తమిళ్ష్‌నాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ‘విజయ్ .. కాంగ్రెస్ పొత్తు’ అన్న మాట అపాయ ఘంటికలా మోగుతోంది. పొత్తుపై ఆధికారిక ప్రకటన రాలేదు. ఈ ‘విజయ్.. కాంగ్రెస్ పొత్తు’ విదేశీ మత మాఫియా ‘మాస్టర్ ప్లాన్’ గా పసిగట్టవచ్చు.
కాంగ్రెస్ ఇంత వరకూ డీ.ఎమ్.కె.తో ఉంది. కాంగ్రెస్ డీ.ఎమ్.కె.ను కాదని విజయ్‌తో కలవడం లేదా కలపడం విదేశీ మాఫియా భయంకరమైన ఎత్తుగడగా పసిగట్టాల్సి ఉంటుంది.
తమిళ్ష్‌నాడులో డీ.ఎమ్.కె., ఎ.ఐ.ఎ. డీ.ఎమ్.కె. ల మధ్య ప్రభుత్వం ఒకసారి అటు ఒకసారి ఇటు అన్నట్టు ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న డీ.ఎమ్.కె. పార్టీపై తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉంది. ముఖ్యంగా అవినీతి, ధన దోపిడి… అవినీతి, ధన దోపిడి డీ.ఎమ్.కె.ను తీవ్రంగా దెబ్బకొట్టనున్నాయి.
విజయ్ వల్ల కూడా డీ.ఎమ్.కె.కు పెద్ద దెబ్బ అన్నది నిర్వివాదం. తీవ్ర డీ.ఎమ్.కె. ఓటరు కూడా ఈసారి తన ఓటు విజయ్‌కే అని అనడం క్షేత్ర స్థాయిలో నాలాంటి వారికి కూడా తెలియవచ్చింది. డీ.ఎమ్.కె. ఓటుకు పెద్దస్థాయిలో గండినకొట్టనున్నారు విజయ్. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈసారి ఎ.ఐ.ఎ. డీ.ఎమ్.కె.కు మాత్రమే కాకుండా విజయ్‌కు కూడా వెళ్లే అవకాశం ఉంది.
ఆదిగా క్రిస్టిఅన్, ముస్లీమ్ ఓటు డీ.ఎమ్.కె. కే పడుతోంది. అంత ఎమ్. జీ.ఆర్. కాలంలోనూ క్రిస్టిఅన్, ముస్లీమ్ ‘మతం ఓటు’ డీ.ఎమ్.కే. దే. డీ.ఎమ్.కె. ప్రభుత్వం తరువాత అనవాయితీగా ఎ.ఐ.ఎ. డీ.ఎమ్.కె.కు ప్రభుత్వం రానీకుండా చేసే ప్రయత్నంగా ‘విజయ్ను మిషనరీ మాఫియా రంగంలోకి దించింది’ అన్న పరిశీలన, అనుమితి (inference) ఉన్నాయి.
ఎ.ఐ.ఎ. డీ.ఎమ్.కె. ప్రభుత్వం అంటే బీ.జే.పీ. ప్రభుత్వం కూడా అని మనకన్నా విదేశీ మాఫియాకు బాగా తెలుసు. బీ.జే.పీ. ఉంటే విదేశీ మత, మాఫియా కార్యాచరణ భంగం, భగ్నం అవుతుంది.
ఊహించిన దాని కన్నా విజయ్‌కు ఎక్కువ రాజకీయ లబ్ది వచ్చే అవకాశం తెలియవస్తోంది. అనుకున్న దాని కన్నా ఎక్కువగా డీ.ఎమ్.కె. దెబ్బ తిననుంది. ఎ.ఐ.ఎ. డీ.ఎమ్.కె., బీ.జె.పీ. ల పొత్తు అధికారాన్ని చేపట్టే అవకాశం సమీపిస్తోంది. ఈ పూర్వరంగంలో ఒక మాస్టర్ ప్లాన్ విజయ్.. కాంగ్రెస్ పొత్తు!
తమిళ్ష్‌నాడులో క్రిస్టిఅన్, క్రిప్టో క్రిస్టిఅన్ ఓటు, ముస్లీమ్ ఓటు ఎ.ఐ.ఎ. డీ.ఎమ్.కె.కు పడదు. ఆ క్రిస్టిఅన్, క్రిప్టో క్రిస్టిఅన్ ఓటూ, ముస్లీమ్ ఓటూ కలిసి 25-30 శాతం ఉంటుంది. ఎన్నికల్లో ఈ 25-30 శాతం ఓటు విజయ్, కాంగ్రెస్, డీ.ఎమ్.కె. పార్టీలదే. ఈ 25-30 కు 10-15% హిందూ-ఓటు కలిస్తే అధికారం హస్తగతం అవుతుంది.
తమిళ్ష్‌నాడు రాజకీయాల్లో కాంగ్రెస్ పెద్ద విషయం కాదు. కాంగ్రెస్ కన్నా విజయ్ తమిళ్ష్‌నాడులో పెద్ద విషయం. ఎన్నికలకు ముందు క్రిస్టిఅన్ ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు, కాంగ్రెస్ ఓటు, విజయ్ ఓటు అన్నిటినీ ఒకవైపుకు తేవడం, డీ.ఎమ్.కె. ఓటు, ముస్లీమ్ ఓటు ఒకవైపుకు నెట్టడం విజయ్.. కాంగ్రెస్ పొత్తు లక్ష్యం.
డీ.ఎమ్.కె. దాదాపుగా ఓడిపోయే స్థితిలో ఉంది. డీ.ఎమ్.కె. ఓటమి ఎ.ఐ.ఎ. డీ.ఎమ్.కె. విజయం కాకూడదు కాబట్టి ఎన్నికల్లో విజయ్…కాంగ్రెస్, కూటమికి, డీ.ఎమ్.కె. కూటమికి కావలసినన్ని సీట్లు రాని స్థితిలో విజయ్.. కాంగ్రెస్ పొత్తుతో వచ్చిన సీట్లు, డీ.ఎమ్.కె.కు వచ్చిన సీట్లను కలిపి విదేశీ మత మాఫియా తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఈ ఎత్తుగడతోనే విజయ్…కాంగ్రెస్ పొత్తు అని గ్రహించవచ్చు.
ఈ పరిస్థితిలో తమిళ్ష్‌నాడు హిందువులు బాధ్యాతాయుతంగానూ, సరైన బుద్ధితోనూ, రాష్ట్రాన్ని విదేశీ మత మాఫియాల నుంచి రక్షించుకునేందుకుగానూ ఓటు వెయ్యాల్సి ఉంటుంది. తమిళ్ష్నాడును దక్కించుకోవడం పూర్తిగా హిందువుల చేతిలోనే ఉంది. మరోసారి విదేశీ మతాల మాఫియాల చేతుల్లోకి వెళితే ఇక తమిళ్ష్‌నాడు కూడా వెస్ట్ బెంగాల్, కర్ణాటక, కేరళ అయి చేయి జారిపోతుంది; హిందువులకు నరకం అయిపోతుంది.
ఆంధ్ర, హర్యాణా, మహారాష్ట్ర, దిల్లీ, బీహార్ స్ఫూర్తితో తమిళ్ష్‌నాడులో తమిళ్ష్‌నాడు హిందువులు విదేశీ మత పోషిత పార్టీలను చావుదెబ్బ కొట్టాలి. తమిళ్ష్‌నాడులో హిందువులు తమ ఉనికి, రక్షణ, క్షేమం, స్వేచ్ఛ కోసం బీ.జే.పీ., ఎ.ఐ.ఎ. డీ.ఎమ్.కె. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి.
తన ప్రభుత్వం కోసం ‘విజయ్ కీలకంగా’ మాస్టర్ ప్లాన్ వేసింది విదేశీ మాఫియా! హిందువులు తమ ఉదాసీనత, నిర్లక్ష్యం, వ్యక్తి ఆరాధన, మందబుద్ధి, అతి-తెలివి, అంధత్వం, అమాయకత్వం వంటి అవలక్షణాలను అధిగమించి వెన్నులో చలి పుట్టించే విదేశీ మత మాఫియా ప్రణాళికలు, పన్నాగాలను వమ్ము చేసి తీరాలి.
ఏం జరగనుందో తమిళ్ష్‌నాడులో…
– రోచిష్మాన్
9444012279