. అందరూ కలిసి మెలిసి పని చేస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుంది. అనవసర వివాదాలకు దారితీసే చర్యలు ఉపసంహరించాలి.

LEAVE A RESPONSE