Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డేనా ప్రభుత్వమంటే?

– బీసీలకు తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు
– టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి

కడప: 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీల కలయిక చారిత్రాత్మకమైంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమిని పార్టీ సభ్యులుగా మేము అందరం స్వాగతిస్తున్నాం. రాష్ట్రంలో నెలకొన్న క్లిష్టపరిస్థితుల ఆధారంగా అధినేత చంద్రబాబు నాయుడు పొత్తు నిర్ణయం తీసుకున్నారు.

వైసీపీ నిరంకుశ పాలనను తుదముట్టించేందుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయనున్నాయి. జగన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడింది. అప్పులాంధ్ర ప్రదేశ్ గా మార్చింది ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం. కులంతో సంబంధం లేకుండా బీసీలు, ఎస్సీ, ఎస్టీలపై దాడులు జగన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగాయి.

వైసీపీ పాలనలో ప్రభుత్వం అంటే కేవలం జగన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డిగా మారింది. ఈ ప్రభుత్వంలో బీసీలను ఎంత హీనంగా చూశారో YSRCP బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణ మూర్తి మాటల్లోనే విన్నాం. బీసీలకు తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు లాంటింది. మొన్న జరిగిన జయహో బీసీ కార్యక్రమం ద్వారా మరోసారి రుజువైంది. ఇంత అరాచక జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు మూడు పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి.

తెలుగుదేశం పార్టీపై కేంద్రంలో ఉన్న బీజీపీ పెద్దలకు కూడా నమ్మకం కలిగింది. అందుకే కేంద్రమే పొత్తులకు ఆహ్వానించింది. తెలుగు ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ సంకల్పించిన మహాయజ్ఞానికి ఇటు జనసేనతో పాటు, బీజేపీ కూడా కలిసి వస్తోంది. నారా చంద్రబాబు నాయుడు దార్శనిక పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రక్షగా ఉంటుందని మేము నమ్మాము, అతిపెద్ద జాతీయ పార్టీతో పాటు దేశం మొత్తం మాకు మద్దతిస్తోంది

LEAVE A RESPONSE