– మాజీ మంత్రి పల్లె
రాష్ట్రంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితులు చక్కబెట్టుటకై చంద్రబాబు నాయుడు పొత్తు నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ బీసీలకు పుట్టినిల్లు లాంటిది బీసీలను తెలుగుదేశం పార్టీని వేరు చేసి చూడలేము. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉంది
ఉచితంగా దొరికే ఇసుకను సైతం పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటూ కోట్ల రూపాయలు తమ ఖాతాలో జమ చేసుకుంటున్నారని. కానీ పేదోడు ఇల్లు కట్టుకోవాలంటే లక్షల రూపాయలు ఇసుకకే వేచించాల్సిన దుస్థితి నేడు రాష్ట్రంలో ఏర్పడిందని. సైకో ముఖ్యమంత్రి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను వంచించి దాడులు చేయించి సునకానందం పొందుతున్నాడని ఆరోపించారు.
ఈ వైసీపీ పాలనలో ప్రభుత్వం అంటే కేవలం జగన్ రెడ్డి, విజయ్ సాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ్ రెడ్లుగా మారిందని. తల్లికి చెల్లికి న్యాయం చేయలేక బయటకు గెంటేసిన ఈ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తాడో ఆలోచించాలని కోరారు.