-అవినీతి ఊసరవెల్లి మంత్రి వెల్లంపల్లి దిగమింగిన రూ.1524కోట్లను జగన్ రెడ్డి ఎప్పుడు అతన్నుంచి కక్కిస్తా డో చెప్పాలి
– దేవాదాయమంత్రిగాఉండి గుడిని, గుడిలో లింగాన్ని మింగి, కొబ్బరిచిప్పలమంత్రిగా వెల్లంపల్లి పేరుప్రతిష్ఠలు పొందాడు
• వెల్లంపల్లి అవినీతి, దోపిడీకి సంబంధించిన ఆధారాలతో ప్రజలముందు బహిరంగచర్చకు తాము సిద్ధం
– తాను ఎలాంటి అవినీతిచేయలేదని జనంలోకి వచ్చిచెప్పే ధైర్యం దేవాదాయశాఖమంత్రికి ఉందా?
• ఆలీబాబా 40 దొంగల గురించి విన్న ప్రజలంతా, ఇప్పుడు జగన్ బాబా 25 దొంగల పనితనం గురించి తెలుసుకుంటుంటే, కళ్లుబైర్లుకమ్మి, నోళ్లువెళ్లబెట్టాల్సిందే
• జగన్ బాబా 25 దొంగలు ప్రజల్ని లూఠీచేసి, రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారు
• మూడేళ్లపాటు రాష్ట్ర మంత్రులుగా దర్జా, దర్పంవెలగబెట్టి, ప్రజల నోట్లో మట్టి కొట్టి, కోట్లకు కోట్లు కొల్లగొట్టిన వారి బాగోతాలను రోజుకొకటి ప్రజలముందుఉంచుతాం
– టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న
రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి కొబ్బరి చిప్పలు అమ్ముకునే దశనుంచి కోట్లకు పడగలెత్తిన వైనం ఎలాంటిదో ప్రజలకు తెలియచేయడానికే నేడు మీడియాముందుకు వచ్చానని టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి, మాజీఎమ్మెల్సీ బుద్దావెంకన్న స్పష్టంచేశారు. ఒకే జాతిపక్షులన్నీ ఒక గూటికి చేరినట్టు దొంగలంతా కలిసి ఒకగజదొంగ స్థాపించిన 420 పార్టీలో చేరారని, అలీబాబా 40దొంగలను మించిపోయేలా జగన్ బాబా అతని 25 దొంగలు కలిసి ప్రజల్ని లూఠీ చేయడంతోపాటు, రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిని చేశారని వెంకన్న వాపోయారు.బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయనమాటల్లోనే …
జగన్ రెడ్డి సహా వైసీపీ నేతలంతా దొంగలని తెలిసి కూడారాష్ట్ర ప్రజలు ఒకఅవకాశం ఇచ్చిచూద్దామని భావించి గెలిపిస్తే, ముఖ్యమంత్రి, మంత్రులంతా కుక్క తోక వంకర అన్నట్లుగా బుద్ధిమార్చుకోకుండా, సిగ్గుశరంలేకుండా యథేచ్ఛగా మూడు లూఠీలు, ఆరుదోపిడీలు అన్నట్లుగా ఈ మూడేళ్లలో వ్యవహరించారు. వైసీపీ 3 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రి నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు, చివరకు వాలంటీర్ల వరకు దోచుకోవడం దాచుకోవడమే పనిగాపెట్టుకున్నారు.
మంత్రులైతే ఏకంగా దొరికిందే ఛాన్స్ అన్నట్లు తరతరాలకు సరిపడా దోచుకున్నారు. వెధవలకు పదవులు ఇస్తే ఎలాఉంటుందో చెప్పడానికి వెల్లంపల్లి శ్రీనివాసే పెద్దఉదాహరణ. కొబ్బరిచిప్పలు అమ్ముకునే దశ నుంచి, కోట్లకు పడగలెత్తిన వెల్లంపల్లి కథాకమామీషు చూస్తే ప్రజలంతా నోరెళ్లబెట్టాల్సిందే. దేవాదాయ శాఖ ఆడిట్ లో రూ.300కోట్లు, ఎన్ వోసీ మంజూరులో చూపిన చేతివాటానికిప్రతిఫలంగా రూ.240కోట్లు, ఇసుకఅక్రమరవాణాతో రూ.120కోట్లు, శ్రీశైలం దేవస్థానం కాంట్రాక్ట్ లో రూ.30కోట్లు, టీటీడీలో పొరుగుసేవల అమ్మకానికి రూ.60కోట్లు, బొక్కేసిన వెల్లంపల్లి మొత్తంగా రూ.1520కోట్లవరకు ప్రజలసొమ్ముని స్వాహాచేశాడు.
విజయవాడ జక్కంపూడి లో దేవాదాయ సత్రం భూములు మూడు ఎకరాలు మింగేశాడు. మంత్రి వెల్లంపల్లి అవినీతి వ్యవహారాల్లో ఆయనసోదరుడు వెల్లంపల్లి రఘుకూడా ప్రధాన నిందితుడిగా వ్యవహరించాడు. ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో రఘు ఏ6 గా ఉన్నాడు. దానికి సంబంధించిన ఆధారాలుకూడా తమ వద్ద ఉన్నాయి. దేవాదాయశాఖ నిర్వహించేవారు ఎవరైనా భయభక్తులతో, భక్తిశ్రద్ధలతో ఉంటారు.
కానీ వెల్లంపల్లి మంత్రికాకముందే వినాయకుడి ఆలయంలోని సొమ్ముని కాజేసేవాడు. ఆ పనితనం చూసే శ్రీనివాస్ కు జగన్ బాబా దేవాదాయశాఖ కట్టబెట్టాడేమో అనిపిస్తోంది. భారత్ బంద్ అనే సినిమాలో ముఖ్యమంత్రిపాత్రధారి అయిన కాస్ట్యూమ్ కృష్ణ, తన కేబినెట్ లో నియమించేవారుగతంలో ఏఏపనుల్లో నిపుణులో ఆలోచించి, వారికి సరిపోయేలా మంత్రి పదవులిస్తాడు.
అదేవిధంగా జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, మూడేళ్లపాటుపదవిలో ఉండేలా ఏరికోరి మరీ తనమంత్రులను ఎన్నుకున్నాడు. దొంగలను బ్యాంకుకు కాపలాపెట్టినట్టు, దోపిడీదారుడికి దేవాదాయశాఖ కట్టబెట్టాడు. దేవుడనే భయంకూడా లేకుండా, తనకు మంత్రిపదవి ఇచ్చారన్న ఆనందంతో పదింతలు దోపిడీకి పాల్పడ్డాడు. గుడిని, గుడిలో లింగాన్ని ఆఖరికి కొబ్బరిచిప్పలను కూడా వదల కుండా వెలంపల్లి స్వాహాచేసేశాడు. ఊసరవెల్లి మార్చేరంగులకంటే కూడా వెల్లంపల్లి కార్లో ఉండే రంగురంగుల జెండాలే ఎక్కువ.
తొలుత ప్రజారాజ్యంలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన వెల్లంపల్లి, తరువాత బీజేపీలో చేరాడు. పైరవీలే ప్రధాన అజెండాగా మంత్రాంగం నడిపి, జగన్ పంచన చేరి, ఎమ్మెల్యేగా గెలిచి, ప్రజల ఖర్మకొద్దీ మంత్రి అయ్యాడు. బీజేపీలోకి చేరకముందు టీడీపీలో చేరడానికి వెల్లంపల్లి ప్రయత్నిస్తే, చంద్రబాబు అవినీతిపరులను దగ్గరకు రానివ్వనని చెప్పడంతో ముఖంచాటేశాడు. వెల్లంపల్లి చరిత్ర తెలిసిన వారుఎవరైనా ఆయన్ని దగ్గరికి కూడ రానివ్వరు.
అలాంటివ్యక్తికి జగన్ బాబా ఏకంగా మంత్రి పదవి ఇచ్చారు. కారణం ఏమిటంటే జగన్ రెడ్డికోరుకునే అర్హతలు (దోపిడీచేయడం, అవినీతికిపాల్పడటం, ఏఎండకు ఆగొడుగుపట్టడం, ప్రభుత్వసొమ్ము, ప్రజలసొమ్మని తేడాలేకుండా మింగేయడంలాంటివి) అన్నీ వెల్లంపల్లికి ఉన్నాయి. జగన్ బాబా దోపిడీకేబినెట్ లో నానియోజకవర్గానికిచెందిన మంత్రే తొలిస్థానంలోఉండటం…అతని బాగోతంగురించి నేనేప్రజలకు చెప్పాల్సిరావడం చూస్తుంటే, ఏంచేయాలోకూడా తెలియడంలేదు.
వెల్లంపల్లి తననియోజకవర్గంతోపాటు, రాష్ట్రంలో మంత్రిగా చేసిన అభివృద్ధి పెద్దగుండుసున్నా.అవినీతిలో మాత్రం ఆయన ఫస్ట్ ర్యాంకర్ గా మిగిలాడు. తనపై టీడీపీచేసిన ఆరోపణలన్నీ అసత్యాలు అని వెల్లంపల్లి బుకాయిస్తే, అతనిదోపిడీ, అవినీతికి సంబంధించిన ఆధారాలను బహిరంగంగా ప్రజల ముందు ఉంచడానికి కూడా తాముసిద్ధంగాఉన్నాము. తమతో వెల్లంపల్లి బహిరంగ చర్చకువస్తే, అతని అవినీతి చిట్టాను ప్రజలముందే విప్పి, అతన్ని దోషిగా నిలబెడతామని ఈ సందర్భంగా తేల్చిచెబుతున్నాను.
మూడేళ్ల జగన్ కేబినెట్ పనితీరు చూస్తే, స్కీమ్ ముసుగులో చేసిన స్కామ్ లే కనిపిస్తున్నాయి
జగన్ బాబా కేబినెట్ మొత్తం గడచిన మూడేళ్లలో ఎప్పుడు ఎవరి ఆస్తులు కబ్జాచేద్దామా, ఏ స్కీమ్ ను అడ్డంపెట్టుకొని ఎలాంటి స్కామ్ చేద్దామా అన్న ఆలోచనలోనే మునిగితేలింది తప్ప, కనీసం ఒక్కరోజైనా ప్రజలగురించి ఆలోచించడం, వారికేదైనా చేద్దామన్న ఆలోచన చేసిన పాపానపోలేదు. రాజకీయాల్లోనైనా, ఉద్యోగాల్లో నైనా, సమాజహితకార్యక్రమాల్లోనైనా రాణించినవారు పదవీ విరమణ చేసినప్పుడు వారు చేసిన మంచిపనులు గురించి చెప్పుకుంటాము.
అలా ఇప్పుడు వీడ్కోలు తీసుకుంటున్న వైసీపీ మంత్రుల గురించి చెబుదామంటే 3 ఏళ్లలో 3 తరాలకు సరిపడా చేసిన అవినీతితప్ప మైక్రో స్కోప్ పెట్టి వెతికినా వాళ్లు చేసిన ఒక్క మంచి పని ఒక్కటీకనిపించడంలేదు. ఒక మంత్రి పేదల నోటికాడి రేషన్ బియ్యం అమ్ముకుంటే, మరో మంత్రి పేదల భూములు లాక్కుంటాడు, ఇంకో మంత్రి హావాలామనీనీ దేశందాటిస్తుంటే, మరోమంత్రి అవినీతికి ప్రతిఫ లంగా బెంజ్ కార్లు పొందుతాడు.
ఇలా జగన్ బాబా కేబినెట్లో ఒక్కో మంత్రిది ఒక్కో అవినీతి చరిత్ర. ముఖ్యమంత్రి జగన్ బాబా అండతో ఈమూడేళ్లలో అవినీతి, దోపిడీలో రెచ్చిపోయిన మంత్రుల అవినీతి బాగోతమంతా, ప్రజలముందు ఉంచబోతున్నాం. రోజుకో మంత్రి అవినీతి చిట్టాను విప్పుతుంటే, ప్రజలతోపాటు, నిన్నటివరకు మంత్రులవెంట తిరిగిన వారి అనుచరులుకూడా నీళ్లు వెళ్లబెట్టకపోతే చూడండి.