పద్మారావు గౌడ్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడి పూజ

Spread the love

సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్ టకార్ బస్తీ లో ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ కుటుంబం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడి పూజా కార్యక్రమం వైభవంగా జరిగింది. యువ నేత తీగుళ్ల రామేశ్వర్ గౌడ్ నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఉప సభాపతి పద్మారావు గౌడ్, స్వరూప పద్మారావు గౌడ్ దంపతులతో పాటు యువ నేతలు కిషోర్ కుమార్ గౌడ్, కిరణ్ కుమార్, త్రినేత్ర గౌడ్ లతో సహా కుటుంబ
padmarao సభ్యులందరూ పాల్గొన్నారు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి దంపతులతో పాటు కార్పొరేటర్లు రేణుక, సునీత, కంది శైలజ, కుమారి సామల హేమల తో సహా సికింద్రాబాద్, కంటోన్మెంట్, సనత్ నగర్, ఖైరతాబాద్, ,మల్కాజ్ గిరి, అంబర్ పెట్, తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తెరాస నేతలు, కార్యకర్తలు ఈ పడి పూజలో పాల్గొన్నారు. పలువురి గురు స్వాముల అధ్వర్యంలో నిర్వహించిన భజన్ కార్యక్రమం అందరిలో ఆధ్యాత్మికతను కలిగించింది. పూజకు హాజరైన్ వారందరికి పద్మారావు కుమారులు తీర్ధ ప్రసాదాలను అందించారు.

Leave a Reply